న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోతకు సంబంధించిన ప్రతిపాదనేదీ లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి వస్తున్న వార్తలపై మంత్రి ట్విట్టర్‌లో స్పందించారు. ‘కేంద్ర ప్రభుత్వానికి చెందిన అన్ని రకాల ఉద్యోగుల ప్రస్తుత వేతనాల్లో కోత విధించాలన్న ప్రతిపాదనేదీ ప్రభుత్వ పరిశీలనలో లేదు. వేతనాల్లో కోత ఉంటుందంటూ ఒక వర్గం మీడియాలో వస్తున్న వార్తలు అబద్ధం. అవి నిరాధార వార్తలు’అని పేర్కొన్నారు. కేంద్ర ఉద్యోగుల పెంచిన డీఏ అమలును వాయిదా వేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన ప్రభుత్వం.. వేతనాల్లో కూడా కోత పెడుతుందంటూ వస్తున్న వార్తలపై ఆమె పై విధంగా స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment