
గోఖలే
న్యూఢిల్లీ: సీమాంతర ఉగ్రవాదానికి పాక్ అందిస్తోన్న సాయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ప్రస్తుత పరిస్థితుల్లో సార్క్ సమావేశాల నిర్వహణ కోసం ప్రయత్నాలు కష్ట సాధ్యమని భారత్ తేల్చిచెప్పింది. ప్రధాని మోదీ, నేపాల్ ప్రధాని ఓలి మధ్య చర్చల సందర్భంగా ఈ అంశం ప్రస్తావనకు వచ్చిందని కేంద్ర విదేశాంగ కార్యదర్శి తెలిపారు.
దక్షిణాసియా ప్రాంతంలో సీమాంతర ఉగ్రవాదం విధ్వంసక శక్తిగా ఉన్న ప్రస్తుత తరుణంలో.. సార్క్ సమావేశాల నిర్వహణ ప్రయత్నాలు కష్టమని ప్రధాని మోదీ స్పష్టం చేశారని గోఖలే చెప్పారు. ఉడీ ఘటనతో ఇస్లామాబాద్‌లో 2016లో జరగాల్సిన సమావేశాలు రద్దవడంతో మళ్లీ సార్క్ సమావేశాల నిర్వహణకు పాకిస్తాన్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో భారత్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.