కాల్పులు వెంటనే ఆపండి.. లేదో!
జమ్ము కాశ్మీర్ సరిహద్దు ప్రాంతంలో కాల్పులు, బాంబు దాడులను పాకిస్థాన్ వెంటనే ఆపాలని రక్షణశాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ద్వారా పాకిస్థాన్ అనవసర ఉద్రిక్తతలను రెచ్చగొడుతోందని, అలా చేస్తే ఎవరూ మిగలరని ఆయన హెచ్చరించారు.
అవతలి పక్షం వాళ్లు కాల్పులను వెంటనే ఆపకపోతే తమవైపు నుంచి కూడా తీవ్ర చర్యలు తప్పవన్న పరోక్ష సూచనలను ఆయన ఇచ్చారు. కాల్పులు అటునుంచి కొనసాగినంత కాలం శాంతి అనేది ఉండబోదని జైట్లీ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.