9/11 దాడులకు భారత్ నుంచి నిధులు! | Part of funding for 9/11 came from India, says ex-top cop Neeraj Kumar | Sakshi
Sakshi News home page

9/11 దాడులకు భారత్ నుంచి నిధులు!

Published Tue, Nov 17 2015 7:22 PM | Last Updated on Sun, Sep 3 2017 12:37 PM

9/11 దాడులకు భారత్ నుంచి నిధులు!

9/11 దాడులకు భారత్ నుంచి నిధులు!

న్యూఢిల్లీ: ఉగ్రవాదుల చర్యల్లో అత్యంత హేయమైనదిగా భావించే 9/11 దాడికి భారత్ నుంచి నిధులు వెళ్లాయి. పేలుడు పదార్థాల తయారీ, విమానాల హైజాక్ నుంచి ట్విన్  టవర్స్ కూల్చివేత వరకు పథకాన్ని పక్కాగా అమలుపర్చేందుకు ఉగ్రవాదులు బోలెడు డబ్బు ఖర్చయింది. అందులో కొంత భారత్ నుంచి సమకూరింది. అది ఎలాగంటే..

కోల్కతాలోని అమెరికన్ సెంటర్ పై దాడి (జనవరి 2, 2002) కేసులో ఉరిశిక్ష పడిన దోషి, ప్రస్తుతం జైలులో ఉంటోన్న అఫ్తాబ్ అన్సారీ.. తన గ్యాంగ్తో కలిసి 2001లో ఖాదీమ్ వ్యాపార సంస్థల అధిపతి పార్థా ప్రతిమ్ రాయ్ బర్మన్ను కిడ్నాప్ చేశాడు. బాధితుడ్ని విడిచిపెట్టే క్రమంలో భారీగా సొమ్ము చేతులు మారింది. అప్పటికే దుబాయ్ నేర సామ్రాజ్యాధిపతులు, పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థల నాయకులతో సంబంధాలున్న అఫ్తాబ్.. బర్మన్ కిడ్నాప్ ద్వారా లభించిన సొమ్ములో కొంత భాగాన్ని షేక్ ఒమర్ కు పంపాడు. ఈ షేక్ ఒమర్ ఎవరంటే..

1999 కాందహార్ విమాన హైజాక్ ఉదంతంలో భారత్ విడిచిపెట్టిన ఉగ్రవాదుల్లో ఒకడు షేక్ ఒమర్. సొంత సంస్థ హర్కత్ ఉల్ ముజాహిద్దీన్ తోపాటు తాలిబన్లతో కలిసి కార్యకలాపాలు నిర్వహించేవాడు. ప్రస్తుతం పాక్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇతను మొహమ్మద్ అట్టాకు అత్యంత నమ్మకస్తుడు. ఈ అట్టాయే 9/11 దాడుల కీలక సూత్రధారి. ఒమర్‌ కు...  అన్సారీ నమ్మినబంటు కావడంతో అడిగిందే తడవుగా తన దగ్గరున్న డబ్బును పాక్ కు చేరవేశాడు . అలా ఆ సొమ్ము ట్విన్ టవర్స్ కూల్చివేతకు వినియోగించారు. దాడుల అనంతరం అట్టాను ఎఫ్ బీఐ అరెస్టు చేసింది. విచారణ సందర్భంగా స్వయంగా అట్టాయే ఈ విషయాలు వెల్లడించాడని, ఆమేరకు ఎఫ్ బీఐ అధికారి జాన్ పిస్టోల్ తన రిపోర్టులో అట్టా వాగ్మూలాన్ని నమోదుచేశారు.



ఇక్కడ మనం చదివింది కేవలం ఒక ఊహ కాదు.. సాక్షాత్తూ ఢిల్లీ మాజీ పోలీస్ కమిషనర్ నీరజ్ కుమార్ తన పుస్తకంలో వెల్లడించిన విషయాలు. నాలుగేళ్ల కిందట రిటైర్మెంట్ తీసుకున్న ఆయన.. తన ఉద్యోగానుభవాలను క్రోడీకరిస్తూ ఓ పుస్తకాన్ని రాశారు. అందులో తాను సీబీఐలో పనిచేసిప్పుడు ఎదురైన అనుభవాలను పొందుపర్చారు. 9/11 దాడులకు భారత్ నుంచి నిధులు ఎలా వెళ్లింది, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతో ఫోన్ లో ఏం మాట్లాడింది, దావూద్, అతని సోదరుడు అనీస్ ల నుంచి ఎలాంటి అభ్యర్థనలు ఎదురైంది పూసగుచ్చినట్లు వివరించారు. నీరజ్ కుమార్ ప్రస్తుతం బీసీసీఐ అవినీతి నిరోధక శాఖకు చీఫ్ గా వ్యవహరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement