
'భూసేకరణ చట్టంలో మార్పులకు సిద్ధం'
దేశానికి ప్రజల శక్తి సామర్థ్యాలే ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మోదీ మాట్లాడారు.
న్యూఢిల్లీ: భూసేకరణ చట్టంపై ఎన్డీఏ ప్రభుత్వం ఎట్టకేలకు దిగి వచ్చింది. భూసేకరణ చట్టంపై విపక్షాలు ఆందోళన తీవ్రతరం చేస్తూ ఏకతాటిపైకి రావడంతో కేంద్ర ప్రభుత్వం కాస్త తగ్గింది. భూసేకరణ చట్టంలో మార్పులకు సిద్ధంగా ఉన్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దేశానికి ప్రజల శక్తి సామర్థ్యాలే ముఖ్యమని మోదీ స్పష్టం చేశారు. దేశంలో చోటు చేసుకున్న సమస్యలను కాలానుగుణంగా పరిష్కరించుకోవాల్సి ఉందన్నారు. భూసేకరణ చట్టంతో వచ్చిన కాంగ్రెస్ కు తక్కువ ఓట్లు వచ్చాయని, రైతులకు ఆ చట్టం నచ్చితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది కాదా?అని ప్రశ్నించారు. భూసేకరణ చట్టాన్ని సవరిస్తూ తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో ఎటువంటి తప్పులేదన్నారు. ఒకవేళ తప్పులున్నాయని నిరూపిస్తే సరిదిద్దుకుంటామని మోదీ తెలిపారు. దేశాభివృద్ధి తమ లక్ష్యమని, చివరకు విజయం సాధిస్తామన్నారు. బొగ్గు గనుల వేలం ద్వారా రూ. లక్ష కోట్లు సమీకరించామని మోదీ తెలిపారు. పండించే రైతులకు భూసారం తెలియాల్సి ఉన్న భూసార కార్డులు ఇస్తున్నామన్నారు.
లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మోదీ ప్రసంగించారు. సమస్యలు ద్వారానే చర్చలు పరిష్కారమవుతాయన్నారు. ప్రభుత్వ ప్రాధమ్యాలను రాష్ట్రపతి ప్రసంగంలో వివరించిన సంగతిని మోదీ గుర్తు చేశారు. స్వచ్ఛ్ భారత్ పై అందరూ మాట్లాడుతున్నారు, దేశంలో అపరిశుభ్రత కూడా సమస్యే అని మోదీ తెలిపారు. 'మన దేశ మూల సూత్రం సర్వేజనా సుఖినోభవంతు.దేశానికి ప్రజల శక్తి సామర్ధ్యాలే ముఖ్యం. అవినీతి వల్లే దేశం భష్ట్ర్రు పట్టిపోయింది. అవినీతి మహ్మమ్మారి నుంచి దేశాన్ని కాపాడాలి' అని మోదీ తెలిపారు.ఇప్పటికీ పాఠశాలల్లో టాయిలెట్స్ లేకపోవడం విచారకరమన్నారు. పథకాల పేర్ల మార్పు సమస్య కాదని, ప్రభుత్వ పథకాల అమలు తీరే ప్రధానమన్నారు
ప్రధాని ప్రస్తావించిన మరికొన్ని విషయాలు..
*బొగ్గు గనుల వేలం ద్వారా రూ. లక్ష కోట్లు సమీకరించాం
*పండించే రైతులకు భూసారం తెలియాలి
*మన విద్యార్థులే భూసార పరీక్షలు నిర్వహించి భూసార కార్డులు రైతులకు ఇస్తారు
*పెన్షన్ తీసుకోవాలంటే ప్రతి నవంబర్ లో లైఫ్ సర్టిఫికేట్ కావాలా?
*బతికున్నాడో?లేదో? సాంకేతిక పరిజ్ఞానంను ఉపయోగించుకోలేమా?
*మనిషి తనకు తాను బతికి ఉన్నాడని చెప్పుకోవడం దౌర్భగ్యం
*అనవసరమైన ఖర్చులు తగ్గించి అధికార వికేంద్రీకరణను మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం