న్యూఢిల్లీ : కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఉద్ధవ్‌పై మండిపడ్డ పియూష్ గోయల్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత రైల్వే శాఖ మహారాష్ట్రలోని వలస కార్మికులను తరలించేందుకు సరిపడా రైళ్లను సమకూర్చడంలేదన్న ఉద్ధవ్ వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. ఈ మేరకు సోమవారం ట్విటర్ వేదికగా పియూష్ గోయల్ స్పందిస్తూ.. ‘‘మహారాష‍్ట్రకు సంబంధించిన 125 రైళ్ల లిస్ట్ ఎక్కడుంది? ఈ ఉదయం 2 గంటల ప్రాంతంలో కేవలం 46 రైళ్లకు సంబంధించిన వివరాలు మాత్రమే అందాయి. వీటిలో పశ్చిమ బెంగాల్, ఒడిస్సాలకు వెళ్లేవి 5 ఉన్నాయి. అవి కూడా అంఫాన్ తుపాను కారణంగా రద్దయ్యాయి. ( లాక్‌డౌన్ ఒకేసారి ఎత్తేయడం సరికాదు: ఉద్ధవ్)
125 రైళ్లకు సంబంధించి ఈ రోజు కేవలం 41 రైళ్ల వివరాలను మాత్రమే పంపారు. మీరు ప్రయాణికుల వివరాలను మరో గంటలో పంపిస్తే.. మేము రాత్రీపగలు కష్టపడైనా రేపటి ట్రైన్ షెడ్యూల్‌ను తయారుచేస్తాము’’ అని అన్నారు. కాగా, మహారాష్ట్ర ప్రభుత్వం మొదట 200 రైళ్లకు సంబంధించిన లిస్టును రైల్వే శాఖకు పంపి, ఆ తర్వాత వద్దని చెప్పటంతో ఇద్దరి మధ్యా అగ్గిరాజుకుంది.
Comments
Please login to add a commentAdd a comment