లక్నో: కానిస్టేబుల్ పరీక్షలో చీటింగ్‌కు పాల్పడుతున్న 16 మంది వ్యక్తులను ఉత్తరప్రదేశ్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. యూపీలో రెండు రోజుల పాటు జరుగనున్న కానిస్టేబుల్ నియామక పరీక్షల్లో అభ్యర్ధులకు బ్లూటూత్‌ల ద్వారా సమాధానం చేప్పేందుకు వారిని నుంచి డబ్బులు తీసుకున్నారన్న సమాచారంతో స్పెషల్ టాస్క్ పోర్స్ ( ఎస్‌టీఎఫ్) పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. పరీక్ష రాస్తున్న అభ్యర్ధులకు సమాధానాలు చేరవేసేందుకు అభ్యర్ధుల నుంచి డబ్బులు వసూలు చేశారన్న సమాచారంతో ఇర్ఫాన్ అహ్మద్, సతేంద్ర సింగ్, ఇమ్రాన్, కుషాల్, పవన్ సింగ్ అనే యువకులు అరెస్ట్ చేశామని అలహాబాద్ ఐజీ అమితాబ్ యాశ్ తెలిపారు.
వారి నుంచి మూడు ఫోన్లు, బ్లూటూట్‌లు, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధినం చేసుకున్నామన్నారు. పటిష్టమైన భద్రత నడుమ పరీక్షలను నిర్వహిస్తున్నామని, అభ్యర్ధులు ప్రత్యేక యూనిఫాన్‌తో పరిక్షకు రావాలని, బూట్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష హాల్‌లో అనుమతించట్లేదని నిర్వాహకులు తెలిపారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 41,520 పోస్ట్‌లకు నోటిఫికేషన్ విడుదల కాగా 23 లక్షల మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment