
రాజకీయాలు వృత్తి కాదు సేవ
రాజకీయాల్ని వృత్తిగా గాక సేవగా పరిగణించాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
న్యూఢిల్లీ: రాజకీయాల్ని వృత్తిగా గాక సేవగా పరిగణించాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం విద్యార్థులతో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులడిగిన ప్రశ్నలకు మోడీ సమాధానాలిచ్చారు.
ప్రధానిగా ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారన్న ఓ విద్యార్థి ప్రశ్నకు.. సేవ చేయాలన్న భావన ప్రజలతో అనుబంధాన్ని కలిగిస్తుందని మోడీ చెప్పారు. సేవాభావంతో పనిచేస్తే ఒత్తిడి, అలసట ఉండవని అన్నారు.