న్యూఢిల్లీ: లోక్‌పాల్, కేంద్ర విజిలెన్స్ కమిషన్(సీవీసీ)లకు ఈసారి బడ్జెట్‌లో కేటాయింపులు పెరిగాయి. లోక్‌పాల్‌కు రూ. 7.18 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే ఇది మూడు రెట్లు అధికం. అలాగే, సీవీసీకి గతేడాది రూ. 20.35 కోట్లు కేటాయించగా, ఈసారి ఆ మొత్తాన్ని రూ. 27.68 కోట్లకు పెంచారు. కాగా, లోక్‌పాల్‌కు కేటాయించిన మొత్తాన్ని దాని ఏర్పాటు, నిర్మాణానికి వినియోగించనున్నారు. సీవీసీకి కేటాయించిన మొత్తంలో రూ. 25.68 కోట్లను సంస్థాగత వ్యయం కోసం, మిగిలిన రూ. రెండు కోట్లను సీవీసీ ప్రాజెక్టు సామర్థ్య పెంపు కోసం వినియోగిస్తారు.