నితీశ్‌ను కాంగ్రెస్‌ అధ్యక్షుణ్ని చేయండి: గుహ | Ramchandra Guha about Nitish Kumar | Sakshi
Sakshi News home page

నితీశ్‌ను కాంగ్రెస్‌ అధ్యక్షుణ్ని చేయండి: గుహ

Published Thu, Jul 13 2017 1:58 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Ramchandra Guha about Nitish Kumar

న్యూఢిల్లీ: నానాటికీ క్షీణిస్తున్న కాంగ్రెస్‌ పునరుత్తేజం పొందాలంటే ఆ పార్టీ అధ్యక్ష పదవిని జేడీయూ నేత, బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌కు అప్పగించాలని ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ సూచించారు. నాయకత్వ మార్పుతోనే కాంగ్రెస్‌ తిరిగి కోలుకుంటుందని వ్యాఖ్యానించారు.

‘ఇది నా ఊహ మాత్రమే. కాంగ్రెస్‌కు నాయకుడు లేడు, నితీశ్‌కు పార్టీ లేదు. నితీశ్‌ స్నేహపూర్వకంగా కాంగ్రెస్‌ పగ్గాలు చేపడితే అది స్వర్గంలో కుదిర్చిన పెళ్లి అవుతుంది’ అని సరదాగా అన్నారు. నితీశ్‌ను కాంగ్రెస్‌ అధ్యక్షుణ్ని చేయకపోతే ఆయనకు, సోనియా గాంధీకి దేశ రాజకీయాల్లో భవిష్యత్తు ఉండదని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement