‘చెత్త’శుద్ధి ఉండాల్సిందే! | responsible for the cleanliness | Sakshi
Sakshi News home page

‘చెత్త’శుద్ధి ఉండాల్సిందే!

Published Wed, Apr 22 2015 1:08 AM | Last Updated on Tue, Aug 28 2018 5:25 PM

‘చెత్త’శుద్ధి ఉండాల్సిందే! - Sakshi

‘చెత్త’శుద్ధి ఉండాల్సిందే!

సభలు, సమావేశాల తర్వాత  శుభ్రత బాధ్యత నిర్వాహకులదే
ముందే సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి; మార్గనిర్దేశకాలు జారీ చేసిన కేంద్రం

 
న్యూఢిల్లీ: బహిరంగ ప్రదేశాల్లో జరిగిన సభలు, సమావేశాలకు ఎప్పుడైనా వెళ్లారా? కార్యక్రమం తరువాత ఆ ప్రాంతాన్ని గమనించారా? ఖాళీ వాటర్ బాటిళ్లు, నీళ్ల ప్యాకెట్లు, వాడిపారేసే గ్లాసులు, తిని పడేసిన ఫుడ్ ప్యాకెట్లు, ప్లాస్టిక్ కవర్లు.. ఇంకా పేపర్లు, కరపత్రాలు, బ్యానర్లు.. ఎక్సెట్రాలతో చెత్త చెత్తగా ఉంటుంది కదా! అంతేకాదు.. టాయిలెట్ల సౌకర్యం లేకపోవడంతో ఆ ప్రాంతమంతా కంపు కొడ్తూ కూడా ఉంటుంది కదా! కార్యక్రమం పూర్తయిందంటే నిర్వాహకులు ఆ చుట్టుపక్కల కూడా కనిపించకపోవడం కూడా మామూలే కదా! ఇకపై అలా కుదరదు. కార్యక్రమం తరువాత నిర్వాహకులు ‘చెత్త శుద్ధి’ బాధ్యత తీసుకోవాల్సిందే. అదీ కార్యక్రమం పూర్తయిన ఆరు గంటల్లోగా ఆ ప్రాంతమంతా శుభ్రపడిపోవాలి.

అంతేకాదు.. సభ ప్రాంగణంలో డస్ట్‌బిన్లు, తాత్కాలిక టాయిలెట్లను ఏర్పాటుచేయాలి. కాదు, కూడదంటే.. మున్సిపల్ అధికారులు ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయిస్తారు కానీ ఆ ఖర్చును మాత్రం నిర్వాహకుల దగ్గరే వసూలు చేస్తారు. అందుకోసం ముందే నిర్వాహకుల నుంచి సెక్యూరిటీ డిపాజిట్‌ను వసూలు చేస్తారు. ‘స్వచ్ఛ భారత్’లో భాగంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ తాజాగా ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది. తక్షణమే అమల్లోకొచ్చేలా ఈ నియమ నిబంధనలను మంగళవారం జారీ చేసి, రాష్ట్రాలకు కూడా పంపించింది. ఆ వివరాలు..

కార్యక్రమ నిర్వహణకు అనుమతి తీసుకునే సమయంలోనే నిర్వాహకులు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. అది సభికుల సంఖ్య 500 లోపైతే రూ. 10 వేలు, 5 వేలమందైతే రూ. 50 వేలు, సభికులు 50 వేల వరకు ఉంటే లక్ష రూపాయలను డిపాజిట్‌గా చెల్లించాలి. అనుమతినిచ్చేది పోలీసులైతే.. పోలీసుల వద్దే ఆ డిపాజిట్ ఉంచాలి. కార్యక్రమం తరువాత ప్రాంగణాన్ని శుభ్రం చేయనట్లైతే.. ఆ డిపాజిట్ డబ్బుతో అధికారులే శుభ్రం చేయిస్తారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement