'జయంతి నటరాజన్ వెల్లడించిన అంశాలు తీవ్రమైనవి'
న్యూఢిల్లీ : కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జయంతి నటరాజన్ వెల్లడించిన అంశాలు చాలా తీవ్రమైనవని పర్యావరణ మంత్రిత్వ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. సంబంధిత ఫైళ్లపై పరిశీలన చేస్తామని ఆయన శుక్రవారమిక్కడ తెలిపారు. మరోవైపు యూపీఏ ఇచ్చిన అనుమతులపై పర్యావరణ శాఖ పరిశీలన చేయాలని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అభిప్రాయపడ్డారు.
కాగా కేంద్ర మాజీ పర్యావరణ శాఖ మంత్రి జయంతి నటరాజన్ ...సోనియాగాంధీ, రాహుల్పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పర్యావరణ అనుమతులపై రాహుల్తో పాటు పలువురు తనపై ఒత్తిడి తెచ్చారని ఆమె వ్యాఖ్యలు చేశారు.