మంత్రాలయంలో సమావేశ వేదికపై మోహన్‌భగవత్ తదితరులు
మంత్రాలయం : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) అఖిల భారతీయ సమన్వయ సమావేశాలు శుక్రవారం కర్నూలు జిల్లా మంత్రా లయంలో ప్రారంభమయ్యాయి. స్థానిక తిరు మల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపంలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్‌భగవత్ నేతృత్వంలో ఈ నెల రెండో తేదీ వరకు మూడు రోజులపాటు కొనసాగుతాయి. శ్రీమఠం పీఠాధిపతి సుబుధేం ద్రతీర్థులు జ్యోతి ప్రజ్వలన గావించి సమావేశా లకు అంకురార్పణ చేశారు. ముఖ్యఅతిథులుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, అఖిల భారతీయ సహ ప్రచార ప్రముఖ్ నరేంద్ర హాజరయ్యారు. ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ 36 సంఘ్ పరివార్‌లకు చెందిన 54 శాఖల రాష్ట్ర స్థాయి ముఖ్య ప్రచారక్‌లు, ప్రతినిధులు 202 మంది హాజరయ్యారు. పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు మాట్లాడుతూ ఇతర దేశాల కంటే భారతదేశం ఎంతో శ్రేష్టమైందన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన స్థానిక ఎస్‌వీబీ వసతి భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ సమావేశ ఉద్దేశాలను వివరించారు.
సామాన్య కార్యకర్తలా అమిత్‌షా..
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సమావేశ వేదికపై కాకుండా పాఠాలు నేర్చుకునే విద్యా ర్థిలా స్టేజీకి బహుముఖంగా కూర్చున్నారు. మే ధావుల ప్రసంగాలు వింటూ సాధారణ వ్యక్తిగా నడుచుకోవడం చూపరులను ఆశ్చర్య చకితుల ను చేసింది. సమావేశ విరామ సమయంలోనూ ఓ కుర్చీపై అలా సేద తీరుతూ .. తేనీరు తీసు కుంటూ కనిపించారు. ఆర్‌ఎస్‌ఎస్ ఏపీ ప్రచార ప్రముఖ్ భరత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment