గనుల తవ్వకాల్లో అక్రమాల నిరోధానికి ఉపగ్రహ ఆధారిత నిఘా వ్యవస్థ(ఎంఎస్‌ఎస్)ను కేంద్రం శనివారం ప్రారంభించింది.
న్యూఢిల్లీ: గనుల తవ్వకాల్లో అక్రమాల నిరోధానికి ఉపగ్రహ ఆధారిత నిఘా వ్యవస్థ(ఎంఎస్‌ఎస్)ను కేంద్రం శనివారం ప్రారంభించింది. దేశ సహజ వనరులను సమర్థంగా వినియోగించుకునేందుకు ఇది ఉపకరిస్తుందని గనుల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. అనుమతి ఉన్న ప్రాంతానికి ఆవల మైనింగ్ చేపడితే ఎంఎస్‌ఎస్ హెచ్చరికలతో కూడిన అలర్ట్‌లను జారీ చేస్తుంది. వీటిని ఐబీఎం రిమోట్ సెన్సింగ్ నియంత్రణ కేంద్రం అధ్యయనం చేసి క్షేత్రస్థాయి పరిశీలనను సంబంధిత జిల్లా అధికారులకు పంపుతుంది.
గని కార్మికుల సమాచారాన్నీ ఆన్‌లైన్‌లో అందిస్తుంది. దీంతో మెరుగైన భద్రతా ప్రమాణాలు రూపొందించవచ్చు. ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్, గాంధీనగర్‌లోని భాస్కరాచార్య ఇనిస్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్ అండ్ జియో ఇన్ఫోమాటిక్స్, ఎలక్ట్రానిక్స్, ఐటీ మత్రిత్వ శాఖ సంయుక్తంగా ఎంఎస్‌ఎస్‌ను అభివృద్ధి చేశాయి.