surveillance system
-
నియంత్రణ సంస్థల సేవలు ప్రశ్నార్థకం
ఆర్థికపరమైన అవకతవకలపై తిరుగులేని అధికారాలు చలాయిస్తున్న నియంత్రణా సంస్థగా ‘సెబీ’కి పేరుంది. కానీ వివిధ ప్రభుత్వాల పాలనా కాలాల్లో అది మౌనం పాటించడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ప్రభుత్వ నిర్ణయాలపై పారదర్శకతను నెలకొల్పడమే స్వతంత్ర రెగ్యులేటరీ కమిషన్ల ఏర్పాటు ఉద్దేశం. అలాంటిది స్వయం నియంత్రణా సంస్థలే తమ విధులను సంతృప్తికరంగా నిర్వహించడం లేదనే అభిప్రాయం ఎందుకు ఏర్పడుతోంది? ఈ రెగ్యులేటరీ కమిషన్లను స్వతంత్రంగా కాకుండా ప్రభుత్వం తరపున పనిచేసేలా మార్చేశారు. ఎంపిక కమిటీలు సంబంధిత మంత్రిత్వ శాఖలకు చెందిన పదవీ విరమణ చేసిన పాలనాధికారులతో కూడి ఉంటున్నాయి. ఇలాంటి ఆచరణ చట్టబద్ధమైన స్వతంత్ర రెగ్యులేటరీల అసలు ఉద్దేశానికి వ్యతిరేకం. ప్రపంచంలోనే అత్యున్నత అధికారం చలాయిస్తున్న నియంత్రణా సంస్థల్లో మన ‘సెబీ’ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) ఒకటి. ఆర్థిక పరమైన అవకతవకలపై శోధన, స్వాధీనం, దాడులు, అరెస్టులకు సంబంధించి తిరుగులేని అధికారాలను సెబీ కలిగి ఉంటోంది. అనుమానాస్పదమైన ట్రేడింగ్ కార్యకలాపాలను, రియల్ టైమ్ ప్రాతిపదికన షేర్ల విలువను తారు మారు చేయడాన్ని పసిగట్టడంలో సెబీకి విస్తృత మైన నిఘా వ్యవస్థ తోడుగా ఉంటోంది. అయిన ప్పటికీ విభిన్న రాజకీయ పాలనా కాలాల్లో ఈ రెగ్యులేటరీ సంస్థ మౌనం పాటిస్తూ వచ్చింది. గత రెండు దశాబ్దాలుగా, సెబీ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశానుసారం పనిచేస్తూ వచ్చింది. ప్రత్యేకించి యూపీఏ (యునైటెడ్ ప్రోగ్రె సివ్ అలయెన్స్) రెండో పాలనా కాలంలో ఇది కొట్టొచ్చినట్లు కనబడుతుంది. లేదా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్ఎస్ఈ)లో కో– లొకేషన్ (కోలో) స్కామ్ విషయంలో కానీ, సత్యం కుంభకోణంలో కానీ సెబీ కార్యకలాపాలు ఎలాంటి పబ్లిక్ లేదా రాజకీయ తనిఖీ రాడార్‌లో లేకుండా కొనసాగుతూ వచ్చాయి. ఇటీవలే ఇలాంటి ప్రశ్నలను పార్లమెంట్లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా ప్రతిభావంతంగా లేవనెత్తారు. గత రెండేళ్లలో స్టాక్ మార్కెట్లో కొన్ని కంపెనీల విలువ అమాంతంగా పెరిగిపోవడంపై ఆమె ప్రశ్నలు సంధించారు. కానీ సెబీ మాత్రం ఈ విషయంలో కనీస అధ్యయనం కూడా చేయనట్లు కనిపిస్తోంది. దర్యాప్తు జరుగుతున్నప్పటికీ రూ. 20,000 కోట్ల విలువైన అత్యంత భారీ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీఓ)ని ఒక కంపెనీ ప్రతిపాదించడాన్ని సెబీ ఎలా అనుమతించిందంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సరిగ్గానే ప్రశ్నించారు (అయితే ఆ ప్రతిపాద నను తర్వాత ఉపసంహ రించుకున్నారు.) ఆర్థిక అవకతవకలపై అత్యంత క్రియాశీలకంగా ఉండే రెగ్యులేటరీ సంస్థ సెబీ తన విశ్వసనీయత ప్రశ్నార్థకమైన సమయంలో, తన గమనింపునకు వచ్చి నప్పుడు ఈ విషయమై పరిశీలిస్తానంటూ ముభావంగా స్పందించిందే తప్ప అంతకుమించిన విచారణ జరపలేదు. ఎందుకు విచారించలేదనే కీలక ప్రశ్నకు కూడా ఇప్పటికీ అది సమాధాన మివ్వడం లేదు. చర్యలు తీసుకున్న దాఖలా లేదు సెబీ నిద్రపోతోందంటూ సర్వత్రా ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో, భారతదేశంలో రెగ్యులేటరీ వ్యవస్థ ఎందుకు విఫలమవుతోందన్న అంశంపై దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రభుత్వ నిర్ణయాలపై పారదర్శకతను నెలకొల్ప డమే స్వతంత్ర రెగ్యులేటరీ కమిషన్ల ఏర్పాటు ఉద్దేశం. సరళీకరణ తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్నందున బొగ్గు, భూమి, విద్యుత్, టెలి కమ్యూనికేషన్లు, స్పెక్ట్రమ్, పెట్రోలయం, సహజ వాయువు, స్టాక్ మార్కెట్లు, పెన్షన్ నిధులు– వీటి నిర్వహణ, విమానాశ్రయాలు వగైరా ఎన్నో అంశాలు రెగ్యురేటరీ పరిశీలనా చట్రం పరిధిలోకి వచ్చాయి. అయితే ట్రాయ్(టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) లాంటిది కేవలం సిఫార్సులు మాత్రమే చేయగలిగే అధికారం కలిగివుంటోంది. మరోవైపు విద్యుత్ కమిషన్లు తమ సేవల మార్కెట్లపై అధికారం చలాయించడానికి ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నాయి. సెబీ, కాంపిటీషన్ కమి షన్ ఆఫ్ ఇండియా వంటి కొన్ని కేసులలో తప్పితే నిబంధనలు పాటించకపోవడంపై చర్యలు తీసు కునే శిక్షాత్మక అధికారాలు ఇప్పటికీ బలహీనంగానే ఉంటున్నాయి. స్వయం నియంత్రణా సంస్థలు తమ విధు లను సంతృప్తికరంగా నిర్వహించడం లేదనే అభి ప్రాయం ఎందుకు ఏర్పడుతోంది? చాలావరకు ఈ రెగ్యులేటరీ సంస్థలే అక్రమాలకు పాల్పడుతున్నా యనే ఆరోపణలు ఉంటున్నాయి. నిబంధనలను అతిక్రమించే సభ్యులకు వ్యతిరేకంగా ఐసీఏఐ (ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) లేదా ఎమ్సీఐ (మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) వంటి ప్రొఫెషనల్ సంస్థలు కఠిన చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. ఇక క్రీడా సంస్థల విషయానికి వస్తే అవి జీవితకాలం పదవుల్లో ఉండే వ్యక్తులతో కూడుకుని ఉంటు న్నాయి. పైగా వీటి ఆర్థిక సమగ్రతపై సందేహాలు చోటు చేసుకుంటున్నాయి. మరోవైపున ప్రభుత్వం నియమించిన చట్టబద్ధమైన నియంత్రణాధికార సంస్థలు కూడా లోపరహితమైన స్థాయికి చేరలేక పోతున్నాయి. విద్యుత్, టెలీ కమ్యూనికేషన్లు,కాంపిటీషన్, సెక్యూరిటీల విషయంలో సంబంధిత కమిషన్ల ఆదేశాలకు వ్యతిరేకంగా అప్పీల్స్ వంటివి అప్పీలేట్ ట్రిబ్యునల్స్‌కి వెళుతున్నాయి తప్ప నేరుగా హైకోర్టుల ముందుకు వెళ్లడం లేదు. దీని వల్ల జాప్యం జరగడమే కాకుండా కమిషన్ అసలు ఉద్దేశాన్ని పలుచన చేస్తున్నాయి. డిప్యుటేషన్ మరో సమస్య ప్రభుత్వ విభాగాలు ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన అనేక ఉదంతాల్లో రెగ్యులేటరీ కమిషన్లను స్వతంత్రంగా కాకుండా ప్రభుత్వం తరపున పనిచేసేలా మార్చేశారు. రెగ్యు లేటరీ సంస్థల ఛైర్మన్, సభ్యుల ఎంపిక ప్రక్రియ దీనికి ఒక కారణం కావచ్చు. ఎంపిక కమిటీలు సంబంధిత మంత్రిత్వ శాఖలకు చెందిన పదవీ విరమణ చేసిన పాలనాధికారులతో కూడి ఉంటు న్నాయి. ఇలాంటి ఆచరణ చట్టబద్ధమైన స్వతంత్ర రెగ్యులేటరీల అసలు ఉద్దేశానికి వ్యతిరేకంగా ఉంటోంది. ఇలాంటి విభాగాల్లో నియమితులైన వారిని నాటుకుపోయిన ప్రభుత్వ విధేయ సంస్కృతి నుంచి బయటపడవేయలేరా? చాలావరకు రెగ్యులేటరీ విభాగాల్లో పని చేస్తున్న సిబ్బంది ప్రభుత్వ ఇతర విభాగాల నుంచి డిప్యుటేషన్ పై వచ్చినవారు. వీరు రెగ్యులేషన్ లో తమకు కెరీర్ ఉందని భావించడం లేదు. అలా భావించే కొద్దిమందే ఈ విభాగాల సభ్యులుగానూ లేదా ఛైర్మన్లుగానూ ఎదుగుతున్నారు. ఈ తరహా రెగ్యులేటరీ విభాగాలు మరొక ప్రభుత్వ సంస్థలానే తరచుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. ఎందుకంటే ఈ విభాగాలలోని కీలక స్థానాలు పదవీ విరమణ చేసిన బ్యూరోక్రాట్లకు, ప్రభుత్వ అధికారులకు పదవీ విరమణ అనంతరం దక్కించుకునే హోదాలుగా మారిపోయాయి. దీని ఫలితంగా పెద్దగా స్వాతంత్య్రం లేకపోవడం, సంబంధిత రంగాల నియంత్రణాధికారుల్లో సాహసం లేక విజ్ఞానం లేకపోవడం జరుగుతోంది. ప్రభుత్వ ప్రతిష్ఠ పైన మాత్రమే కాకుండా, భారత వృద్ధి గాథపై కూడా ఇది ప్రభావం చూపుతున్నందు వలన, దేశంలోని రెగ్యులేటరీ సంస్థల విశ్వస నీయతను పునరుద్ధరించాల్సిన సమయం ఆసన్న మైంది. నీలూ వ్యాస్ వ్యాసకర్త సీనియర్ టీవీ యాంకర్,కన్సల్టింగ్ ఎడిటర్ (‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో) -
అమెరికా అణుస్థావరంపై చైనా బెలూన్
వాషింగ్టన్/బీజింగ్: చైనాకు చెందిన నిఘా బెలూన్ అమెరికా గగనతలంపై, అదీ అణు స్థావ రం వద్ద తచ్చాడటం కలకలం రేపింది. దీనిపై అమెరికా తీవ్రంగా స్పందించింది. విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చైనా పర్యటనను వాయిదా వేసుకున్నారు. మూడు బస్సుల పరిమాణంలో ఉన్న ఈ బెలూన్ కొన్ని రోజులుగా తమ గగనతలంలో అగుపిస్తోందని, అది గురువారం మోంటానాలో ప్రత్యక్షమైందని పెంటగాన్ పేర్కొంది. అది అత్యంత ఎత్తులో ఎగురుతున్నందున వాణిజ్య విమానాల రాకపోకలకు అంతరాయమేమీ లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో సున్నిత సమాచారం లీకవకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించింది. బెలూన్ను కూల్చేస్తే దాని శకలాల వల్ల ప్రజలకు హాని కలగవచ్చని ఆర్మీ భావిస్తోంది. అన్ని అంశాలను అధ్యక్షుడు బైడెన్‌కు వివరించినట్లు పెంటగాన్ ప్రకటించింది. అమెరికాలోని మూడు భూగర్భ అణు క్షిపణి కేంద్రాల్లో ఒకటి మోంటానాలోనే ఉంది. దాంతో ఈ పరిణామం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోసినట్లయింది. చైనాతో చర్చల నిమిత్తం శుక్రవారం రాత్రి బయల్దేరాల్సిన విదేశాంగ మంత్రి బ్లింకెన్ పర్యటన వాయిదా పడింది. వాతావరణ పరిశోధన కోసం ప్రయోగించిన బెలూన్ దారి తప్పి అమెరికా గగనతలంలోకి ప్రవేశించిందని చైనా పేర్కొంది. ఈ అనుకోని పరిణామానికి చింతిస్తున్నట్టు చెప్పింది. ఈ వివరణతో అమెరికా సంతృప్తి చెందలేదు. ‘‘మా గగనతలంలోకి చైనా బెలూన్ రావడం మా సార్వభౌమత్వాన్ని, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే. చైనా చర్య ఆమోదయోగ్యం కాదు. ఈ సమయంలో బ్లింకెన్ పర్యటన సరికాదని భావిస్తున్నాం’’ అని అమెరికా అధికారి ఒకరన్నారు. పరిస్థితులు అనుకూలించాక బ్లింకెన్ చైనా పర్యటన ఉంటుందన్నారు. -
Amrabad: అడవిపై ఈ–కన్ను.. ఎక్కడి నుంచైనా లైవ్‌లో వీక్షించే అవకాశం
►పగటి వేళ చెరువులో కొంతసేపు జలకాలాటలు ఆడిన ఓ పెద్దపులి, ఆ తర్వాత ఒడ్డునే ఉన్న ఓ చెట్టుకు శరీరం, తల రుద్దుకుంటూ సేదతీరింది. ►ఓ నీటిగుంటలో ఒక సాంబార్ జింక నిద్రిస్తుండగా అడవి కుక్కలు దాన్ని చుట్టుముట్టే ప్రయత్నం చేశాయి. క్షణాల్లోనే అప్రమత్తమైన ఆ జింక వేగంగా తప్పించుకోవడంతో అడవి కుక్కలు నిరాశగా వెళ్లిపోయాయి. ►ఒకచోట రెండు, మూడు పులులు తమ పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఫుల్లుగా ఎంజాయ్ చేశాయి. ►ఎఫ్–6 (పులి) రాత్రి వేళ స్వేచ్ఛగా సంచరించడం స్పష్టంగా కన్పించింది. ►కొన్ని జంతువులు ఇతర జంతువులపై దాడికి దిగి, ఆకలి తీరాక పక్క నుంచి బలహీనమైన ఇతర వన్యప్రాణులు వెళుతున్నా పట్టించుకోలేదు. ►ఇలాంటి అనేక వీడియోలు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో కెమెరాల్లో రికార్డయ్యాయి. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 2,611 చ.కి.మీ పరిధిలో విస్తరించి పెద్దపులుల అభయారణ్యంగా పేరుగాంచిన ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్)లో పటిష్ట పరిచిన ఎల్క్ట్రానిక్–ఐ (ఈ–కన్ను) నిఘా వ్యవస్థ సత్ఫలితాలనిస్తోంది. పెద్దపులులు, ఇతర వన్యప్రాణుల కదలికలు తెలుసుకునేందుకు, వాటి సంరక్షణకు.. అటవీ ఆక్రమణలు, జంతువుల వేట, కలప స్మగ్లింగ్‌ను అడ్డుకునేందుకు బాగా ఉపయోగపడుతోంది. ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కొంతకాలం క్రితమే ప్రయోగాత్మకంగా ఏటీఆర్‌లో అధికారులు ప్రారంభించారు. ప్రస్తుతానికి పది కెమెరాలను వినియోగంలోకి తీసుకురాగా.. పులులు, ఇతర జంతువులకు సంబంధించి వచ్చిన లైవ్ వీడియోలు, ఫొటోలు అబ్బురపరిచే విధంగా ఉన్నట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఎక్కడినుంచైనా పర్యవేక్షణ క్షేత్రస్థాయిలో పెద్దసంఖ్యలో అటవీ సిబ్బందిని నియమించాల్సిన అవసరం లేకుండా, కీలకమైన, క్లిష్టమైన ప్రదేశాల్లో వారానికి ఏడు రోజులు 24 గంటల పాటు (24/7) కచ్చితత్వంతో అటవీ ప్రాంతాన్ని పర్యవేక్షించేందుకు దీని ద్వారా వీలు కలిగింది. సాఫ్ట్వేర్ ఆధారిత వ్యవస్థ ద్వారా పనిచేసే ఈ విధానంలో... వివిధ సెన్సిటివ్ జోన్లలో హై రెజల్యూషన్ థర్మల్, ఇన్ఫ్రారెడ్ కెమెరాల ద్వారా మనుషులు, పులుల కదలికలను రికార్డ్ చేశారు. ఉన్నతా«దికారుల సెల్‌ఫోన్‌కు జంతువుల కదలికలు, ఇతర ఘటనలకు సంబంధించిన అలర్ట్‌లు, నోటిఫికేషన్లు వచ్చే సాంకేతికతను ఏర్పాటు చేశారు. రేడియో ఫ్రీక్వెన్సీతో ఇంటర్నెట్ అనుసంధానం అడవిలో ఇంటర్నెట్ నెట్వర్క్ కవర్ కాని చోట్ల రేడియో ఫ్రీక్వెన్సీతో 360 డిగ్రీల పరిధిలో 24 గంటల సర్వైలెన్స్ ద్వారా పులులు, వన్యప్రాణుల కదలికల్ని గమనిస్తూ పర్యవేక్షించగలుగుతున్నారు. రేడియో ఫ్రీక్వెన్సీ నెట్వర్క్ నుంచి ఇంటర్నెట్కు దృశ్యాలు కన్వర్టయ్యే స్ట్రీమింగ్‌తో ఎక్కడి నుంచైనా లైవ్‌లో మానిటర్ చేసే అవకాశాలుండడం అధికారులకు ఉపకరిస్తోంది. అడవుల్లో మొబైల్ టవర్లు నెలకొల్పలేని మారుమూల అటవీ ప్రాంతాల్లో, సిగ్నల్స్ లేనిచోట రేడియో వేవ్ కమ్యూనికేషన్ ద్వారా...ఇంటర్నెట్ ఓవర్ రేడియా (ఐవోఆర్ఏ) విధానం ద్వారా వాకీటాకీలు పనిచేసేలా వ్యవస్థను రూపొందించారు. ఐటీ శాఖతో చర్చలు ఫారెస్ట్ కోడ్ ప్రకారం బీట్ ఆఫీసర్లు నెలలో 26 రోజుల పాటు రాత్రి వేళ అడవిలో తిరగాలి. టేకు చెట్లను కొట్టినా, అడవి నరికినా వాటిని వారు గుర్తించిపై అధికారులను అలర్ట్ చేయాలి. ప్రస్తుతం ఈ–ఐ ఏర్పాటుతో వీరి పని సులభంగా మారింది. ప్రస్తుతం ఏటీఆర్‌లో ఈ వ్యవస్థను మరింత విస్తృతం చేసే ఆలోచనతో అధికారులున్నారు. పైలెట్ ప్రాజెక్ట్ స్థాయిలో చేసేందుకు తెలంగాణ ఐటీశాఖతో ఏటీఆర్ అధికారులు చర్చలు జరిపినట్టు సమాచారం. ప్రస్తుతం పది కెమెరాలతోఏర్పాటు చేసిన విధానం వల్ల పరిమితంగానే అడవి కవర్ అవుతోంది. దీనిని మరింత విస్తృత పరచడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వంద నుంచి రెండువందల దాకా కెమెరాలు ఏర్పాటు చేస్తే బావుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో వాచ్ టవర్‌కు అడ్వాన్స్డ్ కెమెరా కోసం రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు, కమాండ్ కంట్రోల్ వ్యవస్థ కోసం రూ.50 లక్షల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఏటీఆర్కు దాదాపు వంద ఎంట్రీ పాయింట్లు ఉన్నందున, రెండువందల కీలక ప్రదేశాల్లో కెమెరాలు ఏర్పాటు చేస్తే దేశంలోనే పటిష్టమైన నిఘా వ్యవస్థ కలిగిన టైగర్ రిజర్వ్‌గా దీనిని తీర్చిదిద్దవచ్చునని చెబుతున్నారు. అడవిలో కదలికలన్నీ తెలిసిపోతున్నాయ్.. వన్యప్రాణుల సంరక్షణకు ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకోవడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చు. ఈ–ఐ కెమెరాలతో అడవిలో ఏం జరుగుతోందో తెలిసిపోతోంది. జంతువుల కదలికలను స్పష్టంగా చూడగలుగుతున్నాం. లోతైన లోయలు, కొన్ని ఇతర ప్రాంతాల్లో పర్యవేక్షణ చాలా కష్టంగా ఉంటుంది. వాకీటాకీలు పనిచేయని పరిస్థితులుంటాయి. ఇంటర్నెట్ ఓవర్ రేడియో విధానం ద్వారా మొబైల్ సిగ్నల్స్ లేకపోయినా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు అవకాశం ఉంటుంది. – రోహిత్ గొప్పిడి, డీఎఫ్‌వో, నాగర్‌కర్నూల్ జిల్లా -
అగ్రదేశాల్లో.. మనం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘భారతీయులు ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోరు. యుద్ధాలు జరగకుండా చూడటానికే ప్రయత్నిస్తాం. అదే సమయంలో మన రక్షణ రంగ సామర్థ్యాన్ని కూడా ఎప్పటికప్పుడు బలోపేతం చేస్తూనే ఉంటాం. శత్రు దుర్బేధ్య దేశంగా నిర్మించుకోవడం కోసం ఆధునిక సాంకేతికతతో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నాం. ప్రస్తుతం శాస్త్రసాంకేతిక, రక్షణ, అంతరిక్ష పరిశోధనల్లో భారత్ అగ్రగామిగా వెలుగొందుతోంది’ అని భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) చైర్మన్ డాక్టర్ జి.సతీష్‌రెడ్డి చెప్పారు. జేఎన్టీయూ–అనంతపురం ఇంజినీరింగ్ కళాశాల వజ్రోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. సతీష్‌రెడ్డి ఇదే కళాశాలలో విద్యనభ్యసించారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడిన వివరాలివీ.. అన్నింటా స్వదేశీ పరిజ్ఞానమే.. అంతరిక్ష, రక్షణ రంగ పరిశోధనల్లో టాప్–5 దేశాల్లో భారత్‌కు స్థానం దక్కింది. ఇస్రో ప్రయోగాలకు సొంత సాంకేతిక పరిజ్ఞానాన్నే ఉపయోగిస్తున్నాం. అటామిక్ ఎనర్జీ, రక్షణ రంగంలోనూ ఆధునిక దేశీయ పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నాం. ఇప్పుడు మన దేశం ‘మేకిన్ ఇండియా నుంచి మేడ్ ఫర్ ద వరల్డ్’ స్థాయికి ఎదుగుతోంది. ఉపగ్రహాల కాల వ్యవధి ముగిసిన వెంటనే.. వాటిని కూల్చివేయడానికి వీలుగా ఏ–శాట్‌ను అభివృద్ధి చేశాం. తద్వారా భారత్ టాప్–4(అమెరికా, రష్యా, చైనా సరసన)లో నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత సుదూర ప్రాంతాల్లో ఉండే లక్ష్యాన్ని చేరుకునే గన్ 155 ఎం.ఎం ఆవిష్కరణ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో భారత్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. భారత్‌కు చైనా, పాకిస్తాన్ వంటి దేశాలతో తరచూ సరిహద్దుల్లో సమస్యలు వస్తున్నాయి. మనం ఎప్పటికప్పుడు అత్యాధునిక సర్వైలెన్సు వ్యవస్థ ఏర్పాటు చేసి, దీనిని సరిహద్దు భద్రతకు ఉపయోగిస్తున్నాం. పరిశోధన రంగాల వైపు వచ్చే ఇంజనీరింగ్ విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇది శుభపరిణామం. విద్యార్థులు గొప్ప ఆవిష్కరణలతో వస్తే.. ఆ ప్రాజెక్టుకు రూ.10 కోట్లు ఖర్చు పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నాం. ‘అనంత’లో ఉండగానే.. అగ్ని ప్రైమ్ శుభవార్త అగ్ని ప్రైమ్ మిస్సైల్ ప్రయోగం శనివారం విజయవంతమైంది. కళాశాలలో పైలాన్ ఆవిష్కరించిన వెంటనే ఈ శుభవార్త నాకు తెలిసింది. ఆ వెంటనే రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితరులు అభినందనలు తెలిపారు. నేను విద్యనభ్యసించిన కళాశాలలో ఉండగా ఇలాంటి ఘనత దక్కడం సంతోషంగా ఉంది. ఇక్కడి ప్రజల ఆప్యాయత చాలా గొప్పది. యువ ఇంజనీర్లకు డీఆర్డీవో చేయూత అనంతపురం విద్య: యువ ఇంజనీర్లకు డీఆర్డీవో తగిన చేయూతనిస్తోందని ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ జి.సతీష్‌రెడ్డి తెలిపారు. శనివారం అనంతపురంలో జరిగిన జేఎన్టీయూ(ఏ) ఇంజనీరింగ్ కళాశాల వజ్రోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వజ్రోత్సవాల పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. జేఎన్టీయూ(ఏ)విద్యార్థులు ఎంటెక్ (డిఫెన్స్ టెక్నాలజీ) కోర్సు చదవడానికయ్యే మొత్తం ఖర్చును భరిస్తామని హామీ ఇచ్చారు. ఎంటెక్(డిఫెన్స్ టెక్నాలజీ) రెండో సంవత్సరం విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పిస్తామన్నారు. జేఎన్టీయూ(ఏ)లో డీఆర్డీవో ఎక్స్‌లెన్స్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, వీసీ జింకా రంగ జనార్దన, రెక్టార్ ఎం.విజయకుమార్, రిజిస్ట్రార్ సి.శశిధర్, ప్రిన్సిపాల్ పి.సుజాత పాల్గొన్నారు. -
నిబంధనలు పాటిస్తూ ఇసుక డ్రెడ్జింగ్
సాక్షి, అమరావతి: ఇసుక అక్రమ తవ్వకాలు జరగకుండా పటిష్ట నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి నిబంధనల ప్రకారం నదులు, రిజర్వాయర్లలో డ్రెడ్జింగ్ చేసుకోవచ్చని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఇసుక డ్రెడ్జింగ్ /తవ్వకాలకు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అనుమతి తప్పనిసరి నిబంధనను మినహాయిస్తూ గత సర్కారు 2016లో జారీ చేసిన మైనర్ మినరల్ కన్సెషన్ రూల్స్ సవరణ (ఇసుక పాలసీ) ఉత్తర్వులను కొందరు ఎన్జీటీలో సవాల్ చేయడం తెలిసిందే. దీనివల్ల పర్యావరణం దెబ్బ తింటుందని, ఇష్టారాజ్యంగా నదులు, రిజర్వాయర్లు, కాలువల్లో ఇసుక తోడేయడం వల్ల భూగర్భ జలమట్టం పడిపోయి కరువు ఏర్పడిందని పేర్కొన్నారు. అడ్డగోలుగా ఇసుక తవ్వకాల వల్ల పర్యావరణ సమతుల్యం దెబ్బ తింటుందన్నారు. ఈ మినహాయింపులు సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధమని, తక్షణమే దీనిపై స్టే విధించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన తిరుమలశెట్టి శ్రీనివాస్, దేవినేని రాజశేఖర్ ఎన్జీటీలో సవాల్ చేశారు. ప్రకాశం బ్యారేజిలో అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు సాగిస్తూ పర్యావరణానికి తూట్లు పొడుస్తున్నారంటూ అనుమోల్ గాంధీ కూడా ఎన్జీటీని ఆశ్రయించారు. ఈ పిటిషన్ విషయంలో ఎన్జీటీ 2018లో నాటి ప్రభుత్వానికి కొన్ని అంశాలపై ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం రూ.100 కోట్లు డిపాజిట్ చేయాలని, దీన్ని ఇసుక అక్రమ తవ్వకందారుల నుంచి వసూలు చేయాలని అప్పట్లో ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా డ్రెడ్జింగ్ జరుగుతున్నట్లు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సమర్పించిన ఉమ్మడి తనిఖీ నివేదిక ఆధారంగా ఎన్జీటీ ఈ ఆదేశాలు జారీ చేసింది. గణాంకాలతో ఎన్జీటీకి ప్రభుత్వం నివేదిక.. పూడిక వల్ల రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యం తగ్గిపోతోందని, కాలువలు, నదుల్లో పూడిక (ఇసుక)ను నిర్దిష్ట పరిమాణంలో తొలగించకుంటే వర్షాల సమయంలో వరదల ముప్పు ఎక్కువగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం గణాంకాలతో శాస్త్రీయ నివేదిక సమర్పించింది. నిబంధనలకు లోబడి ఇసుక తవ్వకాల వల్ల పర్యావరణానికి నష్టం ఉండదని వివరించింది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న ఎన్జీటీ కొన్ని నిబంధనలు పాటిస్తూ ఇసుక డ్రెడ్జింగ్ చేసుకునేందుకు అనుమతించింది. అనుమతించిన దానికంటే అధిక పరిమాణంలో ఇసుక తవ్వినా, నిబంధనలను ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో ప్రకాశం, ధవళేశ్వరం బ్యారేజీల్లో ఇసుక డ్రెడ్జింగ్‌కు అవరోధం తొలగిందని అధికారులు పేర్కొంటున్నారు. ఎన్జీటీ తీర్పులో కీలక అంశాలివీ.. – ఇసుక డీసిల్టింగ్/ డ్రెడ్జింగ్/ మైనింగ్ నిర్వహించే ప్రాంతాల్లో శాస్త్రీయ పర్యవేక్షణ నిమిత్తం సీసీటీవీలను ఏర్పాటు చేయాలి. దీనివల్ల అక్రమ తవ్వకాలు, రవాణాను కట్టడి చేయడం సులభమవుతుంది. – శాస్త్రీయ సర్వే నిర్వహించి నిర్ణీత పరిమాణంలో మాత్రమే ఇసుక డ్రెడ్జింగ్ నిర్వహించాలి. నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. (ఇప్పటికే ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా నిరోధానికి కఠిన నిబంధనలతో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు బాగున్నాయి. ఇవి పక్కాగా అమలు చేస్తే చాలు) – డ్రెడ్జింగ్/ డీసిల్టింగ్‌కు అనుమతుల కోసం ప్రతి జిల్లాలో శాశ్వతంగా నిపుణులతో కమిటీని ఏర్పాటు చేయాలి. -
వాయుసేన వ్యూహాత్మక కేంద్రంగా ఏపీ
సాక్షి, అమరావతి: భారతదేశ తూర్పుతీరంలో ఆంధ్రప్రదేశ్‌ను వ్యూహాత్మక కేంద్రంగా తీర్చిదిద్దాలని భారత వాయుసేన నిర్ణయించింది. విపత్తు నిర్వహణ, నిఘా, రక్షణ అవసరాల కోసం మన రాష్ట్రంలోని విజయవాడ, రాజమండ్రి విమానాశ్రయాల్లో యుద్ధవిమానాల బేస్‌క్యాంప్‌లు ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు వ్యూహాత్మక ప్రణాళికను భారత వాయుసేన ఉన్నతస్థాయి కమిటీ ఆమోదించింది. బంగాళాఖాతంలో పటిష్ట నిఘా ప్రస్తుతం దేశ తూర్పు తీరంలో చెన్నై సమీపంలోని అరక్కోణంలో వైమానిక దళ స్థావరం ఉంది. యుద్ధ విమానాలను అక్కడ మొహరించారు. ఎక్కడైనా విపత్తులు సంభవించినా, రక్షణ అవసరాల కోసం అక్కడి నుంచే యుద్ధ విమానాలను పంపిస్తున్నారు. కాగా తూర్పు తీరంలో బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి ఉగ్రవాదుల చొరబాట్లను అరికట్టడంతోపాటు బంగాళాఖాతంలో చైనా ఆధిపత్యంపై కన్నేసి ఉంచాల్సిన అవసరాన్ని భారత వాయుసేన గుర్తించింది. అందుకోసం బంగాళాఖాతంలో నిఘా వ్యవస్థను మరింత పటిష్ట పరచాల్సిన అవసరం ఉంది. ఇక ఎక్కువుగా తుఫాన్ల ముప్పు ఎదుర్కొంటున్న తూర్పుతీర ప్రాంతంలో విపత్తుల నిర్వహణ కూడా వాయుసేన ప్రాధాన్య అంశంగా ఉంది. అందుకోసం తూర్పుతీరంలో మరో వైమానిక స్థావరాన్ని ఏర్పాటు చేయాలని భావించింది. అతి పొడవైన తీరప్రాంతం ఉన్న ఏపీని అందుకు అనువైనదిగా ఎంపిక చేసింది. ఇప్పటికే విశాఖలో భారత నావికాదళ వ్యూహాత్మక కేంద్రం ‘ఐఎన్ఎస్ డేగా’ ఉంది. దాంతో రాజమండ్రి, విజయవాడ విమానాశ్రయాలను తమ వ్యూహాత్మక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని భారత వాయుసేన భావించింది. ఇందుకుగాను యుద్ధవిమానాలు అత్యవసరంగా ల్యాండ్ అయ్యేందుకు వీలుగా విజయవాడ– రాజమండ్రి మధ్య ఉన్న జాతీయ రహదారిని అభివృద్ధి చేయాలని రెండేళ్ల క్రితమే నిర్ణయించింది. ఉత్తర భారత దేశంలో ఆగ్రా–లక్నో జాతీయరహదారిని అదే విధంగా యుద్ధ విమానాలు అత్యవసర ల్యాండింగ్‌కు వీలుగా అభివృద్ధి చేశారు. యుద్ధ విమానాల ల్యాండింగ్‌కు అనుకూలంగా జాతీయ రాహదారులు ఆరులేన్లుగా ఈ జాతీయరహదారిని అభివృద్ధి చేసిన తరువాత యుద్ధ విమానాల ల్యాండింగ్‌కు అనుగుణంగా తీర్చిదిద్దుతారు. ఈమేరకు ప్రతిపాదనలకు కేంద్ర రక్షణ శాఖ ఇప్పటికే సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. త్వరలో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారు. అనంతరం విజయవాడ, రాజమండ్రి విమానాశ్రయాల్లో రక్షణ మౌలిక వసతులను అభివృద్ధికి ప్రణాళికను రూపొందించనున్నారు. యుద్ధవిమానాల మొహరింపు, రోజువారీ విన్యాసాలు, శిక్షణ తదితర అవసరాలకు అనుగుణంగా రక్షణ మౌలిక వసతులను తీర్చిదిద్దుతారు. దాంతో తూర్పుతీరంలో భారత వాయుసేన నిఘా మరింత పటిష్టమవుతుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. -
ఏబీవీ.. బాబు రాజకీయానికి బినామీ
సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో ఆయన దర్జాగా కూర్చుంటారు .టీడీపీ ఆంతరంగిక సమావేశాల్లో దర్శనమిస్తారు. పోలీసు శాఖలో జరిగే బదిలీల్లో ఆయన చెప్పిందే జరుగుతుంది. నామినేటెడ్ పోస్టుల భర్తీ ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే జరుగుతుంది. టీడీపీ పదవులు, ఎమ్మెల్యే టిక్కెట్లు ఏదైనా ఆయన సిఫారసు తప్పనిసరి. పేరుకు నిఘా విభాగం అ«ధిపతి అయినా అటు ప్రభుత్వం, ఇటు టీడీపీ సంస్థాగత నిర్ణయాల్లోనూ ఆయనదే పెత్తనం. ఆయనెవరో ఇప్పటికే అర్థమైంది కదూ.. ఆయనే అత్యంత వివాదాస్పదమైన పోలీసు అధికారిగా ముద్ర వేసుకున్న ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు(ఏబీవీ). అటు ప్రభుత్వ వ్యవహారాలు, ఇటు పార్టీ పనుల్లో అన్నీ తానై వ్యవహరిస్తున్న ఏబీవీ ఏకంగా చంద్రబాబు రాజకీయ బినామీగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. సాక్షి, అమరావతి/గుంటూరు: ఉగ్రవాదులు, మావోయిస్టులు, అసాంఘిక శక్తుల కదలికలపై పూర్తిస్థాయి నిఘా ఉంచడంతోపాటు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అంశాలపైన దృష్టి పెట్డడం, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరించాల్సిన పని ఇంటెలిజెన్స్ విభాగానిది. గతంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ప్రభుత్వంలో లోపాలు, ప్రజాప్రతినిధుల అవినీతి, అరాచకాలపై ప్రభుత్వాని కి నివేదికలు అందిస్తూ పారదర్శకంగా వ్యవహరించేది. అయితే ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఎ.బి.వెంకటేశ్వరరావు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పరిస్థితి మారిపోయింది. అధికారపార్టీ సేవలో ఆయన తరించిపోతున్నారు. టీడీపీ, చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలకోసమే పనిచేసేలా ఇంటెలిజెన్స్ వ్యవస్థను మార్చేశారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఆది నుంచీ టీడీపీ సేవలోనే.. టీడీపీ అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు సొంత సామాజికవర్గానికి చెందిన ఏబీ వెంకటేశ్వరరావు విజయవాడ నగర పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ‘ఓటుకు కోట్లు’ వివాదంలో చంద్రబాబు అడ్డంగా బుక్కైపోవడంతో అప్పటి ఇంటెలిజెన్స్ ఏడీజీగా ఉన్న ఏఆర్ అనురాధను తప్పించి.. ఆ స్థానంలో ఏబీవీని కూర్చోబెట్టారు. అప్పట్నుంచీ ఏబీవీ హవా జోరందుకుంది. రాష్ట్రంలో కీలకమైన నిఘా విధులు వదిలి పూర్తిగా చంద్రబాబు, టీడీపీ సేవలో ఏబీవీ తలమునకలయ్యారనేది బహిరంగ రహస్యం. ఒక దశలో ఆయన వీఆర్ఎస్ తీసుకుని తన స్వస్థలమైన నూజివీడు లేదా గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీకి దిగుతారనే బలమైన ప్రచారం జరిగిందంటే అధికారపార్టీతో ఏబీవీకున్న అనుబంధం ఏపాటితో అర్థమవుతుంది. ఆయన, ఓఎస్డీ యోగానంద్ లాంటి అధికారులు కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు ఖాకీ యూనిఫారం వేసుకుని ఐక్యతను చాటే పోలీసు వ్యవస్థలో కులం కుంపటి రాజేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. రాష్ట్రంలోని కీలక పోస్టుల్లో సీఎం సొంత సామాజికవర్గం వారితో నింపేశారని, మిగతా వారిని లూప్‌లైన్ (అప్రధాన) పోస్టుల్లో నియమించారని పోలీసులే వాపోతుండడం ఇందుకు నిదర్శనం. పోలీసు శాఖలో ఇలా కుల ప్రస్తావన గతంలో ఎప్పుడు లేదని సీనియర్ పోలీసు అధికారులు సైతం చెబుతుండడం గమనార్హం. ఎల్లో నెట్‌వర్క్‌గా మార్చేశారు.. భూమా నాగిరెడ్డి ఆకస్మిక మృతితో జరిగిన నంద్యాల ఉప ఎన్నిక నుంచి ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల వరకు చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలకోసం నిఘా వ్యవస్థను పణంగా పెడుతున్నారంటూ పోలీసు శాఖలో విమర్శలు రేగుతున్నాయి. ఇంటెలిజెన్స్ వ్యవస్థను పూర్తిగా టీడీపీ రాజకీయ అవసరాలకోసం వినియోగించుకోవడంలో నంద్యాల ఉప ఎన్నిక ప్రత్యక్ష ఉదాహరణ. నంద్యాలలో ఏబీవీ మకాం వేసి పెద్దసంఖ్యలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లను నియమించి టీడీపీకోసం సేవలందించినట్టు అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఇటీవలి తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడంతో కూకట్‌పల్లిలో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసుకుని ప్రత్యర్థుల ఫోన్ల ట్యాపింగ్, టీడీపీ అభ్యర్థులకోసం సమీకరణలు చేయడం వంటి పనుల్లో ఇంటెలిజెన్స్ విభాగం పనిచేయడం వివాదాస్పదమైంది. తెలంగాణలో టీడీపీ అభ్యర్థుల తరఫున డబ్బులు పంచుతున్నారంటూ ఇంటెలిజెన్స్ సిబ్బందిని ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే. దీనిపై ఏపీ డీజీపీ రంగంలోకి దిగి తమ వాళ్లు సమాచార సేకరణకు మాత్రమే వెళ్లారని, డబ్బులు పంచలేదని చెప్పుకోవాల్సి వచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో ఎడాపెడా ఇంటెలిజెన్స్ వాడకం.. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రత్యర్థులను దెబ్బతీసే చర్యల వరకు ఏబీవీ కీలకపాత్ర పోషిస్తూ ఇంటెలిజెన్స్‌ను ఎడాపెడా వాడేçస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ అభ్యర్థులకోసం సర్వేలు, సమీకరణలు, ఏర్పాట్లలో ఇంటెలిజెన్స్‌ను వాడుకుంటున్నారు. ఇదే సమయంలో వైఎస్సార్సీపీ అభ్యర్థులను నీడలా వెంటాడుతున్న ఇంటెలిజెన్స్ సిబ్బంది ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుని వారిని అదును చూసి దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో టీడీపీకి ఎదురుగాలి వీస్తోందని గుర్తించిన చంద్రబాబుకు మేలు చేకూర్చేందుకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేస్తున్న తీరు మరింత వివాదాస్సదమైంది. ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి మూడు నెలల ముందు నుంచే ఇచ్చిన దాదాపు 26 జీవో(బదిలీ ఉత్తర్వులు)లతో కావాల్సిన వారిని కావాల్సిన ప్రాంతాల్లో నింపేశారు. సొంత నియోజకవర్గం, సొంత మనుషులతో ప్రతీ జిల్లాలోనూ ఇంటెలిజెన్స్ డీఎస్పీ, స్పెషల్ బ్రాంచి డీఎస్పీ, కీలక ప్రాంతాల్లోని శాంతిభద్రతల డీఎస్పీలను నియమించుకోవడంలో చక్రం తిప్పి ఇప్పుడు టీడీపీ సేవలో తరించేయడంలో డైరెక్షన్ ఇస్తున్నారు. ఇలా రాష్ట్రంలో 256 మంది ఇంటెలిజెన్స్ అధికారులు, సిబ్బందిని క్షేత్రస్థాయిలో పనిచేయిస్తున్నారు. వారినుంచి వస్తున్న సమాచారాన్ని రాష్ట్ర రాజధాని ప్రాంతంతోపాటు రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో 150 మంది క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదించి రాజకీయ కోణంలోనే పనిచేయిస్తున్నారని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. నిఘా వైఫల్యానికి మూల్యం.. మొత్తం నిఘా వ్యవస్థను పూర్తిగా రాజకీయ ప్రయోజనాలకు మళ్లించడంతో రాష్ట్రంలో శాంతిభద్రతలు ఘోర వైఫల్యం చెందాయి. రాష్ట్రంలో అలికిడి లేదనుకున్న మావోయిస్టులు మళ్లీ పంజా విసిరేవరకు నిఘా వ్యవస్థ గుర్తించలేకపోయింది. గతేడాది విశాఖ మన్యం అరకులో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు హత్య చేయడం, అనంతరం ఆగ్రహించిన గిరిజనులు అక్కడి పోలీస్‌స్టేషన్‌పై దాడి చేసి ధ్వంసం చేసిన ఘటనల్లో నిఘా వైఫల్యం ప్రస్ఫుటమైంది. ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్ల అనేక దుర్ఘటనలు చోటు చేసుకుని వందలాదిమంది అమాయకులు బలయ్యారు. రాజధాని కేంద్రంలో సంచలనం రేపిన కాల్‌మనీ సెక్స్ రాకెట్లో సొంత మనుషులను కాపాడుకునేందుకు మంత్రి, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి ఇంటెలిజెన్స్ సాయంతో ఈ అంశాన్ని పక్కదారి పట్టించారని విమర్శలున్నాయి. ఇక ఇసుక దందా, నీరు–మట్టి, బెట్టింగ్ మాఫియా, ఫెర్రీ వద్ద బోటు బోల్తా వంటి అనేక ప్రధాన ఘటనల్లో ముందస్తుగా అప్రమత్తమై ప్రభుత్వ యంత్రాంగానికి సమాచారమిచ్చి ఉంటే.. నష్ట నివారణ జరిగేదని పోలీసుశాఖలోనే పలువురు చర్చించుకుంటున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల బేరసారాల్లో కీలకపాత్ర రాష్ట్రంలో ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల్ని టీడీపీలోకి ఫిరాయించేలా బేరసారాలు నెరపడంలో ఏబీవీ కీలకపాత్ర వహించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో ఫోన్లలో, నేరుగా ఇంటెలిజెన్స్ అధికారులతో మాట్లాడించి డీల్ కుదిర్చేవారన్న విమర్శలున్నాయి. టీడీపీ ప్రభుత్వానికి ఢోకా లేకుండా చేయడంలో, ఫిరాయింపులను ప్రోత్సహించడంలో, ఇతర పైరవీలకోసం కోట్లాది రూపాయలతో రంగంలోకి దిగిన చంద్రబాబు మనుషులు నెరపిన రాజకీయ సమీకరణల్లో ఏబీవీ కీలకపాత్ర పోషించినట్టు విమర్శలు వచ్చాయి. ఆయన చెప్పిందే వేదం: పోలీసు శాఖలో సీఐ, డీఎస్పీ నుంచి డీజీపీ పోస్టింగ్ వరకు ఆయన చెప్పిందే చంద్రబాబు చేయడం వెనుక రాజకీయ ప్రయోజనమే కారణమని చెబుతున్నారు. గత డీజీపీ నండూరి సాంబశివరావుకు రెండేళ్లు ఎక్స్టెన్షన్ ఇవ్వకపోవడంలోనూ, ఆ తరువాత అనేక పోస్టింగ్‌ల్లోనూ ఏబీవీ జోక్యం అప్పట్లో వివాదాస్పదమైంది. కొద్ది నెలలక్రితం గౌతమ్ సవాంగ్‌కు డీజీపీ ఇస్తానని చంద్రబాబు హామీ ఇవ్వగా.. చివరి నిమిషంలో సీఎం తనయుడు, మంత్రి లోకేశ్‌తో ఒత్తిడి చేయించి ఠాకూర్‌కు దక్కేలా చేయడంలో ఏబీవీ పోషించిన పాత్ర పోలీసు శాఖలోనే చర్చనీయాంశమైంది. నిబంధనను కచ్చితంగా అమలు చేసే ఐపీఎస్ అధికారిగా పేరున్న సవాంగ్‌ను డీజీపీగా చేస్తే ఎన్నికలప్పుడు తమ మాట వినరంటూ ఏబీవీ నేరుగా సీఎంపై ఒత్తిడి తెచ్చినట్టు సీనియర్ ఐపీఎస్‌లు చర్చించుకోవడం గమనార్హం. పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టుల భర్తీలో ఏబీవీ జోక్యం ఏ స్థాయిలో ఉందో ఇటీవల విజయవాడలో జరిగిన సభలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చేసిన వ్యాఖ్యలు అద్దంపట్టాయి. దేవినేని అవినాష్‌కు తెలుగు యువత అధ్యక్షుడి పదవికోసం తాను, గద్దె రామ్మోహన్.. ఏబీవీని కలసి సీఎంకు చెప్పాలని కోరామన్న బుద్దా వ్యాఖ్యలు యూట్యూబ్‌లో హల్చల్ చేస్తున్నాయి. టీడీపీ కార్యాలయంగా ఇంటెలిజెన్స్ కార్యాలయం.. ఏబీవీ నేతృత్వంలో ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయం టీడీపీ కార్యాలయంగా మారిపోయిందన్న విమర్శల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిఘా విధులు నిర్వర్తించాల్సిన ఆ కార్యాలయం నిత్యం టీడీపీ నేతలు, కార్యకర్తలతో కిటకిటలాడుతుండడం ఇందుకు నిదర్శనం. ఎన్నికల్లో టీడీపీకి లబ్ధి చేకూర్చడంకోసం ఇంటెలిజెన్స్ విభాగాన్ని ఎల్లో నెట్‌వర్క్‌గా మార్చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన సీఎం ఆఫీసు, ఇంటెలిజెన్స్ మధ్య రిటైర్డ్ పోలీసు అధికారి, ఇంటెలిజెన్స్ ఓఎస్డీ యోగానంద్ సమన్వయం చేసుకుంటున్నట్టు సమాచారం. అటు సీఎం ఆఫీసు, ఇటు ఇంటెలిజెన్స్ నుంచి వచ్చే సమాచారంతో డీజీపీ కార్యాలయంలో శాంతిభద్రతల డీఐజీగా ఉన్న ఘట్టమనేని శ్రీనివాస్ పోలీసు యంత్రాంగా న్ని నడిపిస్తున్నట్టు పోలీసుశాఖలో చర్చ సాగుతోంది. ఈ కీలక అధికారులు జిల్లాలవారీగా తమ వారితో అనధికార వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు టీడీపీకోసం ఏమి చేయాలో డైరెక్షన్ ఇస్తున్నట్టు ఒక సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. ఓఎస్డీలుగా రిటైరైన అధికారుల నియామకం ఇంటెలిజెన్స్‌ను ఐఎస్‌డబ్ల్యూ, ఎస్ఐవీ, సీఐ, పీఐ వంటి నాలుగు విభాగాలుగా విభజించి ప్రతి విభాగానికి డీఐజీ లేదా ఐజీ స్థాయి అధికారితోపాటు ఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు పర్యవేక్షిస్తుంటారు. అయితే ప్రస్తుతం ఇంటెలిజెన్స్ విభాగంలో బి.శ్రీనివాసులనే ఒక్క ఐజీ తప్ప మిగతా విభాగాలకు డీఐజీగానీ, ఐజీ స్థాయి అధికారిగానీ లేరు. రాష్ట్ర భద్రతపై నిరంతర నిఘా ఉంచాల్సిన ఇంటెలిజెన్స్ విభాగంలో ఐజీ, డీఐజీ స్థాయి పోస్టులను ఖాళీగా ఉంచి పదవీ విరమణ చేసిన ఐజీ యోగానంద్, డీఐజీ రామకృష్ణ, అడిషనల్ ఎస్పీ మాధవరావులను ఓఎస్డీలుగా నియమించుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. -
గంజాయి గుప్పుమంటోంది
సాక్షి, హైదరాబాద్ : గంజాయి గాండ్రిస్తోంది. విద్యార్థుల మెదళ్లను చిదిమేస్తోంది. గంజాయి మత్తుతో కంపుకొడుతున్నాయి. శివారు ప్రాంతాలకే పరిమితం అయిందనుకున్న గంజాయి ఘాటు ఇప్పుడు హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ప్రముఖ కాలేజీలనూ నిషాలో పడేస్తున్నాయి. నాలుగైదు కాలేజీలు మినహా ప్రతి కాలేజీలోనూ గంజాయి గుప్పుమంటోంది. ఎక్సైజ్ శాఖ వరుసగా ఛేదిస్తున్న కేసుల్లో గంజాయి వ్యవహారం యావత్ విద్యార్థి లోకాన్ని ఆందోళనలో పడేసేలా కనిపిస్తోంది. హైదరాబాద్, శివారు, ప్రాంతాల్లోని డిగ్రీ, ఇంజనీరింగ్, బీబీఏ, హోటల్ మేనేజ్మెంట్, కాలేజీల్లో గంజాయి వాడకం విపరీతంగా పెరిగిం దని ఎక్సైజ్ శాఖ గుర్తించింది. ఈ మేరకు ప్రత్యేక బృందాలు దింపిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వేట సాగిస్తూ గంజాయి దందా సాగిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా అనేక సంచలనాత్మక అంశాలను వెలుగులోకి తెచ్చారు. ప్రతి కాలేజీలోని సెక్షన్లలో 15 నుంచి 18 మంది గంజాయి తాగుతున్నట్లు ఎక్సైజ్ శాఖ అధ్యయనంలో బయటపడటం కలకలం రేపుతోంది. ఐదేళ్ల కిందటి వరకు సెక్షన్‌కు 7 నుంచి 8 మంది మా త్రమే గంజాయి తాగగా.. ఇప్పుడు 50% మేర పెరిగిపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. 2017లో గం జాయి పట్టుకున్న వ్యవహారంలో 17 కేసులు నమో దు చేస్తే, 2018లో ఆ çసంఖ్య 90కి చేరింది. ఈ నెల రోజుల్లో 7 కేసులు నమోదు కావడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ‘స్కోరింగ్’లో విద్యార్థులే.. ఎక్సైజ్, పోలీసులు ఎప్పటికప్పుడు గంజాయి పట్టుకుని కేసులు నమోదు చేస్తుండటంతో విద్యార్థులే గంజాయిని వైజాగ్, అరకులో కొనుగోలు చేసి తమ స్నేహితులకు విక్రయిస్తున్నారు. గంజాయి విక్రయించడాన్ని ‘స్కోరింగ్’అనే కోడ్ పేరుతో పిలుచుకుంటున్నారు. గతంలో దీన్ని కొంత మంది బ్రోకర్లు, ఏజెంట్లు విద్యార్థులకు అమ్మేవారు. తీరా ఇప్పుడు విద్యార్థులే స్కోరింగ్ దందాలోకి దిగడం గుబులు రేపుతోందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. గడిచిన 2 నెలల్లో 8 మంది ఇంజనీరింగ్ విద్యార్థులపై ఎక్సైజ్ శాఖ కేసులు పెట్టింది. వీరి విచారణలో అంబర్పేట్, చిక్కడపల్లి, మెహిదీపట్నం, నాంపల్లి, సీతాఫల్మండి, ఫలక్‌నుమా, చైతన్యపురి ప్రాంతాల్లోని విద్యార్థులకు అమ్మకం సాగిస్తున్నట్లు తేలింది. అరకు వెళ్లి 2 కేజీల చొప్పున కొనుగోలు చేయడం, దాన్ని ఎక్సైజ్ పోలీసుల కంటపడకుండా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో తరలించి స్నేహితులకు అందజేస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్, శివారు ప్రాంతాల్లోని అన్ని కాలేజీలు 600 వరకు ఉన్నాయి. ఇందులోని 5 వేల మందికి పైగా విద్యార్థులు గంజాయి మత్తులో జోగుతున్నట్లు ఎౖజ్ శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. నిర్బంధం నుంచి.. ఇంటర్ వరకు నిర్బంధంలాగా ఉండి ఇంజనీరింగ్‌కు వచ్చే సరికి ఒక్కసారిగా స్వేచ్ఛా జీవులుగా మారినట్లు విద్యార్థులు ప్రవర్తిస్తున్నారని, దీంతో ఎంజాయ్ పేరుతో గంజాయికి అలవాటు పడి మత్తులో జోగుతున్నారని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. తల్లిదండ్రులు ఇస్తున్న విచ్చలవిడి స్వేచ్ఛ, డబ్బు విద్యార్థులు గంజాయి వైపు మళ్లేలా చేస్తున్నాయని, దీనిపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు. ఆల్కహాల్ తాగితే వాసన ద్వారా ఇంట్లో తెలుస్తుందని, గంజాయి అయితే పెద్దగా ఇబ్బంది ఉండదని స్నేహితులు అలవాటు చేస్తుండటంతో ఏటా దీనికి బానిసలవుతున్న వారి సంఖ్య రెట్టింపు అవుతోందని అధికారులు చెబుతున్నారు. కాలేజీల వద్ద నిఘా ఏదీ? విద్యాసంస్థలు ఆర్థిక ప్రయోజనాలకే పరిమితం కావడంతో విద్యార్థులు ఇలాంటి వ్యసనాలకు దగ్గరవుతున్నారన్న ఆరోపణలున్నాయి. కాలేజీకి విద్యార్థులు వస్తున్నారా.. ఎందుకు గైర్హాజరు అవుతున్నారు.. వారి ప్రవర్తనలో వచ్చిన మార్పులేంటి.. వస్తే ఆ మార్పు వెనుక కారణాలేంటన్న అంశాలపై దృష్టి పెట్టట్లేదని ఎక్సైజ్, పోలీస్ అధికారులు చెబుతున్నారు. కాలేజీ గ్రౌండ్స్, కాలేజీ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే గంజాయి ఎక్కువగా తాగుతున్నట్లు తమ విచారణలో తేలిందని ఎక్సైజ్ సీనియర్ అధికారి వెల్లడించారు. కాలేజీలు విద్యార్థులపై దృష్టి పెట్టి, పరిసరాల్లో నిఘా పెడితే ఈ పరిస్థితిని నియంత్రించవచ్చిని చెబుతున్నారు. సమష్టిగానే నియంత్రణ.. గంజాయి మత్తులో విద్యార్థులు జోగుతూ పోతే పంజాబ్ లాంటి పరిస్థితులు వస్తాయని దర్యాప్తు, ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీని నియంత్రణ పోలీస్, ఎౖMð్సజ్తో మాత్రమే కాదని, విద్యార్థుల తల్లిదండ్రులు, కాలేజీ యాజమాన్యాలు, ఉన్నత విద్యా శాఖ, రెవెన్యూ విభాగాలు సమష్టిగా చర్యలు తీసుకుంటేనే విద్యార్థుల జీవితాలు బాగుపడుతాయని, లేకుంటే ప్రమాదకర పరిస్థితులుంటాయని హెచ్చరిస్తున్నారు. తమ వంతుగా కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని, కానీ వాటిని అమలు చేయడం, విద్యార్థులను కనిపెట్టడం యాజమాన్యాలు, తల్లిదండ్రులపైనే ఉంటుందని చెబుతున్నారు. -
గురుకులాల్లో నిఘా నేత్రాలు
సాక్షి, హైదరాబాద్: గురుకుల పాఠశాలల్లో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు గురుకుల సొసైటీలు చర్యలు చేపట్టాయి. ప్రతి గురుకులంలో అధునాతన పద్ధతిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. గురుకులాల సంఖ్య పెరగటంతో అక్కడక్కడా అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో వాటిని నియంత్రించేందుకు నిఘా వ్యవస్థను త్వరలో అందుబాటులోకి తేనున్నాయి. ఒక్కో గురుకుల పాఠశాలలో కనిష్టంగా రూ.1.5 లక్షలతో డిజిటల్ సీసీ కెమెరాలు, స్టోరేజీ సిస్టం ఏర్పాటు కు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 565 గురుకుల పాఠశాలలున్నాయి. వీటిలో సీసీ కెమెరాల వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఈ వ్యవస్థను పాఠశాల స్థాయిలో ఆపరేటింగ్ చేసేలా వెసులుబాటు ఉన్నప్పటికీ.. నిర్వహణ తీరును పరిశీలించేందుకు గురుకుల సొసైటీలో ప్రత్యేకంగా కమాండ్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. అన్ని గురుకుల పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో వీటి ఏర్పాటుకు రూ.15 కోట్లు ఖర్చు చేసేలా సొసైటీలు సుముఖత వ్యక్తం చేయడంతో అధికారులు ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. -
నిఘా రాజ్యంగా మారుస్తారా?
న్యూఢిల్లీ: ఆన్లైన్ డేటాపై నిఘా పెట్టేందుకు సోషల్ మీడియా హబ్‌ను ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘పౌరులందరి కదలికలు, సంబంధాలపై పూర్తి నిఘా ఉండే రాజ్యంలా దేశాన్ని మార్చాలనుకుంటున్నారా?’ అంటూ కేంద్రానికి కోర్టు మొట్టికాయలు వేసింది. ఫేస్బుక్, ట్విటర్, వాట్సాప్ తదితర అన్ని సామాజిక మాధ్యమాల్లో వచ్చే పోస్ట్‌లు, సందేశాలతోపాటు వార్తా వెబ్సైట్లు, బ్లాగులలో ప్రచురితమయ్యే కథనాలను సేకరించి, విశ్లేషించేందుకు అవసరమైన సాఫ్ట్వేర్ యంత్రాంగం ఏర్పాటు కోసం ఈ ఏడాది మే నెలలో కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ టెండర్ పిలిచింది. బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్) అనే ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా ఈ టెండర్ జారీ అయ్యింది. కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాన్ని అడ్డుకోవాలంటూ తృణమూల్ కాంగ్రెస్ శాసనసభ్యురాలు మహువా మొయిత్రా ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయడంతో విషయం సుప్రీం కోర్టుకు చేరింది. రెండు వారాల్లో స్పందించండి.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ శుక్రవారం మహువా పిటిషన్‌ను విచారించింది. దీనిపై 2 వారాల్లో స్పందించాలంటూ కేంద్రానికి నోటీసు జారీ చేసింది. పిటిషన్ విచారణలో అటార్నీ జనరల్ వేణుగోపాల్ లేదా ఎవరో ఒక న్యాయాధికారి తమకు సాయంగా ఉండాలని ఆదేశించింది. మహువా తరఫున న్యాయవాది ఏఎం సింఘ్వీ వాదనలు వినిపిస్తూ ప్రభుత్వం సోషల్ మీడియా హబ్ ద్వారా సామాజిక మాధ్యమాల్లో, ఈ–మెయిల్స్‌లో వచ్చే పోస్ట్‌లు, సందేశాలను విశ్లేషించాలనుకుంటోందని కోర్టుకు చెప్పారు. పౌరుల ప్రాథమిక హక్కయిన గోప్యతా హక్కును కాలరాయాలని ప్రభుత్వం చూస్తోందని, రాజ్యాంగంలోని అధికరణాలు 14, 19(1)(ఎ), 21ల ద్వారా పౌరులకు సంక్రమించిన ప్రాథమిక హక్కులకు భంగంకలిగేవీలుందని వాదించారు. టెండర్‌ను ప్రభుత్వం ఆగస్టు 20న తెరవనున్నట్లు ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో అంతకంటే ముందే, ఆగస్టు 3కు విచారణను ధర్మాసనం వాయిదా వేసింది. సోషల్ మీడియా హబ్ ఏర్పాటు చేయకుండా కేంద్రాన్ని అడ్డుకునేందుకు జూన్ 18నే అత్యవసర విచారణ జరపాల్సిందిగా మహువా కోరినా అప్పట్లో కోర్టు నిరాకరించింది. ఏ అధికారం లేకుండానే ప్రభుత్వం ప్రజల జీవితాల్లోకి చొరబడాలనుకుంటోందనీ, భావ ప్రకటనా స్వేచ్ఛా హక్కు సహా పలు ప్రాథమిక హక్కులకు దీని ద్వారా భంగం కలుగుతుందని మహువా పిటిషన్లో పేర్కొన్నారు. టెండర్లో ఏముంది? టెండర్లో తాము కోరుకుంటున్న సాఫ్ట్వేర్ యంత్రాంగం ఎలా ఉండాలో కేంద్రం వివరించింది. సామాజిక మాధ్యమాలతోపాటు, వార్తల వెబ్సైట్లు, బ్లాగులు తదితరాల్లోని డిజిటల్ సమాచారాన్నంతా ప్రాంతాల వారీగా దేశ వ్యాప్తంగా సేకరించి, ఆటోమేటిక్‌గా విశ్లేషించగలిగేలా సాఫ్ట్వేర్ ఉండాలి. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పరిణామాలను తెలుసుకునేందుకు ఒక్కో జిల్లాలో కొంతమంది మీడియా వారిని ఒప్పంద ప్రాతిపదికన నియమించుకుంటారు. ఆటోమేటిక్‌గా సమాచారాన్ని వ్యూహాత్మకంగా విశ్లేషించి నివేదికలు ఇచ్చేలా సాఫ్ట్వేర్ ఉండాలి. ప్రత్యేకించిన వెబ్సైట్లో సమాచారాన్ని ప్రచురించగలగాలి. కేంద్రం చేపట్టే వివిధ పథకాల ఆన్లైన్ ప్రచార కార్యక్రమాల ప్రభావం ప్రజలపై ఎలా ఉందో తెలుసుకునేందుకు కూడా అవకాశం ఉండాలని టెండర్లో ప్రభుత్వం పేర్కొంది. -
జీఎస్టీలో జీరో దందా!
సాక్షి, హైదరాబాద్: వస్తుసేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో జీరో (పన్ను చెల్లించకుండా విక్రయాలు) దందా విజృంభిస్తోంది. ఐరన్ అండ్ స్టీల్, మసాలా దినుసులు, డ్రైఫ్రూట్స్, సిరామిక్ టైల్స్, సిమెంటు వంటి సరుకులకు సంబంధించి జీరో దందా జోరుగా సాగుతోంది. ఏ రాష్ట్రం నుంచి ఏ సరుకు వస్తోందో తెలుసుకునే నిఘా వ్యవస్థ అయిన చెక్‌పోస్టులను ఎత్తివేయడం, మొబైల్ తనిఖీలను కూడా చేపట్టకపోవడంతో వేల కోట్ల విలువైన సరుకులు బ్లాక్‌మార్కెట్‌కు తరలివెళుతున్నాయి. దీంతో ప్రభుత్వానికి వందల కోట్లలో ఆదాయం చేజారుతున్నా... పన్నుల శాఖలో కదలిక రావడం లేదు. ఆంధ్రప్రదేశ్, కేరళ తదితర రాష్ట్రాలు జీఎస్టీ అమల్లోకి వచ్చిన తొలి నెల నుంచే మొబైల్ తనిఖీలు చేపట్టి, పన్ను ఎగవేతలను అరికడుతున్నాయి. రాష్ట్రంలో మాత్రం అధికారులు ఇంకా మీనమేషాలు లెక్కిస్తుండటం గమనార్హం. ఒక్క రోజు తనిఖీల్లోనే రూ. 34 లక్షలు ఇటీవల రాష్ట్ర ఉన్నతాధికారులు విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనే జీరో దందా తీరును స్పష్టంగా చూపుతోంది. ఈ నెల 28న రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ తనిఖీలు చేపట్టి 34 వాహనాలను సీజ్ చేసి, రూ.34.36 లక్షల జరిమానా విధించామని ఆ శాఖ కమిషనర్ ప్రకటించారు. ఒక్క రోజు తనిఖీల్లోనే ఇలా ఉంటే.. ఇంతకాలంగా ఎన్ని వందల కోట్ల్ల పన్నుకు చిల్లు పడిందో అర్థమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని బృందాలు తనిఖీలు నిర్వహిస్తే ఏకంగా నెలకు రూ.100 కోట్ల మేర సమకూరే అవకాశముందని అంటున్నారు. దీనివల్ల ఇటు సర్కారుకు ఆదాయంతోపాటు జీరో దందా నడవదని అటు వ్యాపారులకు సంకేతాలు ఇచ్చినట్టవుతుందని పేర్కొంటున్నారు. సానుకూల దృక్పథమంటే.. వదిలేయడం కాదు! కొత్త పన్ను విధానాన్ని తీసుకువస్తున్నందున వ్యాపారుల పట్ల కొంత సానుకూల దృక్పథా న్ని కనబర్చాలని జీఎస్టీ అమల్లోకి వచ్చిన తొలినాళ్లలో (ఆరు నెలల క్రితం) కేంద్రం చిన్న సూచన చేసింది. దీనిని సాకుగా తీసుకున్న ఉన్నతాధికారులు రాష్ట్ర పన్నుల శాఖను ఓ రకంగా నిద్రావస్థకు చేర్చారన్న విమర్శలు వస్తున్నాయి. ఓ వైపు రవాణాదారులు, డీలర్లు కుమ్మక్కై వేల కోట్ల విలువైన సరుకులతో రాష్ట్ర మార్కెట్లో జీరో దందా చేస్తున్నా పట్టించుకో వడం లేదని... పాత బకాయిలు వసూలు చేసేందుకు, జీఎస్టీ రిజిస్ట్రేషన్ల కోసమే సిబ్బం దిని వాడుకుంటున్నారని పన్నుల శాఖ అధికా రులే పేర్కొంటున్నారు. ఇప్పటికైనా మొబైల్ తనిఖీలు ముమ్మరం చేసి, పన్ను ఎగవేతదా రులకు చెక్ పెట్టాల్సి ఉందని అంటున్నారు. కేవలం కాగితాల మీదే.. మొబైల్ తనిఖీల విషయంలో ఇటీవలే మేల్కొన్న రాష్ట్ర పన్నుల శాఖ.. తూతూమంత్రంగా చర్యలకు ఉపక్రమిం చింది. రాష్ట్రంలోని 12 వాణిజ్య పన్నుల డివిజన్లకు గాను 24 మొబైల్ తనిఖీ బృందాలను ఏర్పాటు చేసింది. ప్రతి బృం దంలో ఉపపన్నుల అధికారి (డీసీటీవో), సహాయ పన్నుల అధికారి (ఏసీటీవో)లతో పాటు సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు కలిపి నలుగురిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలు వెలువడి పది రోజులవుతున్నా.. ఒక్కరోజు కూడా మొబైల్ తనిఖీలు జరగకపోవడం గమనా ర్హం. అంతేకాదు.. అసలు ఎప్పుడు తనిఖీ లు నిర్వహించాలి, జీఎస్టీ నేపథ్యంలో తనిఖీలు ఎలా ఉండాలన్న దానిపైనా స్పష్టత లేకుండా.. కేవలం కాగితాల మీద ఉత్తర్వులిచ్చి చేతులు దులుపుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. -
బియ్యం మాఫియాపై ఉక్కుపాదం
సాక్షి, హైదరాబాద్: ప్రజా పంపిణీ కార్యక్రమాన్ని గాడిలో పెట్టేందుకు, ప్రధానంగా రేషన్ బియ్యం సరఫరాలో అక్రమాలను అడ్డుకునేందుకు పౌరస రఫరాల శాఖ చేసిన ప్రయోగం సత్ఫలితాలను ఇస్తోంది. ఎస్పీ ర్యాంకు రిటైర్డ్ పోలీసు అధికారి నేతృత్వంలో ఏర్పాటుచేసిన నిఘా వ్యవస్థతో రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపినట్లయ్యింది. ఈ శాఖలో ఎన్ఫోర్స్మెంట్ టాస్క్‌ఫోర్స్ విభాగాన్ని ఏర్పాటు చేయకముందు ఇక్కడి వ్యాపారులు రేషన్ బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకునేవారు. సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ శాఖ కమిషనర్‌గా బాధ్యతలు తీసుకు న్నాక.. ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ఫోర్సుకు శ్రీకారం చుట్టారు. నిత్యావసర సరుకుల పంపిణీలో అవినీ తిని నిరోధించడం, అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం, రైస్‌మిల్లర్లు, రవాణా కాంట్రాక్టర్ల ఆగడాలను అదుపు చేసేందుకు రిటైర్డ్ పోలీసు అధికారులతోపాటు, రెవిన్యూ, కమర్షియల్ ట్యాక్స్, తదితర శాఖలకు చెందిన 20 మందితో అయిదు బృందాలుగా ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని తొమ్మిది నెలల కిందట ఏర్పాటు చేశారు. మండల స్థాయి గోదాములు, రేషన్ దుకాణాలు, సీఎంఆర్ మిల్లులు, మధ్యాహ్న భోజనంకోసం సన్నబియ్యం అందుకునే సంస్థలు, హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలలు, ఎల్పీజీ గోదాములు, రైళ్లు తదితర ప్రదేశాల్లో మొత్తంగా 639 చోట్ల దాడులు చేశారు. వీరి తనిఖీల్లో రూ.3.10 కోట్ల విలువైన 11వేల 537 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. రైస్ మిల్లులపై 139 6ఎ కేసులు, 46 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ శాఖ చరిత్రలో తొలిసారి పీడీ యాక్టును కూడా అమలు చేశారు. ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో పీడీ కేసులు నమోదయ్యాయి. ఎన్ఫోర్స్మెంట్ దాడుల్లో రూ.3.44 లక్షల విలువైన చక్కెర, ఎల్పీజీ సిలిండర్లు, కిరోసిన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ బృందాల దాడుల వల్ల ధాన్యంలో తరుగు, సన్నబియ్యం, రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా రూ.4.43కోట్ల విలువైన సరుకు అర్హులకు చేరేలా, అక్రమాలను నివారించగలిగారు. నిఘాతో మంచి ఫలితాలు పౌరసరఫరాల శాఖలో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయడంవల్ల బియ్యం అక్రమ రవా ణాను నియంత్రించగలి గామని శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు. ఏటా రూ.10వేల కోట్ల లావాదేవీలు జరిగే సంస్థలో సాంకేతిక పరిజ్ఞా నాన్ని వినియోగిం చుకుని పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయగలుగు తున్నాం. కాంట్రాక్టు పద్ధతిలో రిటైర్డ్ ఉద్యోగులను తీసుకుని బృం దాలు తయారు చేశాం. క్షేత్రస్థాయి పనుల్లో వాటిని తనిఖీ చేసే బాధ్యతలను ఈ బృందా లకు అప్పగించామని ఆయన వివరించారు. -
మైనింగ్‌పై ఉపగ్రహ నిఘా నేత్రం
న్యూఢిల్లీ: గనుల తవ్వకాల్లో అక్రమాల నిరోధానికి ఉపగ్రహ ఆధారిత నిఘా వ్యవస్థ(ఎంఎస్ఎస్)ను కేంద్రం శనివారం ప్రారంభించింది. దేశ సహజ వనరులను సమర్థంగా వినియోగించుకునేందుకు ఇది ఉపకరిస్తుందని గనుల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. అనుమతి ఉన్న ప్రాంతానికి ఆవల మైనింగ్ చేపడితే ఎంఎస్ఎస్ హెచ్చరికలతో కూడిన అలర్ట్‌లను జారీ చేస్తుంది. వీటిని ఐబీఎం రిమోట్ సెన్సింగ్ నియంత్రణ కేంద్రం అధ్యయనం చేసి క్షేత్రస్థాయి పరిశీలనను సంబంధిత జిల్లా అధికారులకు పంపుతుంది. గని కార్మికుల సమాచారాన్నీ ఆన్లైన్లో అందిస్తుంది. దీంతో మెరుగైన భద్రతా ప్రమాణాలు రూపొందించవచ్చు. ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్, గాంధీనగర్‌లోని భాస్కరాచార్య ఇనిస్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్ అండ్ జియో ఇన్ఫోమాటిక్స్, ఎలక్ట్రానిక్స్, ఐటీ మత్రిత్వ శాఖ సంయుక్తంగా ఎంఎస్ఎస్ను అభివృద్ధి చేశాయి. -
ప్రైవేటుకు డయాగ్నొస్టిక్ కేంద్రాలు
అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటుకు సర్కారు నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాగ్నొస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం... ఆ కేంద్రాలన్నింటినీ ఒకే ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించాలని యోచిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానంలో నిర్వహిస్తూ... చేసిన పరీక్షలను బట్టి సొమ్ము చెల్లించాలని భావిస్తోంది. కానీ ఈ ప్రతిపాదనను ప్రభుత్వ వైద్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ‘ప్రైవేటు’కు మేలు చేసేందుకే డయాగ్నొస్టిక్ కేంద్రాల అప్పగింత, పీపీపీ పద్ధతిలో నిర్వహణను తెరపైకి తెచ్చారని ఆరోపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ అక్కడి ప్రభుత్వం ప్రైవేట్‌కు మేలు చేసేందుకు ఈ విధానాన్ని అమలు చేయడంపై తీవ్రంగా నిరసన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ ప్రతిపాదనల ప్రకారం... ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) మొదలు జిల్లా ఆసుపత్రులు, రాష్ట్రస్థాయి వరకు అన్ని ఆసుపత్రుల్లో ప్రైవేట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో డయాగ్నొస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. వీటిలో ఆరోగ్యశ్రీ కార్డులున్న రోగులందరికీ ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షలకయ్యే ఖర్చును ప్రభుత్వం ప్రైవేట్ ఏజెన్సీకి చెల్లిస్తుంది. దీనిని ప్రభుత్వ వైద్యులు తప్పుపడుతున్నారు. ప్రైవేటుకు ఇవ్వడం కాకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తే... ప్రభుత్వమిచ్చే సొమ్ముతో మౌలిక సదుపాయాలు కల్పించుకోవచ్చని పేర్కొంటున్నారు. రక్త పరీక్షలకూ దిక్కులేదు.. రాష్ట్రంలో సుమారు 740 పీహెచ్‌సీలు, 5 వేల వరకు ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయి. ఇక 115 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 42 ఏరియా ఆసుపత్రులు, 10 జిల్లా ఆసుపత్రులు, 18 బోధనాసుపత్రులు, 5 మెటర్నిటీ ఆసుపత్రులు ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా ఇప్పటికీ పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు చేసే సౌకర్యం లేదు. పీహెచ్‌సీల్లో అయితే కనీసం రక్త పరీక్షలు కూడా చేసే దిక్కులేదు. ఏరియా ఆసుపత్రుల్లోనూ అరకొర వసతులే. కనీసం స్కానింగ్, ఎక్స్‌రే వంటి వసతులైనా లేవు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాసుపత్రుల్లో ఏర్పాటు చేయదలచిన డయాగ్నొస్టిక్ కేంద్రాలను... ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఏర్పాటు చేస్తే బాగుంటుందని వైద్యులు కోరుతున్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రక్త పరీక్షలు నిర్వహించడానికి పెద్దగా ఖర్చు ఉండదని... ఎక్స్‌రే, స్కానింగ్, ఎంఆర్ఐ యంత్రాలను ఒకసారి ఏర్పాటు చేస్తే పేద రోగులకు శాశ్వతంగా మేలు జరుగుతుందని స్పష్టం చేస్తున్నారు. ఏరియా ఆసుపత్రుల్లో ఎక్స్‌రే, ఈసీజీ, స్కానింగ్ వంటి వసతులు ప్రభుత్వమే కల్పిస్తే చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలందరికీ ఉపయోగంగా ఉంటుందని చెబుతున్నారు. ఒకే ఏజెన్సీకి.. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ఉన్న ప్రతిపాదన అమల్లోకి వస్తే ఒకే ప్రైవేటు ఏజెన్సీకి డయాగ్నొస్టిక్ కేంద్రాల నిర్వహణ బాధ్యతను అప్పగిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరికీ ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్య లోపాలతో స్మార్ట్ కార్డులను జారీ చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే దీనిని ప్రతిష్టాత్మకంగా చేపట్టనుంది. డయాగ్నొస్టిక్ కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని, వసతిని ప్రైవేటు ఏజెన్సీకి ప్రభుత్వమే కల్పిస్తుంది. అయితే విద్యుత్ బిల్లుల నుంచి రోగులకు అవసరమైన పరీక్షలు నిర్వహించడం దాకా నిర్వహణ బాధ్యత మొత్తం ప్రైవేటు ఏజె న్సీదే. ఏ ఆసుపత్రిలో ఏ రోజు ఎన్ని వైద్య పరీక్షలు నిర్వహించారనే సమాచారాన్ని ఆ ఆస్పత్రి వైద్యులు, ప్రైవేటు ఏజెన్సీ కలసి ఆన్లైన్లో నమోదు చేస్తారు. దాని ప్రకారం ఏజెన్సీకి ప్రభుత్వం సొమ్ము చెల్లిస్తుంది. అయితే వైద్య పరీక్షలు చేయకుండానే.. చేసినట్లు నమోదు చేస్తే ఎలాగన్న ప్రశ్న కూడా అధికారుల్లో నెలకొంది. ఇలా అక్రమాలు జరగకుండా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. -
ఆ 24 గంటలు ఏం చేశారు?
ఉగ్రదాడులను పసిగట్టడంలో భద్రతా వైఫల్యం పఠాన్‌కోట్: గురువారం ఎస్పీని బంధించి, చితగ్గొట్టి వదిలిపెట్టాక 24 గంటలపాటు ఉగ్రవాదులు ఏం చేశారు? వీరి కదలికలను గుర్తించకపోవటం పంజాబ్ పోలీసుల వైఫల్యమేనా?ఎయిర్‌బేస్‌పై ఉగ్రదాడి తర్వాత తలెత్తుతున్న ప్రశ్నలివి. ఈ ఘటన తర్వాత పంజాబ్-పాక్ సరిహద్దుల్లో నిఘా పెంచినా.. అంతకుముందే వచ్చేసిన ఉగ్రవాదుల కదలికలను గుర్తించకపోవటంలో నిఘా వ్యవస్థ వైఫల్యమూ కనబడుతోంది. డిసెంబర్ 30,31న దాదాపు 15 మంది ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడినట్లు ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. పఠాన్‌కోట్‌తోపాటు.. పంజాబ్‌లో ఇతర ఐఏఎఫ్ బేస్‌లున్నాయి. ఆదంపూర్, హల్వారా, బథిండా, అమృత్సర్, పాటియాలాల్లో వైమానిక దళాల కీలక కేంద్రాలున్నాయి. ఇలాంటి ప్రాంతంలో ఎస్పీ కిడ్నాప్ తర్వాత అప్రమత్తంగా ఉన్నట్లు ప్రకటించినా ఐదుగురు ఉగ్రవాదులు తిరగగలిగారంటే.. భద్రతా లోపాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది. ‘నాకాబందీ నిర్వహిస్తుండటం వల్ల ఉగ్రవాదులు వాహనాలు వదిలి నడుస్తూనే ఈ ప్రాంతమంతా తిరిగి ఉండాలి. ఎయిర్‌బేస్ సమీపంలో వారు తిరుగుతుండగా ఎవరికీ అనుమానం రాలేదా? స్థానికులతో పాటు.. భద్రతా దళాలు వీరిని గుర్తించలేదా?’ అని పంజాబ్ మాజీ పోలీసు అధికారి ప్రశ్నించారు. కిడ్నాపై బయటపడ్డ ఎస్పీ వెల్లడించిన విషయాలను సీరియస్‌గా తీసుకోలేదని అర్థమవుతుందన్నారు. గురుదాస్‌పూర్ ఘటన జరిగినప్పుడు కూడా పంజాబ్ పోలీసులు కునుకుతీస్తున్నట్లు సీసీటీవీల్లో కనిపించింది. శుక్రవారం పఠాన్‌కోట్ ఎస్పీ కిడ్నాపైన సంగతి తెలుసుకుని.. ఆయనకు కాల్ చేసిన గన్‌మాన్‌కు.. ‘సలాం అలైకూం’ అనే సమాధానం వచ్చింది. ‘ఇది మా ఎస్పీసార్ నెంబరు మీరెవరు మాట్లాడుతున్నారని ప్రశ్నించగానే.. ఫోన్ కట్ చేశారు’ అని ఎస్పీ గన్‌మ్యాన్ తెలిపాడు. దీన్ని బట్టి ఎస్పీని కొట్టి వాహనం తీసుకెళ్లిన వారూ పాక్ ఉగ్రవాదులేననే అనుమానం బలపడుతోంది. మరోపక్క.. ఐఎస్ఐకి సమాచారం అందించిన కేసులో ఇటీవలే అరెస్టైన భారత వైమానిక దళం అధికారి కేకే రంజిత్‌ను పంజాబ్‌లో ఉగ్రఘటన నేపథ్యంలో మరోసారి విచారించనున్నారు. వాళ్లు వస్తుండగానే చూశాం గగనతల నిఘాతోనే ఎదురుదాడి: ఐఏఎఫ్ న్యూఢిల్లీ: పఠాన్‌కోట్ ఘటనలో ఉగ్రవాదులు ఎయిర్‌బేస్‌లో అడుగుపెడుతుండగానే.. గగనతల నిఘా (ఏరియల్ సర్వీలెన్స్) ద్వారా గుర్తించి సమర్థవంతంగా అడ్డుకున్నామని భారతీయ వైమానిక దళం ప్రకటించింది. ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ విభాగం ముందుగానే హెచ్చరించటంతో అప్రమత్తంగానే ఉన్నామని.. పక్కా ప్రణాళిక, వివిధ విభాగాల సమన్వయంతో ఎదురుదాడి చేయటం వల్లే ఎయిర్‌బేస్‌ను కాపాడుకోగలిగామని పేర్కొంది. మిలటరీ దుస్తుల్లో ఉన్న ఉగ్రవాదులు ఎయిర్ బేస్ స్టేషన్లోకి వస్తుండటాన్ని గగనతల నిఘా నేత్రం ద్వారా గుర్తించి.. వారిపై కాల్పులు జరిపినట్లు ఈ ప్రకటనలో తెలిపింది. పాకిస్తాన్ సరిహద్దుకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ కీలకమైన మిగ్-21 యుద్ధ విమానాలు, ఎమ్ఐ-25 యుద్ధ హెలికాప్టర్లకు బేస్ పాయింట్ కావటం విశేషం. ఉగ్రదాడుల పంజాబ్ న్యూఢిల్లీ: ఆరునెలల్లో పంజాబ్‌పై ఇది రెండో ఉగ్రదాడి. గతేడాది జూలైలో గురుదాస్‌పూర్‌పై జరిగిన ఉగ్రవాదుల దాడినుంచి తేరుకోకముందే.. అదే తరహాలో దాడికి యత్నం జరగటం సంచలనం సృష్టిస్తోంది. 2001 నుంచి శనివారం ఘటన వరకు పంజాబ్‌లో జరిగిన ఉగ్రవాదుల ఘటనలను ఓసారి పరిశీలిస్తే.. మార్చి 1, 2001: గురుదాస్‌పూర్ ప్రాంతంలో భారత్,పాక్ సరిహద్దుల్లో 135 గజాల సొరంగ మార్గాన్ని గుర్తించారు జనవరి 1, 2002: పంజాబ్-హిమాచల్ ప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు జవాన్లు, ఐదుగురు స్థానికులు మృతిచెందారు. జనవరి 31, 2002: హోషియార్పూర్ జిల్లాలో బస్‌స్టేషన్‌లో జరిగిన పేలుడులో ఇద్దరు మరణించగా 12 మందికి గాయాలయ్యాయి. మార్చి 31, 2002: లూధియానా దగ్గర్లోని రైలులో జరిగిన పేలుడులో ఇద్దరు చనిపోయారు. ఏప్రిల్ 28, 2006: జలంధర్ బస్‌స్టేషన్‌లో జరిగిన బాంబు పేలుడులో 8 మంది చనిపోయారు. అక్టోబర్ 14, 2007: లూధియానాలో ఓ థియేటర్లో బాంబు పేలుడులో పదిమంది మరణించగా 40 మందికి పైగా గాయాలయ్యాయి. జూలై 27, 2015: మిలటరీ దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు.. ఓ పోలీస్‌స్టేషన్‌పై దాడి చేయటంతో.. ఎస్పీతో సహా ఎనిమిది మంది చనిపోయారు. జనవరి 2, 2016: పఠాన్‌కోట్‌లోని ఐఏఎఫ్ ఎయిర్‌బేస్‌పై జరిగిన ఉగ్రదాడిలో నలుగురు ఉగ్రవాదులు, ముగ్గురు భదత్రా సిబ్బంది మృతిచెందారు. -
రాష్ట్రానికి కేంద్ర బలగాలు
ఒకే సమయంలో అసెంబ్లీ సమావేశాలు, బక్రీద్, గణేశ్ నిమజ్జనం సాక్షి, హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాలు, బక్రీద్, గణేశ్ నిమజ్జన వేడుకల సందర్భంగా శాంతిభద్రతలకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఉండేందుకు పోలీసు ఉన్నతాధికారులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. ఈనెల 23 నుంచి అసెంబ్లీ సమావేశాలు, 25న బక్రీద్ పండుగ, 27న గణేశ్ నిమజ్జనం ఉండటంతో పోలీసులు రాజధాని నగరాన్ని పూర్తిగా తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. ప్రస్తుతం నగర కమిషనరేట్పరిధిలో 12 వేల మంది, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 7 వేల మంది పోలీసు సిబ్బంది ఉన్నారు. వీరికి తోడు జిల్లాల నుంచి 7వేల మందిని రప్పించారు. అదేవిధంగా రాష్ట్ర విజ్ఞప్తి మేరకు కేంద్రం నుంచి వెయ్యి మంది సీఆర్పీఎఫ్ సిబ్బందితో పాటు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 500 మంది పోలీసులు వచ్చారు. అలాగే రాష్ట్రంలోని 62 వేల మంది పోలీసు సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. హైదరాబాద్‌పై పటిష్ట నిఘా నగరంలో మూడు ప్రధాన ఘటనలు ఒకేసారి ఉండటంతో రాత్రి పగలు తేడా లేకుండా మూడు షిఫ్టుల్లో సిబ్బంది పనిచేసేలా ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఏ చిన్న సంఘటన చోటుచేసుకున్నా ఉన్నతాధికారులకు చేరేలా స్పెషల్‌బ్రాంచ్ (ఎస్బీ), ఇంటెలిజెన్స్ పోలీసులను అప్రమత్తం చేశారు. భారీగా సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. సీసీ కెమెరాలన్నింటినీ అత్యాధునిక కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానించి, ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో తెలిసేలా పటిష్ట చర్యలు చేపట్టారు. వీటికి తోడు వెహికిల్ మౌంట్ కెమెరాల ద్వారా ప్రతీక్షణం రికార్డు చేయనున్నారు. ఈ వాహనాల ద్వారా 360 డిగ్రీల కోణంలో 500 మీటర్ల వరకు దృశ్యాలను బంధించనున్నారు. 30 బాంబు డిస్పోజల్స్, 30 డాగ్ స్క్వాడ్ బృందాలు పర్యవేక్షణలో ఉండేలా చర్యలు చేపట్టారు. జిల్లాలకు హెచ్చరికలు ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఇద్దరు మావోయిస్టుల ఎన్కౌంటర్ నేపథ్యంలో వారి కదలికలు ముమ్మరమయ్యాయి. దీంతో పోలీసు ఉన్నతాధికారులు జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. జిల్లాల నుంచి 40 శాతం పోలీసు సిబ్బంది హైదరాబాద్ రావడంతో అక్కడ శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మావోయిస్టు ప్రాబల్యం కలిగిన జిల్లాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ముఖ్యంగా వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో మావోయిస్టు కదలికలున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. -
నిఘా నిస్తేజం
♦ రైళ్లలో పెరుగుతున్న చోరీలు ♦ విఫలమవుతున్న భద్రత బలగాలు బిట్రగుంట : విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో నిఘా వ్యవస్థ నిస్తేజంగా మారింది. జీఆర్పీ, ఆర్పీఎఫ్ విభాగాల్లో సిబ్బంది కొరత, ఫీల్డ్ ఇంటెలిజన్స్, ఇన్ఫార్మర్ల వ్యవస్థలకు ప్రాధాన్యం తగ్గిపోవడంతో రైళ్లలో దొంగలు విజృంభిస్తున్నారు. తాజాగా సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో ఐపీఎస్ అధికారిపై జరిగిన దాడితో పాటు డివిజన్ పరిధిలో గడిచిన రెండు నెలల కాలంలో జరిగిన చోరీ ఘటనలే ఇందుకు నిదర్శనం. మత్తు మందు ఇచ్చి దోచుకునే ఉత్తరాది ముఠాలతో పాటు ఒంగోలు, నెల్లూరు, గుంటూరు జిల్లాలకు చెందిన లోకల్ గ్యాంగ్‌లు రైళ్లలో చోరీలకు పాల్పడుతున్నట్లు అధికారుల వద్ద సమాచారం ఉన్నా నేరాల నియంత్రణకు, దొంగల ఆటకట్టించేందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు. సిబ్బంది కొరత, స్పష్టమైన సమాచారం ఇచ్చే ఇన్ఫార్మర్లు లేకపోవడం, ఇతర కేసుల్లో మాదిరి సాంకేతిక పరిజ్ఞానం అక్కరకు రాకపోవడం వంటి సమస్యలతో నిఘా వ్యవస్థ విఫలమవుతోంది. దీంతో రైలు ప్రయాణమంటేనే ప్రయాణికులు హడలిపోయే పరిస్థితి నెలకొంది. వరుస చోరీలతో ఆందోళన సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో మనుబోలు వద్ద పట్టపగలే వికలాంగుల బోగీలో ఉన్న మహిళా ఐపీఎస్ అధికారిపై దాడి చేసి నగలు, నగదు దోచుకుపోయిన తాజా ఘటన ఆందోళనకు గురిచేస్తోంది. జూలైలో చెన్నై వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైల్లో మత్తుమందిచ్చి ప్రయాణికులను దోచుకున్న విషయం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. గత నెల్లో కేరళ ఎక్స్‌ప్రెస్‌లో మత్తుమందిచ్చి ఢిల్లీకి చెందిన దంపతుల వద్ద భారీగా నగలు, నగదును చోరీ చేశారు. చోరీలకు పాల్పడింది ఉత్తరాదికి చెందిన ముఠాలేనని అధికారులు అనుమానిస్తున్నారు. గత గురువారం ఖమ్మం జిల్లా డోర్నకల్ సమీపంలో నాందేద్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైల్లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించి ఏడుగురు మహిళల మెడల్లోని నగలను దోచుకువెళ్లారు. నిత్యం ఎక్కడో చోట రైళ్లలో చోరీలు జరుగుతూనే ఉన్నాయి. గడిచిన రెండు నెలల కాలంలో డివిజన్ పరిధిలోని పోలీస్స్టేషన్లలో 200కు పైగా కేసులు నమోదయ్యాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. గడిచిన మూడేళ్ల గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటే రూ.మూడు కోట్లకు పైగా ప్రయాణికుల సొత్తు దొంగలపాలైంది. అడుగడుగునా భద్రత లోపం.. ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ రైళ్లలో అడుగడుగునా భద్రత లోపం స్పష్టంగా కనిపిస్తోంది. రిజర్వేషన్ బోగీల్లోకి సాధారణ ప్రయాణికులను అనుమతించడం, స్లీపర్ కాస్ల్‌లతో పాటు థర్డ్ ఏసీ కోచ్‌లలోకీ ఇతరులను అనుమతించేస్తున్నారు. ప్రయాణికుల్లా ఎక్కుతున్న దొంగల ముఠాలు వేకువ సమయాల్లో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండగా లగేజీలతో దిగిపోతున్నారు. ఉదాహరణకు సింహపురి ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ నుంచి గూడూరు వెళ్లే సమయంలో చీరాల, ఒంగోలు స్టేషన్లలో సాధారణ ప్రయాణికులంతా స్లీపర్, థర్డ్ ఏసీ కోచ్‌లలోకి ఎక్కేస్తుంటారు. వీరితో పాటు రిజర్వేషన్ కోచ్‌లలో ఎక్కే దొంగల ముఠాలు హస్తలాఘవం చూపించి మధ్యలో దిగిపోతుంటారు. అధికారులు నిఘా వ్యవస్థను పటిష్టం చేయకుంటే ప్రయాణికులకు భద్రత కరువయ్యే పరిస్థితి తప్పదు. -
నల్లమలలో నిఘా నేత్రాలు
పెద్దదోర్నాల : నల్లమల పరిరక్షణకు అటవీశాఖ చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. అటవీశాఖ ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ నల్లమల పరిసరాల్లోని ఫారెస్టు చెక్‌పోస్టుల వద్ద అత్యాధునిక కెమెరాలతో నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రతి వాహనంపై డేగకన్ను వేసేలా చర్యలు చేపట్టింది. దీంతో కొంత కాలం నుంచి ప్రమాదాల సంఖ్యతో పాటు, నేరాల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. చెక్‌పోస్టుల వద్ద ఏర్పాటు చేసిన టోల్గేట్లలో నల్లమలలో ప్రయాణించే వాహనాల నుంచి పర్యావరణ రుసుం వసూలు చేస్తుండటంతో పాటు అటవీశాఖకు ఏటా రూ.18 లక్షలకుపైగా అదనపు ఆదాయం సమకూరుతోంది. ఈ నిధులతో నల్లమలలో ప్రయాణికులు జారవిడిచే ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి ప్లాస్టిక్ ఫ్రీజోన్‌గా తీర్చిదిద్దేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ప్రత్యేకంగా 32 మంది కాంట్రాక్ట్ సిబ్బందిని ఏర్పాటు చేసి తద్వారా నల్లమల్లలో ప్రయాణించే వారు జారవిడిచే ప్టాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే అటవీ ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకునేందుకు ఆధునిక టెక్నాలజీతో కూడిన వాకీటాకీలను ఉపయోగిస్తున్నారు. నిఘా కెమెరాలు, టోల్ గేట్ల ఏర్పాటుతో ఉపయోగాలు ఎన్నో... అటవీ సంపద అక్రమ తరలింపు అరికట్టేందుకు పెద్దదోర్నాల సమీపంలోని గణపతి చెక్‌పోస్టు వద్ద నిఘా కెమెరాలను ఏర్పాటు చేశారు. నల్లమలలో హాయిగా విహరించే జంతువులు రోడ్లపై తిరుగుతూ తరుచూ ప్రమాదాలకు గురై మృత్యువాత పడుతున్న నేపథ్యంలో నల్లమల అటవీప్రాంతంలో ప్రయాణించే వాహనాల వేగనియంత్రణ, ఈ నిఘా వ్యవస్థ ఏర్పాటుతో మంచి ఫలితాలు వస్తున్నాయి. నల్లమలలో ప్రయాణించే వాహనాలు ఏ సమయంలో చెక్‌పోస్టుల వద్దకు వచ్చాయి. ఎంత సమయం అటవీప్రాంతంలో ప్రయాణించి అవతలి చెక్‌పోస్టులను దాటాయి. ఇలా వివరాలన్నీ కంప్యూటర్లు, నిఘా కెమెరాలలో రికార్డు అవుతుండటంతో కేసులు చేధించటం సులభతరంగా మారింది. దీని వల్ల అటవీ ప్రాంతంలో సంచరించే వన్య ప్రాణులకు ప్రమాదం కలిగించే వాహనాలను గుర్తించి వాటిపై కేసులు నమోదు చేయటం, నల్లమలలో జరిగే అక్రమ రవాణా, వన్యప్రాణుల ప్రాణాలను బలిగొనే వాహనాల గుర్తింపుతో పాటు, పోలీసు శాఖకు సంబంధించి ఎన్నో నేరాలు, నేరపూరిత వ్యక్తుల కదలికల గుర్తింపు, ప్రమాదాలకు కారణమైన వాహనాల గుర్తింపు సైతం సులభతరంగా మారింది, చెక్ పోస్టుల వద్ద కంప్యూటర్ ఎన్క్లోజర్లతోపాటు టోల్గేట్, ఎలక్ట్రానిక్ గేటు ఏర్పాటు చేశారు. నల్లమలలోని ముఖ్య ప్రాంతాల్లో ట్రాప్డ్ కెమెరాలను ఏర్పాటు చేసి వన్యప్రాణుల కదలికలతో పాటు ఇతరుల సంచారాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. -
నెల్లూరులో నేరగాళ్ల జాడలు
నిఘా డొల్ల.. రక్షణ చర్యలూ శూన్యం లాడ్జిల్లో అసాంఘికశక్తుల పాగా నెల్లూరు శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. అంతే వేగంగా నేర సంస్కృతి సైతం విస్తరిస్తోంది. రాష్ట్రంతో పాటు దేశంలో ఎక్కడ ఏం జరిగినా దాని మూలాలు జిల్లాలోనే ఉన్నట్లు అనేక సంఘటనల్లో వెలుగుచూస్తున్నాయి. ప్రశాంతతకు మారుపేరైన జిల్లాను మకాంగా చేసుకుని నేరగాళ్లు ఇతర ప్రాంతాల్లో పంజా విసురుతున్నారు. ఇంత జరుగుతున్నా నిఘా వ్యవస్థ మాత్రం నిర్లిప్తంగా వ్యవహరిస్తోంది. అసాంఘిక శక్తులకు కళ్లెం వేయాల్సిన కౌంటర్ ఇంటెలిజన్స్, ఆక్టోపస్, స్పెషల్‌బ్రాంచ్ విభాగాలు నామమాత్రంగా పని చేస్తున్నాయని సంచలన సంఘటనలు తేటతెల్లం చేస్తున్నాయి. జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంతో ఉపాధి నిమిత్తం ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు తరలి వస్తున్నారు. వారి ముసుగులో ఉగ్రవాదులు, అసాంఘిక శక్తులు జిల్లాకు తరలివచ్చి ఇక్కడే మకాం వేసి నేరాలకు పాల్పడుతున్నారు. నెల్లూరు (క్రైమ్) : జిల్లా వేగంగా అభివృద్ధి చెందుతోంది. అందుకు దీటు గా రక్షణ చర్యలు చేపట్టలేదన్న విమర్శలున్నాయి. నిఘా నిస్తేజంగా మారింది. నిఘా వ్యవస్థను పటిష్టం చేయడం లో అధికారుల విఫలమవుతున్నారన్న విమర్శలున్నాయి. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేని దుస్థితిలో నగరం ఉంది. ఇక షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, హోటల్స్, లాడ్జిల విషయం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. రక్షణ వ్యవస్థ ఆర్టీసీ బస్టాండ్లలో కనీసం జేబు దొంగలను కట్టడి చేసే పరిస్థితిలో కూడా లేదు. ఇక రైల్వేస్టేషన్లో పని చేయని మెటల్ డిటెక్టర్లను మూలనపడేశారు. రైలుమార్గాల ద్వారా బంగారు, వెండి ఆభరణాలు, గంజా యి అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. వీటిని నిలువరించడంలో రైల్వే భద్రతా వ్యవస్థ విఫలమైయ్యారన్న విమర్శలున్నాయి. లాడ్జిల్లో అసాంఘిక శక్తుల మకాం లాడ్జిలపై పోలీసు నిఘా కొరవడింది. దీంతో అసాంఘిక శక్తులు తిష్టవేసి తమ కార్యకలాపాలను నెరుపుతున్నారన్న విమర్శలున్నాయి. పేకాట, వ్యభిచారం, బెట్టింగ్‌లు లాడ్జిల్లో జోరుగా సాగుతున్నాయి. నేరం జరిగిన వెంటనే పోలీసులు శివారు ప్రాంతాల్లో, నగరంలో అప్రమత్తమై తనిఖీలు చేస్తున్నారు తప్పితే లాడ్జిలను పట్టించుకోవడం లేదు. దీంతో నేరాలకు పాల్పడి దర్జాగా లాడ్జిల్లో తలదాచుకుంటున్నారు. గతంలో నగరానికి చెందిన ఓ యువకుడు ఇతర ప్రాంతాల నుంచి నేరగాళ్లను తీసుకువచ్చి లాడ్జిలో ఉంచి నేరాలకు పాల్పడ్డారు. నెల రోజుల పాటు వారు నేరాలు చేస్తూ నగర ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసినా గుర్తించలేని పరిస్థితి నెలకొంది. అసాంఘికశక్తులు టూరిస్టులు, పరిశ్రమల్లో పనులకొచ్చామని లాడ్జిలో దిగి నేరాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రతి లాడ్జిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం లేదు. లాడ్జిలో అద్దెకు దిగేవారి ఆధార్‌కార్డు, పాన్‌కార్డ్, రేషన్‌కార్డు, ఓటర్‌కార్డు తదితరాల్లో ఏదో ఒక గుర్తింపు కార్డు చూపితేనే గదులు ఇవ్వాల్సి ఉంది. ఇది ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. దీంతో లాడ్జిల్లో ఎవరు దిగుతున్నారన్న విషయం ఎవరికి తెలియడంలేదు. గతంలో లాడ్జిల్లో ఎవరైనా వ్యక్తులు దిగితే వారి పూర్తి బయోడేటా తదితరాలను ఆయా ప్రాంత పోలీసుస్టేషన్‌కు ప్రతి రోజు లాడ్జి సిబ్బంది అప్పగించేవారు. కాలక్రమేణా ఆ ప్రక్రియ ఆగిపోయింది. లాడ్జిల యాజమాన్యాలతో పరిచయాల వల్ల వాటిపై పోలీసులు కనీస దృష్టి సారించడంలేదన్న విమర్శలున్నాయి. దీంతో నేరగాళ్లు లాడ్జిలో మకాంవేసి దర్జాగా చోరీలు, దోపిడీలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. నేరం జరిగిన సమయంలో హడావుడి చేయడం కన్నా.. ప్రతి రోజు శివారు ప్రాంతాలతో పాటు లాడ్జిలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని స్థానికులు వాపోతున్నారు. -
నిఘా కళ్లకు కలక!
ఏరియా, సామాజిక ఆస్పత్రుల్లో పనిచేయని స్కైపీ వ్యవస్థ రెండేళ్ల క్రితం 11 ఆస్పత్రుల్లో ఈ వ్యవస్థ ప్రారంభం జిల్లాకేంద్రం నుంచే ఆస్పత్రుల పనితీరు పరిశీలనకు అవకాశం సత్ఫలితాలివ్వడంతో పీహెచ్‌సీలకు విస్తరింపచేసేందుకు సన్నాహాలు ఈలోగానే నిఘా వ్యవస్థను ఆవరించిన నిర్లక్ష్యపు మత్తు కొన్నాళ్లుగా మూలకు చేరిన విలువైన పరికరాలు ప్రత్యక్ష పర్యవేక్షణ లోపించి.. ఆస్పత్రుల సేవలు యథాస్థితికి ప్రభుత్వ ఆస్పత్రులకు నిత్యం రోగులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. వారందరికీ తక్షణ వైద్యం అందజేయాల్సిన బాధ్యత వైద్యులు, వైద్య సిబ్బందిదే. అయితే అన్ని ప్రభుత్వ శాఖల మాదిరిగానే ఇక్కడా నిర్లక్ష్యం, అవినీతి పాతుకుపోవడంతో పేద రోగులకు సర్కారీ వైద్యం గగన కుసుమంగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. వీటిని చెరిపేసేందుకు రెండేళ్ల క్రితం ఏర్పాటు చేసిన స్కైపీ అనే నిఘా వ్యవస్థ కూడా దాదాపు కనుమరుగైంది. జిల్లావ్యాప్తంగా ఉన్న ఏరియా, సామాజిక ఆస్పత్రుల్లో జరుగుతున్న వ్యవహారాలను ఒకేచోట కూర్చొని టీవీ తెరపై వీక్షించడంతోపాటు.. అవసరమైతే డాక్టర్లు, రోగులతో మాట్లాడే అవకాశం ఉన్న ఈ అధునాతన నిఘా కళ్లకు నిర్లక్ష్యం అనే కలక సోకింది. ఫలితంగా వ్యవస్థ మసకబారింది. ఆస్పత్రుల తీరు యథాస్థితికి చేరుతోంది. పాలకొండ రూరల్: ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరును నేరుగా పరిశీలించి ఎప్పటికప్పుడు సూచనలు అందించేందుకు రెండేళ్ల క్రితం జిల్లాలో ఏర్పాటు చేసిన స్కైపీ వ్యవస్థ(నిఘా) దాదాపు మూలకు చేరింది. ఈ వ్యవస్థను ఏర్పాటు చేసిన ఏ ఒక్క ఆస్పత్రిలోనూ ప్రస్తుతం ఇది అందుబాటులో లేదు. అప్పట్లో జిల్లాలోని రెండు ప్రాంతీయ ఆస్పత్రులు, 9 సామాజిక ఆస్పత్రులను జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త(డీసీహెచ్ఎస్)తోపాటు కలెక్టర్ కార్యాలయానికి అనుసంధానం చేస్తూ ఆస్పత్రుల పనితీరు, రోగులకు అందుతున్న సేవలను నేరుగా పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన విలువైన కంప్యూటర్లు, వెబ్ కెమెరాలు ఇతర సాంకేతిక పరికరాలు నిరుపయోగమయ్యాయి. రోగులకు మెరుగైన సేవలే లక్ష్యంగా.. ఆస్పత్రుల పనితీరు మెరుగు పరిచి, రోగులకు ఉన్నత సేవలు అందించడమే స్కైపీ వ్యవస్థ ఏర్పాటు లక్ష్యం. 2012లో డీసీహెచ్ఎస్గా ఉన్న సి.సుధాకర్ దీన్ని ఏర్పాటుకు చొరవ తీసుకున్నారు. పలు జిల్లాల్లో అప్పటికే అమల్లో ఉన్న ఈ విధానానికి శ్రీకాకుళం జిల్లాలో కూడా శ్రీకారం చుట్టారు. దీనిపై కరీంనగర్లో శిక్షణ పొందిన ఆయన తొలుత వైద్యవిధాన పరిషత్ ఆధ్వర్యంలో నడుస్తున్న పాలకొండ, టెక్కలి ఏరియా ఆస్పత్రులతో పాటు సోంపేట, బారువ, పాతపట్నం, పలాస, కోటబొమ్మాళి, నరసన్నపేట, రాజాం, రణస్థలం, ఇచ్ఛాపురం సామాజిక ఆస్పత్రుల్లో మొదలు పెట్టారు. ఇందుకోసం నెలరోజుల వ్యవధిలో కంప్యూటర్లు, వెబ్ కెమెరాలు ఏర్పాటు చేయించారు. వాటిని డీసీహెచ్ఎస్ కార్యాలయంతో అనుసంధానం చేశారు. ఈ వ్యవస్థ ద్వారా జిల్లా కేంద్రం నుంచే ప్రతిరోజు అన్ని ఆస్పత్రుల పనితీరును పరిశీలించడ ం.. అవసరమైతే అప్పటికప్పుడు అక్క డ వైద్యులతో నేరుగా మాట్లాడి ఆరా తీయడం, రోగులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడం వంటి చర్యలు సత్ఫలితాలిచ్చాయి. ఆస్పత్రుల్లో వైద్యసేవలు మెరగయ్యాయి. తగ్గిన అక్రమాలు ఆడియో, వీడియో విజువల్స్ ద్వారా నేరుగా జిల్లా కేంద్రం నుంచి ఆయా ఆస్పత్రుల రోగుల నుంచి సమాచారం తీసుకునే అవకాశం ఉండడంతో అక్రమాలకు చాలావరకు అడ్డుకట్ట పడింది. రోగుల నుంచి, ప్రసవాలకు వచ్చే గర్భిణుల నుంచి డబ్బులు దండుకునే సిబ్బంది చేతివాటానికి ఈ విధానం చెక్ పెట్టగలిగింది. ఏ సమయంలోనైనా కలెక్టర్ స్థాయి నుంచి ఉన్నతాధికారులు స్కైపీ వ్యవస్థ ద్వారా నేరుగా రోగులతో మాట్లాడే అవకాశం ఉందన్న భయం అటు వైద్యులు, ఇటు వైద్య సిబ్బందిలోనూ ఉండేది. సమస్యలుంటే ఫిర్యాదు చేసేందుకు టోల్‌ఫ్రీ నెంబర్లు కూడా అందుబాటులోకి తెచ్చారు. ఫలితంగా సేవల నాణ్యత పెరిగింది. ఫిర్యాదులు కూడా క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఈ విధానం సత్ఫలితాలనివ్వడంతో జిల్లాలో ఉన్న పీహెచ్‌సీలకు సైతం స్కైపీ నిఘాను విస్తరించాలని ఉన్నతాధికారులు భావించినా.. కొన్నాళ్లకే ఉన్న వ్యవస్థే పని చేయడం మానేయడంతో ఆ ప్రతిపాదన కూడా పెండింగులో పడింది. ప్రస్తుతానికి పని చేయడం లేదు.. అంతే! ఇన్ని మంచి ఫలితాలనిచ్చిన ఈ విధానం ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఎక్కడా పనిచేస్తున్న దాఖలాలు లేవని వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందే చెబుతున్నారు. కారణమేమిటని అడిగితే.. సాంకేతిక సమస్యలు చెబుతూ ప్రస్తుతానికి పని చేయడం లేదు.. అని మాత్రమే చెబుతున్నారు. ఇదే విషయమై పాలకొండ ఏరియా ఆస్పత్రిలో ఆరా తీయగా కొన్నాళ్లుగా స్కైపీ వాడడం లేదని మాత్రమే సమాధానమిచ్చారు. ఒక కంప్యూటర్ వద్ద కూర్చొని జిల్లాలో ఉన్న అన్ని ఆస్పత్రుల నిర్వహణ తీరును పరిశీలించే అవకాశాన్ని వదులుకుని వే లకు వేలు ఖర్చు చేసి జిల్లా వ్యాప్తంగా వందల కిలోమీటర్లు ప్రయాణించి ఆస్పత్రులను పరిశీలించడం ఎంతో కష్టసాధ్యం. సమస్య ఉత్పన్నమైనప్పుడు క్షేత్ర స్థాయి నుంచి ఫిర్యాదు చేసుకునే అవకాశం కూడా ప్రస్తుతం లేకపోయింది. నిఘా కొరవడడంతో ఆస్పత్రుల్లో సిబ్బంది ఆడిందే ఆటగా పాడిందే సాగుతోంది. ఇటీవల జిల్లాలో పలు ఆస్పత్రులను పరిశీలించిన డీసీహెచ్ఎస్ కూడా సిబ్బంది పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడం ఇందుకు నిదర్శం. సాంకేతిక సమస్యలను అధిగమిస్తాం స్కైపీ విధానం అన్ని ప్రాంతాల్లో అమల్లోనే ఉంది. అయితే సాంకేతిక లోపాల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాటిని అధిగమించి సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకువస్తాం. ఇకపై స్కైపీ ద్వారా ఆస్పత్రుల పనితీరును పర్యవేక్షించేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడంతోఆపటు పీహెచ్‌సీల కు కూడా ఈ విధానాన్ని విస్తరింపజేసేందుకు ఉన్నతాధికారులకు నివేదిస్తాం. -ఎం.సునీల, జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త(డీసీహెచ్ఎస్) -
ఆమె కోసం... ఓ రక్షణ వలయం - స్వాతీ లక్రా
సమాజంలో ధైర్యంగా జీవించే భరోసాను మహిళలకు ఇవ్వాలి. ఆకతాయిల ఆటలు ఇక సాగవనే నమ్మకం కలిగించాలి. తమ కోసం ఓ నిఘా వ్యవస్థ అండగా ఉందనే అవగాహన తేవాలి. అప్పుడే చక్కటి సమాజం ఆవిష్కృతమవుతుంది... అంటారు స్వాతీ లక్రా. హైదరాబాద్ అడిషనల్ పోలీస్ కమిషనరైన ఆమె ఆకతాయిల నుంచి ఆడవాళ్ళ రక్షణ కోసం రూపొందించిన ‘షీ బృందం’ బాధ్యతలు మోస్త్తున్నారు. సమర్థంగా అమలైతే, సమాజంలో మార్పు తెచ్చే ఈ వినూత్న ప్రయత్నం గురించి ప్రత్యేక కథనం... జార్ఖండ్ రాష్ట్రం, రాంచీలో పుట్టి పెరిగిన స్వాతీ లక్రాతో కొద్దిసేపు మాట్లాడితే సమాజంలో మహిళలు ఎన్ని రకాలుగా టీజింగ్‌కు గురవుతున్నారనే విషయంలో ఆమెకున్న అవగాహన తెలుస్తుంది. మహిళలను ఆదుకోవడానికి నాలుగు సింహాల పోలీస్ ఎప్పుడూ అందుబాటులో ఉండాలనే ఆమె అభిలాషలో అంకితభావం కనిపిస్తుంది. ఆలోచనకు మూలం ఇదీ! ‘‘మహిళల రక్షణ కోసం ప్రభుత్వం సెక్యూరిటీ కమిటీలను నియమించింది. ఆ సందర్భంగా మహిళల భద్రత కోసం ప్రభుత్వానికి అనేక ప్రతిపాదనలు చేశాం. వాటిలో షీ టీమ్ కూడా ఒకటి. మహిళల రక్షణ కోసం ఓ నిఘా బృందాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనకు అన్ని వైపుల నుంచి సానుకూలమైన స్పందన వచ్చింది. ఇక బృందాన్ని నిర్వహించే బాధ్యత నాకప్పగించారు. రెండు వారాలుగా మా షీ బృందాలు నగరంలో పనిచేస్తున్నాయి. ఒక్క ముక్కలో ఇది ‘ఆమె’ కోసం ఓ రక్షణవలయం’’ అని చెప్పుకొచ్చారు హైదరాబాద్ ఎసిపి స్వాతీ లక్రా. తప్పించుకొనే వీలు లేకుండా... రికార్డు! కాలేజ్కెళ్తూ బస్టాపులో వేధింపుకు గురయిన అమ్మాయి సమస్య బస్ ఎక్కి వెళ్లిపోవడంతో అంతమైపోదు. ఆ రోజంతా అది ఆమె మనసును తొలుస్తూనే ఉంటుంది. ఒక్క ఆకతాయి చేష్ట... క్లాసులో పాఠం మీద దృష్టి పెట్టలేనంతగా ఆమె మనసును కలచి వేస్తుంది. అదే ఉద్యోగిని అయితే... ఆ రోజు పని చేయలేకపోవచ్చు. పైగా సున్నిత మనస్కులయితే మానసికంగా కుంగిపోతారు. ధైర్యాన్ని కోల్పోతారు. ఇవన్నీ కలిసి వారిలో ఉన్న సహజమైన నైపుణ్యాలను మరుగున పడేస్తాయి. మానసికంగా అభద్రత కలిగితే మహిళాశక్తి నిర్వీర్యమవుతుంది. మహిళలో పోరాడే సత్తా అంతరించిపోతుంది. వీటన్నింటి నుంచి మహిళను రక్షించే ప్రయత్నమే ఈ షీ బృందం. ‘‘మహిళలు ఇంట్లో ఉన్నంత ధైర్యంగా సమాజంలో సంచరించగలగాలి. ఇంటి నుంచి బయటకు రావడానికి బెంబేలు పడే పరిస్థితులు మారాలి. ధైర్యంగా కాలేజ్కెళ్లగలగాలి, ఆఫీసుకెళ్లగలగాలి. గృహిణి ఒంటరిగా మార్కెట్కెళ్లగలిగిన భరోసా కలిగించడమే మా బాధ్యత. ఆకతాయి చేష్టలను మా బృందం కెమెరాల్లో రికార్డు చేస్తారు కాబట్టి వాళ్లు తప్పించుకోవడానికి అవకాశం ఉండదు’’ అంటారీ ఐ.పి.ఎస్. అధికారిణి. భరోసా కల్పించే వంద బృందాలు.. ఇంటి నుంచి బయటికొచ్చిన మహిళలు ఎన్ని వేధింపులను ఎదుర్కొంటున్నప్పటికీ నోరెత్తి చెప్పడానికి సందేహిస్తూనే ఉన్నారు. ఆ భయాన్ని తొలగించడం, ఫిర్యాదు చేయగలిగిన ధైర్యాన్ని నింపడమే షీ బృందం ప్రధాన విధి అంటున్నారీ ఎసిపి. ‘‘కాలేజ్‌లకెళ్లి వాళ్ళలో చైతన్యం కలిగించేలా సమావేశాలు పెడతాం. మహిళాసంఘాలు, స్వచ్ఛందసంస్థలు, కాలనీ వాసులు కోరుకుంటే మా ప్రతినిధులు వెళ్లి ప్రసంగిస్తారు. 100 నంబర్‌కి డయల్ చేయమని పదే పదే తెలియచేస్తూ డయల్ చేయగలిగిన ధైర్యాన్ని కల్పిస్తాం. పోలీసులకు చెప్పడం ద్వారా సమస్యకు ముగింపు పలకవచ్చనీ, పోలీసులకు చెప్పడం వల్ల ఇతర సమస్యలేవీ రావనే భరోసా కల్పిస్తాం. అందుకోసం జంటనగరాల్లో వంద బృందాలు పనిచేస్తున్నాయి. అవి బస్సుల్లోనూ ప్రయాణిస్తాయి’’ అని వివరించారు స్వాతి. పిల్లలకు నైతిక విలువలు నేర్పాలి! ‘‘పిల్లలు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని త్వరగా గ్రహిస్తారు. దానిని ఎలా వినియోగిస్తున్నారనే దాని మీదనే భవిష్యత్తు ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లలకు నైతిక విలువలను నేర్పించడంతోపాటు వారి కార్యకలాపాలను గమనిస్తుండాలి’’ అంటారు స్వాతీ లక్రా. ఖాళీ సమయాన్ని భర్త, ఇద్దరు పాపలతో గడపడమే తన హాబీ అని చెబుతారీ ఉన్నతాధికారిణి. అన్నట్లు ఆమె భర్త కూడా ప్రభుత్వంలో ఉన్నతాధికారే. ఐఎఎస్ అధికారి అయిన బిఎమ్డి ఎక్కా ఆమె భర్త. హౌసింగ్ బోర్డు కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఇద్దరూ 1995 బ్యాచ్ విద్యార్థులమని చెబుతూ ముస్సోరీలో శిక్షణ సమయంలో పరిచయమైనట్లు చెప్పారు. ఆశయం, ఆచరణ కలగలిస్తే, అభ్యుదయ సమాజం వైపు పయనం అసాధ్యమేమీ కాదనడానికి స్వాతి సారథ్యంలోని తాజా ప్రయత్నం ‘షీ’ ఒక ఉదాహరణ. - వాకా మంజులారెడ్డి ‘షీ బృందం’ ఏం చేస్తుందంటే... కాలేజ్, బస్టాపు, రైల్వేస్టేషన్, మార్కెట్లలో సంచరిస్తూ నేరస్థులను గుర్తించి అరెస్టు చేస్తారు. ఒక్కో బృందంలో ఐదుమంది వరకు ఉంటారు. ప్రతి బృందంలో విధిగా (సాధారణ పోలీస్ నుంచి అధికారి వరకు) ఓ మహిళ ఉంటుంది. టీనేజ్ పిల్లలు అదీ తొలిసారి అరెస్టయిన వారయితే... పెట్టీ కేసు పెట్టి గట్టిగా మందలిస్తారు. కరడుగట్టిన నేరగాళ్లయితే సెక్షన్ 354, నిర్భయ వంటి తీవ్రమైన కేసులు నమోదవుతాయి. మహిళ పేరు బయటకు రానివ్వకుండా కేసు విచారణ చేస్తారు. మహిళలు ఏం చేయాలంటే..! మగవాళ్లు మాటలతో కానీ, చేష్టలతో కానీ ఏడిపిస్తే 100 నంబరుకు ఫోన్ చేసి తామున్న ప్రదేశాన్ని తెలియచేయాలి. 100కి డయల్ చేసి వివరాలు చెప్తే ఆ సమాచారం ‘షీ బృందా’నికి చేరుతుంది.కాలేజ్ అమ్మాయిలు కానీ, ఉద్యోగినులు కానీ బస్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో రోజూ ఆకతాయిలు వస్తున్నట్లయితే - సమయంతో సహా ప్రదేశాన్ని తెలియచేయాలి. మరుసటి రోజు ఆ సమయానికి అక్కడికి ‘షీ బృందం’ వస్తుంది. ఆకతాయి మగవారికిదో హెచ్చరిక! షీ బృందాలు నగరంలో విస్తృతంగా నిఘా పెడుతున్న విషయం మహిళలో సమాజంలో ధైర్యంగా జీవించవచ్చనే భరోసాను కల్పిస్తుంది. అదే సమయంలో ఆకతాయి మగవారికి హెచ్చరిక జారీ అవుతుంది. స్త్రీలతో గౌరవప్రదంగా వ్యవహరించకపోతే చిక్కుల్లో పడక తప్పదనే భయం వారిలో సత్ప్రవర్తనను తీసుకువస్తుంది. ఇలా షీ బృందాల వల్ల రెండు రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. - స్వాతీ లక్రా, అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్, హైదరాబాద్ -
అధికార తొత్తులు !
► తెలుగుదేశం నేతల కనుసన్నల్లో ఖాకీలు ► పచ్చని పల్లెల్లో ప్రశాంతతకు చిచ్చుపెడుతున్న వైనాలు ► టీడీపీ నాయకులు దాడులకు దిగుతున్నా పట్టించుకోని పోలీసులు ► గుంటూరు నగరంలోనూ అదుపుతప్పిన శాంతిభద్రతలు పది రోజుల్లో నాలుగు హత్యలు.. సాక్షి, గుంటూరు: జిల్లాలో పోలీస్ శాఖ నిద్రావస్థలో ఉందా.. అవుననే అంటున్నారు అధికశాతం మంది ప్రజలు. ఎన్నికల్లో సమర్థంగా పనిచేసిన జిల్లా పోలీసులు కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి టీడీపీ నేతల కనుసన్నల్లో పనిచేయడం ప్రారంభించారు. వారికి అనుకూలంగా పని చేసి మంచి పోస్టు కొట్టేయాలన్న తలంపుతో గ్రామాల్లో గొడవలు జరుగుతున్నా నిరోధించకుండా అగ్గి రాజేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శాంతిభద్రతలపై దృష్టి సారించకుండా పోస్టింగ్‌ల కోసం టీడీపీ నేతల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ►గ్రామాల్లో టీడీపీ నాయకులు దాడులు చేస్తున్నప్పటికీ పోలీసులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. తూతూ మంత్రంగా కేసులు నమోదు చేయడంతో పోలీసులంటే భయం లేకుండా వ్యవహరిస్తున్నారు. ►పదేళ్లుగా ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా ప్రశాంతంగా బతుకుతున్న గ్రామాల్లో సైతం ఆధిపత్యం కోసం టీడీపీ నేతలు గొడవలకు దిగుతున్నారు. ►వీటిపై పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో తమను తాము రక్షించుకునే క్రమంలో ఎదుటి వర్గం కూడా గొడవలకు దిగక తప్పడం లేదు. ►ఎప్పుడు ఏం జరుగుతుందోనని గ్రామస్తులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ►పరిస్థితిని చక్కదిద్దాల్సిన పోలీసులే ఓ వర్గానికి కొమ్ముకాస్తూ పచ్చని పల్లెల్లో చిచ్చు పెడుతున్నారని ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. ►ఇప్పటికైనా పోలీసులు నిద్రమేల్కొని కఠినంగా వ్యవహరించకపోతే జిల్లాలో శాంతి భద్రతలు అదుపుతప్పే ప్రమాదం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు. హత్యలు, దాడులతో అట్టుడుకుతున్న జిల్లా.. ►పోలీసుల నిర్లక్ష్యం వల్ల శాంతి భద్రతలు అదుపుతప్పి వరస హత్యలు, దాడులతో జిల్లా అట్టుడికిపోతోంది. ►పదిరోజుల వ్యవధిలో గుంటూరులో వరసగా నాలుగు హత్యలు జరిగాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ►గుంటూరు నగరంలో ఆరు పోలీస్స్టేషన్లు ఉండగా అందులో మూడు స్టేషన్లకు ఎస్హెచ్ఓలు లేరు. జిల్లాలో అనేక ప్రాంతాల్లో తమకు నచ్చని అధికారులను వెళ్లిపొమ్మని అధికార పార్టీ నేతలు హుకుం జారీ చేయడంతో కొందరు సిక్ లీవ్‌పై వెళ్లారు. ►రూరల్‌జిల్లాలో టీడీపీ నేతల వరస దాడులతో గ్రామాల్లో నిత్యం ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. ►ఇటీవల ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నిక సందర్భంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, నాయకులపై దాడిచేసి ఎంపీటీసీలను కిడ్నాప్ చేసినప్పటికీ ఇంత వరకూ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై వైఎస్సార్సీపీ నాయకులు మండిపడుతున్నారు. ►గొడవలను నిరోధించాల్సిన పోలీసులే వారికి సహకరిస్తూ అగ్నికి ఆజ్యం పోస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిద్దరోతున్న నిఘా వ్యవస్థ.. గ్రామాలు, నగరంలో శాంతి భద్రతలపై నిఘా ఉంచాల్సిన పోలీసులు నిద్రావస్థలో ఉండటంతో వరస సంఘటనలు జరుగుతున్నాయి. ఫ్యాక్షనిస్టులు, రౌడీషీటర్లపై నిత్యం నిఘా ఉంచి వారికి కౌన్సెలింగ్ నిర్వహించాల్సిన పోలీసులు అసలు వారి సంగతే మర్చి పోవడంతో కిరాయి హత్యలు జరుగుతున్నాయి. -
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచుతా
అరాచక శక్తులపై ఉక్కుపాదం నేరాల అదుపులో ప్రజల భాగస్వామ్యం నగర పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన మహేందర్ రెడ్డి సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌గా ఎం.మహేందర్‌రెడ్డి సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు నగర సీపీగా పనిచేసిన, ప్రస్తుత డీజీపీ అనురాగ్‌శర్మ తన చేతుల మీదుగా బషీర్‌బాగ్‌లోని కమిషనర్ కార్యాలయంలో మధ్యాహ్నం మూడు గంటలకు మహేందర్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. అనంతరం మహేందర్‌రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచేలా పనిచేస్తామన్నారు. నగరంలో శాంతిభద్రతల అమలు, నేరాల నివారణతో పాటు నిందితులకు శిక్షలు పడేలా చేయటంలోనూ ప్రజలను భాగస్వాములను చేస్తామన్నారు. బాధితుడు నిర్భయంగా ఠాణాకు వచ్చి ఫిర్యాదు చేసే పరిస్థితిని కల్పిస్తామన్నారు. నిజాయితీగా పనిచేసే ప్రతి పోలీసు అధికారికి పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఇక నగరంలోని అన్ని కూడళ్లలో సర్వేలెన్స్ కెమెరాల ఏర్పాటు ద్వారా నిఘా వ్యవస్థను పటిష్టపరిచి, ప్రపంచంలోనే ఉత్తమ నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. అరాచక, అసాంఘిక శక్తులపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. సమాచార వ్యవస్థ బలోపేతం, ట్రాఫిక్ మేనేజ్మెంట్, సిబ్బంది కొరత వంటి విషయాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లామన్నారు. కేసుల విషయంలో ఎవరితో రాజీపడకుండా బాధితులకు సంపూర్ణ న్యాయం చేసేలా పనిచేస్తామన్నారు. దేశంలో ఉగ్రవాద దాడులు ఎక్కడ జరిగినా దాని మూలాలు హైదరాబాద్‌లోనే ఉన్నాయనడం సరికాదన్నారు. సైబరాబాద్‌ను నగర కమిషనరేట్‌లో విలీనం చేసే ప్రతిపాదనేదీ ప్రస్తుతానికి లేదన్నారు. కాగా, ఇప్పటివరకు ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసిన ఆయన దాదాపు ఐదేళ్ల తరువాత సోమవారం పోలీసు యూనిఫామ్‌లో కనిపించారు. నూతనంగా బాధ్యతలు చే పట్టిన ఆయనను నగర అదనపు పోలీసు కమిషనర్లు జితేందర్, సందీప్‌శాండిల్య, జాయింట్ పోలీసు కమిషనర్లు సంజయ్‌కుమార్‌జైన్, మల్లారెడ్డి, అబ్రహంలింకన్, శివప్రసాద్, డీసీపీలు కమలాసన్‌రెడ్డి, జయలక్ష్మి, సత్యనారాయణ, త్రిపాఠి, షానవాజ్ ఖాసిం, సుధీర్‌బాబు, శ్యాంసుందర్, టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీలు కోటిరెడ్డి, లింబారెడ్డి కలిసి అభినందించారు. రెండు ప్రభుత్వాలకు భద్రత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు రెండూ నగరంలోనే ఉండడం, దీనికి తోడు వాటి ప్రధాన కార్యాలయాలు సైతం ఇక్కడే ఉండడంతో అందరికీ భద్రత కల్పించేందుకు త్వరలో నియమ నిబంధనలు తయారు చేస్తామని నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. రెండు ప్రభుత్వాల ప్రజాప్రతినిధులు, ప్రముఖులకు పూర్తి భద్రత కల్పిస్తామన్నారు. తమ ముందు చాలా సవాళ్లున్నా.. అధిగమిస్తామన్న ధీమాను ఆయన వ్యక్తపరిచారు.