విశాఖపట్నం, అజ్మీర్, అలహాబాద్‌లను స్మార్ట్‌సిటీలుగా అభివృద్ధిచేయడం కోసం కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు మూడు టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేశారు.
న్యూఢిల్లీ: విశాఖపట్నం, అజ్మీర్, అలహాబాద్‌లను స్మార్ట్‌సిటీలుగా అభివృద్ధిచేయడం కోసం కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు మూడు టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేశారు. ఇవి ఈ మూడు నగరాల అభివృద్ధి ప్రణాళికలను రూపొందిస్తాయి. పట్టణాభివృద్ధి, విదేశాంగశాఖలతోపాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు బీటిలో సభ్యులుగా ఉంటారు. వీరేకాక అమెరికా వాణిజ్య అభివృద్ధి మండలి సభ్యులూ ఉంటారు. ఇటీవల మంత్రి వెంకయ్య, అమెరికా వాణిజ్యశాఖ మంత్రి పెన్నీ ప్రిజ్‌కర్ మధ్య జరిగిన భేటీలో అవగాహన ఒప్పందం కుదరడంతో టాస్క్‌ఫోర్స్‌ల ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారు. ఈ మూడు నగరాల అభివృద్ధిలో అమెరికా సహకారం అందిస్తుంది.