'బాంబే' బదులు 'బాంబ్' అని వాట్సాప్..
స్నేహితుడికి వాట్సాప్ ద్వారా 'బాంబే' బదులు 'బాంబ్' అని టైప్ చేసి పంపిన ఆరుగురు ముస్లిం విద్యార్థులను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన యాంటీ టెర్రరిజమ్ స్క్వాడ్(ఏటీఎస్) బృందం వారిని మంగళవారం విడిచిపెట్టారు.
కేరళ నుంచి నెల రోజుల ఉర్దూ కోర్సు కోసం ముంబై వచ్చిన ఆరుగురు స్నేహితులు వేరే స్నేహితునికి 'బాంబే'కి బదులు 'బాంబ్' అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టారు. ఇది గుర్తించిన ఛత్రపతి శివాజీ టెర్మినస్ రైల్వే పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకుని ఏటీఎస్ పోలీసులకు అప్పగించారు.
విద్యార్థుల లగేజీని పరిశీలించిన పోలీసులకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభ్యం కాలేదు. ఉర్దూ కోర్సు కొరకు విద్యార్థులు వెళ్తున్న ఇనిస్టిట్యూట్‌లో ఆరా తీయగా ఆరుగురు కోర్సు కోసం వస్తున్నట్లు పోలీసులకు విచారణలో తెలిసింది. దీంతో వారిని వదిలేసినట్లు పోలీసులు తెలిపారు.