
న్యూఢిల్లీ : లడక్‌లోని గాల్వన్ లోయ ప్రాంతంలో చైనా-భారత్ ఆర్మీ మధ్య తలెత్తిన హింసాత్మక ఘటనపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పందించారు. ఈ ఘర్షణలో మృతిచెందిన వీర జవానులకు ఆమె సంతాపం ప్రకటించారు. కాగా ఈనెల 15న భారత్-చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది జవానులు వీర మరణం పొందిన విషయం తెలిసిందే. ఈ హింసాత్మక ఘటనపై కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. (మన సైనికుల్ని చంపడానికి వారికెంత ధైర్యం..?)
చైనాతో జరిగిన పోరులో భారత సైనికులు మృతి చెందడం తనను మనో వేదననకు గురిచేసిందన్నారు. ‘జవానుల మరణం తీవ్ర వేదనకు గురిచేసింది. చాలా బాధను కలిగించింది. వీర జవానుల ధైర్య సాహసాలకు నా జోహార్లు. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. దేశ భద్రతను, సమగ్రతను కాపాడుకోవడంలో కలిసి పోరాడుతాము’ అని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ('వారి త్యాగం మనోవేదనకు గురి చేసింది')