న్యూఢిల్లీ: భారత ఉపఖండానికి వర్ష రుతువును తీసుకొచ్చే నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది రెండు రోజులు ముందుగానే రానున్నాయి. మామూలుగా జూన్ 2వ తేదీన కేరళ తీరాన్ని తాకాల్సిన ఈ రుతుపవనాలు ఈ నెల 30వ తేదీకల్లా అక్కడకు వచ్చేస్తాయని వాతావరణ పరిశోధకులు చెప్తున్నారు.
రానున్న మూడు, నాలుగు రోజుల్లో రుతుపవనాలు అండమాన్ సముద్రంపై విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. అయితే.. గత ఏడాది లాగానే ఈ ఏడాది కూడా ఎల్ నినో ప్రభావంతో సాధారణం కన్నా తక్కువ వర్షాలే కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
30వ తేదీకల్లా కేరళకు నైరుతి రుతుపవనాలు
Published Fri, May 15 2015 2:02 AM | Last Updated on Sun, Sep 3 2017 2:02 AM
Advertisement