
న్యూఢిల్లీ : మనీ ల్యాండరింగ్ కేసులో కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత డీ.కే.శివకుమార్‌కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ పిటిషన్ విచారణను శుక్రవారం చేపట్టిన జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్, ఎస్. రవీంద్రభట్ లతో కూడిన బెంచ్ ఈడీ తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాపై తీవ్రస్థాయిలో విరుచుకుప డింది. కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లలో కాంగ్రెస్ నాయకుడు శివకుమార్‌కు బదులుగా, అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అని పేర్కొనడాన్ని దుయ్యబట్టింది. పి. చిదంబరం కేసుకు సంబంధించిన కోర్టు డాక్యుమెంట్లలో వాదనలను యధాతథంగా శివకుమార్ కేసులో కాపీ పేస్ట్ చేయడమేంటని నిలదీసింది. పౌరులను మీరు గౌరవించే పద్ధతి ఇదేనా అంటూ ప్రశ్నించింది.
చిదంబరానికి సుప్రీంలో నిరాశ
ఐఎన్‌ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసులో కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరానికి బెయిల్ ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఈడీ దాఖలు చేసిన ఈ కేసులో ఆయనపై ఉన్న ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని, అందులో చిదంబరం ప్రమేయం ఉన్నట్టుగా ప్రాథమిక ఆధారాలను బట్టి తెలుస్తోందని పేర్కొంది. చిదంబరానికి బెయిల్ ఇస్తే సమాజానికి తప్పుడు సంకేతాలు వెళతాయని వ్యాఖ్యానించింది.
Comments
Please login to add a commentAdd a comment