
సాక్షి, చెన్నై: తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ భారీగా పెరుగుతుండటంతో నాలుగు జిల్లాల్లో మళ్లీ లాక్‌డౌన్ విధించాలని ముఖ్యమంత్రి పళనిస్వామి నిర్ణయం తీసుకున్నారు. గ్రేటర్ చెన్నై, చెంగల్పట్టు, తిరువల్లూర్, కాంచీపురం జిల్లాల్లో జూన్ 19 నుంచి 30వ తేదీ వరకూ లాక్‌డౌన్ అమల్లో ఉంటుంది. ఈ 12 రోజుల్లో రెండు ఆదివారాలు రానున్నాయి. ఆ రెండు రోజులు పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ అమలు చేస్తారు. ఆటోలు, ట్యాక్సీలు, ప్రైవేట్ వాహనాలను అనుమతించరు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే నిత్యావసరాల కొనుగోలుకు అవకాశం ఇస్తారు. చెన్నై నుంచి ఎవరైనా బయటకు వెళ్లాలనుకుంటే ప్రభుత్వం నుంచి ఈ–పాస్ తీసుకోవాలి.