బస్సులు నడపకుంటే ఇంజిన్లు దెబ్బతింటాయి | Tamil nadu RTC Workers Worried About Bus Repair After Lockdown | Sakshi
Sakshi News home page

బస్సులు నడపకుంటే ఇంజిన్లు దెబ్బతింటాయి

Published Tue, Apr 21 2020 8:01 AM | Last Updated on Tue, Apr 21 2020 8:01 AM

Tamil nadu RTC Workers Worried About Bus Repair After Lockdown - Sakshi

చెన్నై, టీ.నగర్‌: రవాణ సంస్థ డిపోల్లో నిలిపిన బస్సులను దీర్ఘకాలం నడపకుంటే ఇంజిన్లు దెబ్బతింటాయని, రూ. లక్షలు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని మెకానిక్‌లు, కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏసీ, ఎక్స్‌ప్రెస్, నగర ఎంటీసీ బస్సులు, టౌన్‌ బస్సులు డిపోల్లో నిలిపి వేశారు. మెయింటినెన్స్‌ లేని పక్షంలో బస్సుల ఇంజిన్‌లు దెబ్బతినే ప్రమాదం ఉందని తమిళనాడు మోటారు వాహన మెకానిక్‌ల సంఘం రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి కుమరవేల్‌ తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement