న్యూఢిల్లీ: ఇటలీ నావికుల కేసును కేంద్ర హోంశాఖ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)కు అప్పగించింది. ఈ కేసును దర్యాప్తు చేసే అధికారం కేరళ పోలీసులకు లేదని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసిన నేపథ్యంలో హోంశాఖ ఆ బాధ్యతలను ఎన్‌ఐఏకు అప్పగించింది. భారత్ సముద్ర జలాల్లో మత్య వేటకు వెళ్లిన ఇద్దరు కేరళకు చెందిన మత్యకారులను మాసిమిలియానో లాతోర్, సాల్వతోర్ గిరోన్ అనే ఇద్దరు ఇటలీ నావికులు కాల్చిచంపిన విషయం తెలిసిందే.
గతంలోనే ఈ ఉదంతంపై వామపక్షాలు పట్టుబట్టిన విషయం తెలిసిందే. అప్పట్లో ఇటలీ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. అంతకుముందు బీజేపీ నేతలు ఇటలీ నిర్ణయాన్ని తప్పుబట్టారు. భారత్‌ను ఇటలీ తేలికగా తీసుకోవడంపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది.