ఈశాన్య రాష్ట్రం త్రిపురలో దారుణం జరిగింది. తినడానికి తిండిలేని ఓ గిరిజన కుటుంబం పూట గడవడం కోసం రెండేళ్ల కుమారుడిని రూ.200లకు అమ్ముకున్నారు. ఈసంఘటన రాష్ట్ర రాజధాని అగర్తలాకు 112కిలోమీటర్ల దూరంలో ఉన్న రామ్‌కుమార్‌పురాలో జరిగింది. రుయనాభాటీ రేయంగ్ దంపతులు కటిక పేదరికం అనుభవిస్తున్నారు. వీరికి ప్రభుత్వం తరపున ఏ సంక్షేమ పథకాలు అందంటం లేదు. ఒకపూట కూడా తినడానికి తిండి లేని సమయాన తన రెండేళ్ల కుమారుడిని మచ్‌కుంభీర్‌కు చెందిన ఆటో డ్రైవర్ ధన్‌షాయ్‌కు గత ఏప్రిల్ 13న కేవలం రూ.200లకు అమ్ముకున్నారు.
అయితే ఈసంఘటనపై సమాచారం అందుకున్న ఛైల్డ్ లైన్ స్వచ్చంద సంస్థ ఈసంఘటనను తీవ్రంగా ఖండించింది. తల్లీ బిడ్డలను తిరిగి కలిపే బాధ్యత తీసుకుంది. జిల్లా పాలనాధికారులు, పోలీసుల సహకారంతో బాలుడి తల్లి రుయనాభాటీతోపాటు, బాలుడిని కొనుగోలు చేసిన ధన్‌షాయ్‌తో పలుసార్లు చర్చలు జరిపింది. ఈసందర్భంగా రుయనాభాటీ విధిలేని పరిస్థితుల్లో తన రెండో భర్త, బాలుడిని అమ్మమని బలవంతం పెడితేనే అమ్మినట్లు పేర్కొంది. పలు దఫాలు ఇరువురితో చర్చలు జరిపిన తరువాత బాలుడిని కన్నతల్లికి అప్పగించినట్లు ఛైల్డ్‌లైన్ సభ్యులు మృణాళిని రక్షిత్ తెలిపారు.
బాలుడిని కొనుగోలు చేసిన ధన్‌షాయ్‌కు నలుగురు కుమర్తెలు ఉన్నారు. దీంతో కుమారుడు కావాలని బాలుడిని కొనుగోలు చేశారు. చర్చల అనంతరం బాలుడిని కన్నతల్లికి అప్పగించినా, ఆర్థికంగా బాలుడుకు అండగా ఉండటానికి అంగీకరించారు. అంతేకాకుండా రుయనాభాటీ కుటుంబాన్ని అన్నివిధాల ఆదుకుంటామని జిల్లా అధికారులు హామీ ఇచ్చారు. అయితే ఈసంఘటనని త్రిపుర ప్రభుత్వం ఘండించింది. ఇలాంటి సంఘటనలకు రాష్ట్రంలో అవకాశం లేదని, రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలుచేయడానికి, ప్రతిపక్షాలు పన్నిన కుట్ర అని సంక్షేమ శాఖా మంత్రి బిజితానాథ్ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment