సాక్షి, ముంబై : నాసిక్‌లో మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్)కు చెందిన ఇద్దరు కార్పొరేటర్లు శివసేనలో చేరారు. ఎమ్మెన్నెస్ కార్పొరేటర్లైన నిలేష్ శెలార్, శోభనా షిందే బుధవారం మాతోశ్రీలో ఉద్దవ్ సమక్షంలో శివసేన తీర్థం పుచ్చుకున్నారు. తాము ఊహించినట్టుగా ఎమ్మెన్నెస్‌తో అభివృద్ధి జరగలేదని, అందుకే తాము శివసేనలో చేరినట్టు వారు పేర్కొన్నారు.
ఎమ్మెన్నెస్‌కు షాక్
నాసిక్ మేయర్ ఎన్నికలు ఎమ్మెన్నెస్‌కు మరింత సమస్యగా మారనుంది. గత ఎన్నికల్లో బీజేపీతో జతకట్టిన ఎమ్మెన్నెస్ నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్‌లో అధికారం చేపట్టింది.ఈ సారి ఎన్నికల్లో మాత్రం ఎమ్మెన్నెస్‌తో బీజేపీ తెగదెంపులు చేసుకుంది. మళ్లి శివసేన, బీజేపీ, ఆర్పీఐలు మహాకూటమిగా ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఒంటరైన ఎమ్మెన్నెస్‌కు ఇద్దరు కార్పొరేటర్లు పార్టీని వీడిచి వెళ్లిపోయారు. వారిద్దరూ శివసేనలో చేరడం మరింత షాక్‌కు గురి చేసింది.
మహాకూటమికే అధికారం: ఉద్దవ్ ఠాక్రే
నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్‌లో మహాకూటమి అధికారంలోకి వస్తుందన్న ధీమాను శివసేన అధ్యక్షులు ఉద్దవ్ ఠాక్రే వ్యక్తం చేశారు. శివసేనలో చేరిన ఇద్దరు కార్పొరేటర్లకు స్వాగతం ఆయన స్వాగతం పలికారు. శుక్రవారం జరగబోయే ఎన్నికల్లో తాము విజయం సాధిస్తామని తమ అభ్యర్థి మేయర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరిస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
ఎమ్మెన్నెస్‌కు మరో షాక్
Published Wed, Sep 10 2014 10:36 PM | Last Updated on Sat, Sep 2 2017 1:10 PM
Advertisement
Advertisement