
బడ్జెట్‌కు ముందు స్టాక్ మార్కెట్ల లాభాల బాట
ముంబై : పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో గురువారం స్టాక్‌మార్కెట్లు లాభపడుతున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 168 పాయింట్ల లాభంతో 36 వేల424 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 46 పాయింట్ల లాభంతో 10,877 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.
కొనుగోళ్ల మద్దతుతో పలు రంగాల షేర్లు లాభపడుతున్నాయి. మధ్యంతర బడ్జెట్‌లో గ్రామీణ రైతాంగానికి మేలు చేసే చర్యలతో పాటు వేతన జీవులకు ఊరటగా ఐటీ మినహాయింపు పరిమితిని పెంచుతారని భావిస్తున్నారు.