ఆంధ్రప్రదేశ్‌లోనూ అంతంతమాత్రంగానే ఉన్న రిజర్వాయర్లు
న్యూఢిల్లీ: వర్షాలు ముఖం చాటేయడంతో దేశవ్యాప్తంగా నీరు అడుగంటుతోంది. ఆంధ్రప్రదేశ్ సహా 12 రాష్ట్రాల్లోని రిజర్వాయర్లలో నీటి మట్టాలు గతేడాది ఇదే కాలంతో పోలిస్తే పడిపోయినట్లు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) వెల్లడించింది. తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్, పశ్చిమబెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లోని రిజర్వాయర్లలో జూలై 3 నాటికి నీటి మట్టాలు గతేడాదితో పోలిస్తే తక్కువగా ఉన్నట్లు సీడబ్ల్యూసీ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్‌లోని రిజర్వాయర్లలో నీటిమట్టాలు గతేడాది మాదిరిగానే ప్రస్తుతమూ ఉన్నట్లు పేర్కొంది. ఇక, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో మాత్రం గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం రిజర్వాయర్లలో మెరుగైన నీటిమట్టాలు ఉన్నట్లు తెలిపింది.
12 రాష్ట్రాల్లో రిజర్వాయర్లు వెలవెల: సీడబ్ల్యూసీ
Published Sat, Jul 5 2014 2:49 AM | Last Updated on Sat, Sep 2 2017 9:48 AM
Advertisement