వాట్సాప్ బిజినెస్ సర్వీస్ షురూ
వాట్సాప్ బిజినెస్ సర్వీస్ షురూ
Published Wed, Sep 6 2017 5:28 PM | Last Updated on Fri, Jul 27 2018 1:16 PM
న్యూఢిల్లీః ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త సర్వీస్ ప్రారంభించింది. చిన్న వ్యాపారులు, సంస్థలకు మేలు చేసేలా వాట్సాప్ బిజినెస్‌ను లాంఛ్ చేసింది. ఈ సర్వీస్ ద్వారా చిన్న వ్యాపారులు, సంస్థలు తమ ఉత్పత్తులు, సేవల గురించి సులభంగా ఇంటరాక్ట్ కావచ్చని వాట్సాప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మాట్ ఇదేమా చెప్పారు.వాట్సాప్ బిజినెస్‌ను చిన్న వ్యాపారుల కోసం డిజైన్ చేశామని, బిజినెస్ ప్రొఫైల్ లేని వారి కోసం ఒకే చోట కస్టమర్లను నిర్వహించే రీతిలో ఇది మెరుగైన సేవలు అందిస్తుందన్నారు.
వ్యాపారులు తమ వాట్సాప్ కాంటాక్ట్స్‌ను ఫేస్‌బుక్, ఇతర సోషల్ మీడియా వేదికలపై ఉంచడం ద్వారా విస్తృత కస్టమర్లకు చేరువ కావచ్చని చెప్పారు. నూతన యాప్‌తో వ్యాపారాలు వినియోగదారులతో నేరుగా అనుసంధానం కావచ్చని అన్నారు. రానున్న రోజుల్లో చిన్న వ్యాపారులు ఎదుర్కొనే సమస్యలను అధిగమించేందుకు నూతన ఫీచర్లు జోడించేలా ఈ యాప్‌ను పరీక్షిస్తామని తెలిపారు. ఈ యాప్‌లో వ్యాపార సంస్థలు తమ చిరునామా, పని చేసే వేళలు, ఉత్పత్తి, సేవల వివరాలతో కూడిన కంపెనీ ప్రొఫైల్‌ను రూపొందించుకోవచ్చని చెప్పారు. కన్సూమర్ చాట్స్ చేసేందుకూ వాట్సాప్ బిజినెస్‌లో వెసులుబాటు ఉందని తెలిపారు.
Advertisement