
కొట్టుకోవడం మానేద్దాం: యోగేంద్ర యాదవ్
న్యూఢిల్లీ: పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు స్వస్థి పలకాలని ఆమ్ఆద్మీపార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నుంచి బహిష్కరణకు గురైన నేత యోగేంద్ర యాదవ్ పార్టీ కార్యకర్తలకు సూచించారు.
న్యూఢిల్లీ: పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు స్వస్థి పలకాలని ఆమ్ఆద్మీపార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నుంచి బహిష్కరణకు గురైన నేత యోగేంద్ర యాదవ్ పార్టీ కార్యకర్తలకు సూచించారు. పార్టీపై విశ్వసనీయతను కోల్పోలేదని, పార్టీ ప్రధానంగా దృష్టిని సారించే అవినీతి కట్టడివంటి అంశాల విషయంలో మరింత పదునుగా ఆలోచిస్తానని చెప్పారు. ఇటీవల కాలంలో పార్టీలో ఎన్నో విషయాలు జరిగాయని, దయచేసి ఇక అంతర్గతంగా తగాదాలు నిలిపేయాలని పార్టీకి అంకితమై పనిచేయాలని సూచించారు. "ఇక ప్రశ్నించుకోవడం, సమాధాన పరుచుకోవడం లాంటివి మానేయాలి. మనం ఇక్కడికి కొట్టుకునేందుకు రాలేదు. ఇక చాలు. చేయాల్సిన పని చాలా ఉంది. ఎంతో అవినీతిని తొలగించాల్సిన అవసరం ఉంది' అని పార్టీ కార్యకర్తలకు హితబోధ చేశారు.