న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) బహిష్కృత నేతలు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్‌లు తిరిగి పార్టీలోకి వస్తే చాలా సంతోషమని ఆ పార్టీ నేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ‘ఒకవేళ అది జరిగితే... చాలా మంచిది’ అని ఓ టీవీ చానల్‌తో అన్నారు. పార్టీలోకి వారి పునరాగమనానికి తన ఒంటెత్తు పోకడలే అవరోధమనే ఆరోపణలను కేజ్రీవాల్ ఖండించారు. భూషణ్, యోగేంద్రలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఈ ఏడాది ఏప్రిల్‌లో వారిని ఆప్ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. కాగా, కేజ్రీవాల్ తనను పార్టీలోకి తిరిగి ఆహ్వానించడంపై ప్రశాంత్ భూషణ్ తీవ్రంగా మండిపడ్డారు. పార్టీ సమావేశంలో తన ఎమ్మెల్యేలతో మాపై దాడి చేయించి... ఇప్పుడేమో పార్టీలోకి తిరిగి రావాలని నిస్సిగ్గుగా కోరుతున్నారని ట్వీట్ చేశారు.
'వారిద్దరూ పార్టీలోకి తిరిగి వస్తే సంతోషమే'
Published Sat, Jul 18 2015 2:41 PM | Last Updated on Sun, Sep 3 2017 5:45 AM
Advertisement