'వాడి.. పారేయ్' నుంచి 'నాశనం చేయ్' వరకు!
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధాంతంలో గణనీయంగా మార్పు వచ్చిందని, ఒకప్పుడు నేతలను 'వాడి పారేయడం' ఆ పార్టీ సిద్ధాంతంగా ఉండేదని, ఇప్పుడు 'వాడి నాశనం చేయ్' అన్నట్టు ఆ పార్టీ సిద్ధాంతం మారిందని ఆప్ మాజీ నేత యోగేంద్ర యాదవ్ విమర్శించారు. తాజాగా సుచాసింగ్ ఛోటెపర్‌ను పార్టీ పంజాబ్ కన్వీనర్ పదవి నుంచి తొలగించింది.
ఈ నేపథ్యంలో ఆప్‌పై ఆ పార్టీ బహిష్కృత నేత అయిన యోగేంద్ర యాదవ్ తీవ్ర వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆప్ రెబెల్ ఎమ్మెల్యే పంకజ్ పుష్కర్‌తో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన.. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం భావప్రకటన స్వేచ్ఛను కాలరాస్తున్నదని, అసెంబ్లీలో ఎమ్మెల్యేలు గొంతెత్తకుండా అడ్డుకుంటున్నదని మండిపడ్డారు. టికెట్ ఆశావహుల నుంచి లంచం తీసుకున్నారన్న ఆరోపణలపై ఛోటెపర్‌ను ఆప్ పదవి నుంచి తొలగించింది.