యోగీపై బీజేపీ అసంతృప్తి
► యోగీ యువసేనపై ఆర్‌ఎస్‌ఎస్ అసంతృప్తి
లక్నో: ఉత్తర ప్రదేశ్ రాజకీయల్లో ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్ ఓ సంచలనం. కేవలం రెండు నెలల కాలంలోనే అత్యంత ప్రభావిత వ్యక్తిగా వార్తల్లో నిలిచారు. ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అంతే కాదు ఆయనకంటూ ప్రత్యేకమైన ఓ యువసేన ఉంది. అదే హిందూ యువ వాహిని. అయితే ప్రస్తుతం ఈ యువ వాహిని పై బీజీపీ అధిస్ఠానం అసంతృప్తిగా ఉంది. ఇది ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధం లేకుండా స్వతంత్రంగా ఉంటోంది. అయితే దీనిపై ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలు అసంతృప్తిగా ఉన్నాయి.
హిందూ వాహిని ఆదిత్యానాథ్ ఆలోచన నుంచి వచ్చింది. గోరక్‌పూర్, ఎంపీగా ఎన్నికైనప్పటి నుంచి దీని ప్రభావం పూర్వాంచల్ ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉండేది. తాజాగా హిందూ వాహిని, యోగి ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించడం మొదలైంది. ఎక్కువ సంఖ్యలో కార్యకర్తలు ఇందులోచేరడం మెదలైప్పటినుంచి ఆర్‌ఎస్‌ఎస్ అసంతృప్తిగా ఉంది. దీనిపై రాష్ట్ర బీజీపీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి కేశవ్ మౌర్య స్పందించారు. వాహిని పేరు ఎత్తకుండా, దానిని గుర్తు చేసేలా పెరుగుతున్న ఇతర యువసేనలను సహించేదిలేదని, పార్టీ పరంగా అన్నీ ప్రాధాన్యతలు మొదట పార్టీకి, కార్యకర్తలకు ఇవ్వాలన్నారు.
యోగి నామినేషన్ సమయంలో కూడా ఇలాంటి స్వంతత్ర వాహినులను బీజేపీ నేతలు వ్యతిరేకించారు. హిందూ వాహిని నెమ్మదిగా ఆర్‌ఎస్‌ఎస్‌లో కలుస్తుందని భావించారు. గతంలో రామ మందిర నిర్మాణం కోసం హిందు పరిషత్ చేస్తున్న ఉద్యమంలో కూడా ఆదిత్యానాథ్, ఆయన పూర్వికుడు అవైధ్యానాథ్ ప్రత్యేకంగా గుర్తింపు పోందారు. తాజాగా హిందూ యువ వాహిని భారీ ప్రణాళిక రచింది. ఏడాది పాటు పార్టీలో నియామకాలు ఆపేయాలని భావిస్తోంది. దీనిపై ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలు ఎలా స్పందిస్తాయో చూడాలి.