మల్లెల వెంకట్రావు
భారతదేశంలో దళితుల సమస్య మన సమాజంలోని సర్వసాధారణమైన అసమాన తలకు, అన్యాయాలకు ప్రతీక. మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు అనుభవిస్తు న్న వివక్ష, రాజ్యాంగంలో పొం దుపరిచిన విలువల ప్రజాస్వా మ్యంలో విషాదకరమైన నిరా కరణల ఫలితమే. సమాజం నిరాకరించిన ఈ వర్గాల అభ్యున్నతికి, అసమానతలు తొలగించేందుకు, ప్రగతి శీలమైన సామాజిక విధానాలు అవలంబించాలి. పద మూడేళ్ల క్రితం అంటే 2002 జనవరి 12, 13 తేదీల్లో దళిత, ఆదివాసీ మేధావులు భోపాల్‌లో సమావేశమై, దళితులు, ఆదివాసీలకు రాజ్యాంగ ఫలాలు అందాలని కోరుతూ, 21వ శతాబ్దానికి 21 అంశాల ప్రణాళికతో భోపాల్ డిక్లరేషన్‌ను ఆవిష్కరించారు. వారి ఆశలు ఫలించాయా? అడియాసలయ్యాయా? అని ఆత్మ పరిశీ లన చేసుకోవాల్సిన అవసరం దళిత, ఆదివాసీ, మేధా వులు, ఉద్యమకారులందరిపైనా ఉంది.
దేశ వ్యవసాయరంగంలో ఎస్సీలు 72 శాతం, ఎస్టీలు 86 శాతం ఆధారపడి ఉన్నారు. నిర్మాణరంగంలో ఎస్సీలు 11.83 శాతం, ఎస్టీలు 4.86 శాతంగా ఉన్నారు. వివిధ రంగాల్లో సేవలందించే ఎస్సీలు 14.17 శాతం, ఎస్టీలు 7.23 శాతం ఉన్నారు. 72 శాతం ఎస్సీలు ఆధా రపడిన వ్యవసాయ రంగం చేసిన ఉత్పత్తి కంటే వ్యవ సాయేతర రంగంపై ఆధారపడిన శ్రామికులకు ఎక్కువ విలువ, ఎక్కువ ఆదాయం సమకూరుతుందని గణాం కాలు చెబుతున్నాయి. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్, ట్రైబల్ సబ్‌ప్లాన్‌ల అమలు కోసం రూ. 90 వేల కోట్లు కేటాయించిన కేంద్రం దీంట్లో రూ. 74,365 కోట్లను విడుదల చేసింది. వీటిలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చుచేసింది రూ.48,124 కోట్లు. ఆంధ్రప్రదేశ్‌లో రూ.4,492 కోట్లు విడుదల చేస్తే, ఖర్చు చేసింది రూ.2,551 కోట్లు. ఎస్సీలకు సంబంధం లేని రంగాలకు రూ.1,200 కోట్లు దారి మళ్లించారు. ఈ వర్గా ల వారికి ప్రైవేటు సంస్థలలో ఉద్యోగాలు దారీతెన్నూ లేకుండా ఉన్నాయి.
ప్రజాస్వామ్యం ఒకానొక ప్రభుత్వ రూపం కారా దు. అది కచ్చితంగా సమాజ రూపం కావాలి అన్న డా. బి.ఆర్. అంబేద్కర్ మాటలు పూర్తిగా నిర్లక్ష్యానికి గుర య్యాయి. ఈ నేపథ్యంలోనే భోపాల్ డిక్లరేషన్‌లో పాలు పంచుకున్న దళిత, ఆదివాసీ మేధావులు ప్రజాస్వామ్యం ఉండాలంటే ప్రజాస్వామిక సమాజం ఉండాలన్న డా. అంబేద్కర్ మాటలపై విశ్వాసాన్ని ప్రకటించారు. సాటి మనిషి నెత్తురును చెమటగా మార్చి సాధించిన ఉత్ప త్తిలో, ఆదాయంలో అధిక భాగాన్ని మోసపూరిత విధా నాలతో అనుభవిస్తూ, పరాన్నజీవులుగా బతుకుతున్న, విలాసవంత జీవితాలను గడుపుతున్న సహోదర భారతీ యుల హృదయాల్లో సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని కోరుకుంటూ ఆవిష్కరించిన భోపాల్ డిక్లరేషన్ అమలు కోసం.. దళిత, ఆదివాసీ జనుల విముక్తి కోసం నిజాయి తీగా ఉద్యమం నిర్మిద్దాం, మరింత త్యాగం, మరింత ఉద్యమం, మరింత పోరాటం, మరింత ఐక్యతను మనం దరం కలసికట్టుగా ప్రదర్శిద్దాం.
(వ్యాసకర్త రాష్ట్ర అధ్యక్షులు మాల మహాసభ, మొబైల్: 9291365253)