
సమసమాజ దార్శనికుడు ఆర్.కృష్ణయ్య
అణగారిన కులాలు స్వాతంత్య్ర ఫలాలు పొందలేక పోవడానికి కారణం వీరికి ఆధునిక విద్య లేకపోవడ మేనని గ్రహించి దాని కోసం పెద్ద ఉద్యమమే చేయాలని గుర్తించిన తొలి వ్యక్తి ఆర్.కృష్ణయ్య.
అణగారిన కులాలు స్వాతంత్య్ర ఫలాలు పొందలేక పోవడానికి కారణం వీరికి ఆధునిక విద్య లేకపోవడ మేనని గ్రహించి దాని కోసం పెద్ద ఉద్యమమే చేయాలని గుర్తించిన తొలి వ్యక్తి ఆర్.కృష్ణయ్య. బీసీలు చదువుకోవడానికి కావలసింది ఉచిత వసతి గృహాలని వాటి కోసం తొలిసారిగా ఉద్యమాన్ని ప్రారం భించాడు. ఈ ఉద్యమంతోటే ప్రభుత్వం హాస్టళ్లు మంజూరు చేసింది. దీంతోనే ఈ రోజున లక్షలాది బీసీ విద్యార్థులు ఉచిత భోజన వసతి సౌకర్యంతో చదువుకోవడానికి అవకాశం లభించింది. పలువురు బీసీ విద్యార్థులు మంచి ఉద్యోగాలలో స్థిరపడ్డారు.
1975కు ముందు బీసీ విద్యార్థులకు ఉపకార వేతనం అనేది లేదు. బీసీ, ఈబీసీ విద్యార్థులకు కూ డా స్కాలర్‌షిప్పులు, ఫీజులు మంజూరు చేయాలని ఉద్యమం చేసిందీ కృష్ణయ్యే. దీని ఫలితంగానే నాటి సీఎం జలగం వెంగళరావు బీసీ స్కాలర్‌షిప్‌లు, మెస్‌చార్జీల స్కీములను పెట్టారు. స్కాలర్ షిప్‌లు సాధించడమే కాదు ఏటికి ఏడు పెరుగుతున్న ధర లకనుగుణంగా స్కాలర్‌షిప్‌లను పెంచేలా చేయడా నికి కూడా తిరిగి కృష్ణయ్య నేతృత్వంలో ఉద్యమాలు నడిచాయి. వేలాది హాస్టళ్లలో, రెసిడెన్షియల్ పాఠ శాలల్లో లక్షలాది విద్యార్థులు ఈనాడు కడుపునిండా భోజనం చేస్తున్నారంటే కృష్ణయ్య చేసిన ఈ ఉద్యమ ఫలితమే.
బి.సి. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి రెసిడెన్షియ ల్ పాఠశాలలు ఎంతో అవసరమని గుర్తించి 1982లోనే ఇందు కోసం ఉద్యమించారు ఆర్.కృష్ణయ్య. ఈ ఉద్యమ ఫలితంగానే అదే ఏడాది 44 సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠ శాలలు మంజూరయ్యాయి. ఇప్పటి వరకూ 617 పాఠశాలలు మంజూరయ్యాయి. వీటి ల్లో దాదాపు మూడు లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇలాంటి స్కీము దేశంలోని మరే రాష్ట్రాలలోనూ లేదు.
అన్ని వృత్తి విద్యాకోర్సులలో చదివే బీసీ విద్యా ర్థులకు మొత్తం ఫీజులను ప్రభుత్వమే భరించాలని 1994 నుండి 2008 వరకు సుదీర్ఘ పోరాటాలు నడి పాడు ఉద్యమాలు చేశారు కృష్ణయ్య. ప్రభుత్వాలు దిగిరాకపోతే 2008 జనవరిలో ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాడు. దీనితో ప్రభు త్వం దిగివచ్చింది. కృష్ణయ్యతో ప లు దఫాలుగా చర్చలు జరిపి, జి. ఓ.నెం. 18, 50లు జారీ చేశారు. ఈ ఉద్యమక్రమంలో 650 సార్లు ధర్నా లు, ర్యాలీలు, ప్రదర్శనలు జరిగాయి. ఈ ఉద్యమ ఫలితంగానే ఫీజు రీయింబర్స్‌మెంట్ అనే పథకం అ మలైంది. ఈ స్కీము ద్వారా 26 లక్షల మంది అణగారిన కులాల నిరుపేద విద్యా ర్థులు ఉన్నత విద్యను వృత్తి విద్యను పొంది జీవితంలో ఉన్నత స్థానాల్నీ పొందగలుగుతు న్నారు. ఇలాంటి ఉద్యమక్రమాలలో వచ్చిన చాలా జి.ఒ.లలో ఆర్.కృష్ణయ్య పేరు కూడా ఉండడం ఆయన చేసిన ఉద్యమాలకు ఒక నిదర్శనం. బీసీ లకు ఉద్యోగాలలో రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేయడానికి, లక్షలాది ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయడానికి 1976 నుండి ఇప్పటి దాకా నిర్విరామం గా ఉద్యమాలు నడుపుతూనే ఉన్నారు కృష్ణయ్య.
ఉస్మానియా యూనివర్సిటీలో న్యాయశాస్త్రం లో ఉన్నత విద్యను అభ్యసించిన కృష్ణయ్య విద్యార్థి నాయకుడి స్థాయి నుండి సామాజిక ఉద్యమాలు చేశాడు. తండ్రి 140 ఎకరాల భూస్వామి అయినా కూడా కుటుంబానికి దూరం అయిన కొద్ది కాలంలో పేదరికం అంటే ఎలా ఉంటుందో కూడా చవిచూ శారు కృష్ణయ్య. ఆధిపత్య కులాల వారితో సమంగా వెనుకబ డిన కులాల వారు ఉన్నత విద్యను, ఉన్నత పద వులను పొందినప్పుడే దేశంలో సమసమాజం సిద్ధిస్తుందన్నది కృష్ణయ్య సామాజిక సిద్ధాంతం. ఇదే ఆయన దార్శనికత. నేడు 60వ పుట్టిన రోజు జరు పుకునే ఆర్.కృష్ణయ్య ఇంకొక 60 జన్మదినోత్సవాలు జరుపుకోవాలని, తమకు సమసమాజ ఫలాలు అం దించాలని కోరుకుంటున్నారు అణగారిన కులాల ప్రజలందరూ.
(నేటికి ఆర్.కృష్ణయ్యకు 60 వసంతాలు)
డా॥వకుళాభరణం కృష్ణమోహన్‌రావు
పూర్వ సభ్యులు, రాష్ట్ర బీసీ కమిషన్ సెల్: 9849912948