ప్రాసంగికత కోల్పోని ప్రసంగం | Gandhiji gives a speech at Benaras hindhu university | Sakshi
Sakshi News home page

ప్రాసంగికత కోల్పోని ప్రసంగం

Published Fri, Feb 12 2016 1:03 AM | Last Updated on Sun, Sep 3 2017 5:26 PM

ప్రాసంగికత కోల్పోని ప్రసంగం

ప్రాసంగికత కోల్పోని ప్రసంగం

దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కి 1915లో తిరిగొచ్చిన మోహన్ దాస్ కరమ్‌చంద్ గాంధీకి 1916 ఫిబ్రవరి 4 నుంచి 8 వరకు జరగనున్న బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగించాలని ఆహ్వానం అందింది.. పలు సంస్థానాధిపతులు, విద్యావేత్తలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో 1916 ఫిబ్రవరి 6 సాయం త్రం గాంధీ ఆహూతులను ఉద్దేశించి ప్రసంగించారు. దేశ భాషలను పక్కనబెట్టి ఇంగ్లిష్ భాషకు నాటి పాలకులు ఇస్తున్న ప్రాధాన్యం, స్వయంపాలన, పరిశుభ్రతపై అవగా హనా లేమి, అరాచకవాదుల లక్ష్య రహిత పోరాటం (అరా చకవాదులను ఖండిస్తూ గాంధీ చేసిన ప్రసంగాన్ని అనీబి సెంట్ అడ్డుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది) సంపన్నుల సంపద ప్రదర్శనలు, ధనిక-పేద మధ్య అంతరాలు వంటి అంశాలపై గాంధీ ప్రసంగంలోని అంశాలు వందేళ్ల తర్వాత కూడా తమ ప్రాసంగికతను కోల్పోకపోవడమే విషాదం. గాంధీ ప్రసంగ విశేషాలు క్లుప్తంగా ఆయన మాటల్లో...
 
ఈ పవిత్ర నగరంలో ఈ గొప్ప కళాశాల నీడలో నిల బడి ఈ సాయంత్రం నాది కాని విదేశీ భాషలో నా దేశ వాసులను ఉద్దేశించి ప్రసంగించడం కంటే మించిన అవ మానకరమైన విషయం ఇంకొకటిలేదు. మన భాష మనకు ప్రతిబింబం. ఉత్తమమైన ఆలోచనను మన భాష వ్యక్తం చేయలేదని మీరు నాకు చెప్పినట్లయితే, అతి త్వరలోనే మనం ఉనికిని కోల్పోవడం ఖాయం. ఇంగ్లిష్ భాష ద్వారానే జ్ఞానం పొందుతున్న ప్రతి యువతీయువకులూ ఆరేళ్ల విలువైన జీవితాన్ని కోల్పోతున్నారని కొందరు పూనా ప్రొఫెసర్లు నాతో చెప్పారు.

మన స్కూళ్లు, కాలేజీలలోని విద్యార్థులకూ, మనకు కూడా దీన్ని వర్తింపజేస్తే జాతి ఎన్ని వేల సంవత్సరాలను నష్టపోతూ వచ్చిందో సులభంగా అర్థమవుతుంది. భారతీయులకు చొరవ, ప్రేరణ లేవని ఆరోపిస్తున్నారు. నిజమే మరి. విదేశీ భాషను నేర్చుకోవ డంలోనే జీవితంలోని విలువైన సంవత్సరాలను మనం వెచ్చిస్తున్నప్పుడు మనకు ఇక చొరవ ఎక్కడుంటుంది? గత 50 ఏళ్ల కాలంలో దేశభాషల్లోనే విద్య నే ర్చుకోగలిగినట్ల యితే, మనం నేడు స్వేచ్ఛా భారత్‌లో ఉండేవాళ్లం.  
 
నిన్నటి సాయంత్రం నేను కాశీ విశ్వనాథుని ఆలయం సందర్శించాను. ఆలయ వీధుల్లో నడుస్తుంటే కొన్ని ఆలో చనలు నన్ను వెంటాడాయి. పైనుంచి ఒక కొత్త వ్యక్తి ఈ ఆలయంలోకి ఊడిపడి, హిందువులుగా మనం ఎలాంటి వారిమని పరిశీలించినట్లయితే, మనల్ని ఖండించి తీరు తాడు. ఈ గొప్ప ఆలయం మన గుణశీలాలకు ప్రతిబింబం కాదా? మన పవిత్ర ఆలయం ఇంత మురికిగా ఉండటం సరైందేనా? ఆలయవీధులు ఎంతో ఇరుగ్గాను, క్రమరహి తంగాను ఉన్నాయి. చివరకు మన ఆలయాలు కూడా కాస్తంత విశాలంగాను, కాస్త పరిశుద్ధంగాను లేకపోతే మనం కోరుకుంటున్న స్వయం పాలనకు అర్థం ఏమిటి? రైలు ప్రయాణంలో మూడో తరగతి ప్రయాణికుల కష్టాన్ని గమనించాను. కాని వారి కష్టాలకు రైల్వే యం త్రాంగాన్ని తప్పుపట్టకూడదు. మనకు పరిశుభ్రతకు సం బంధించిన ప్రాథమిక సూత్రాలు కూడా తెలీవు. బోగీల్లో ఎక్కడపడితే అక్కడ ఉమ్మి వేస్తుంటాం. ఫలితం బోగీలో భయంకరమైన మురికి. స్వయం పాలన కావాలంటే ఇలాంటి పరిస్థితులను ముందుగా మెరుగుపర్చాలి.
 
నిన్నటి సాయంత్రం సభకు అధ్యక్షత వహించిన మహారాజావారు దేశ దారిద్య్రం గురించి మాట్లాడారు. ఇతర వక్తలూ దీనిపై నొక్కి చెప్పారు. కానీ వైస్రాయ్ గారు తొలి రోజు ప్రారంభోత్సవం నిర్వహించిన సభామంట పంలో మనం చూసిందేమిటి? ఆపాద మస్తకం ధరించిన నగలతో కళ్లు మిరిమిట్లు గొలిపే స్థాయి ప్రదర్శన.  మీరు ధరించిన ఈ నగలన్నింటినీ తీసివేసి భారత్‌లోని మీ దేశవాసులకోసం దాన్ని ధర్మనిధిగా ఉంచనంతకాలం భారత్‌కు విముక్తి లేదు. బ్రిటిష్ ఇండియాలో కానీ, మన సంస్థానా లలో కాని ఉన్న గొప్ప గొప్ప రాజ మందిరాలను చూసిన వెంటనే నాకు అసూయ కలుగుతుంటుంది. ఓహో.. ఈ డబ్బంతా వ్యవసాయ దారులనుంచే వచ్చింది కదా? జనాభాలో 75 శాతంపైగా వ్యవసా యదారులున్నారు. వారి శ్రమ ఫలితాలను మొత్తంగా మనమే తీసుకున్నా లేక తీసుకోవడానికి ఇతరులను అను మతించినా.. మనలో స్వయంపాలన స్ఫూర్తి కొరవడినట్లే. మన విముక్తి రైతుల ద్వారానే వస్తుంది. న్యాయవాదులు, వైద్యులు, ధనిక భూస్వాములు దాన్ని సాధించలేరు.
 
నేటి భారత్ తన అసహనంలోంచి అరాచకవాదుల సైన్యాన్ని తయారు చేస్తోందని మనం మర్చిపోవద్దు. నేను కూడా అరాచకవాదినే. కాని నాది మరొక రకం. నేను వారిని కలసిన పక్షంలో భారత్‌లో వారి అరాచకవాదానికి తావు లేదని చెబుతాను.  దేశంపట్ల తన ప్రేమకు గాను నేను ఆరాచకవాదిని గౌరవిస్తాను. దేశం కోసం ప్రాణ తర్పణ చేసేందుకు సిద్ధపడే అతడి ధీరత్వాన్ని గౌరవిస్తాను. కాని నాదొక ప్రశ్న. హత్య చేయడం గౌరవప్రదమైనదేనా? హంతకుడి కత్తి గౌరవప్రదమైన మృత్యువుకు ముందు షరతుగా ఉంటుందా? ఆంగ్లేయులు భారత్‌నుంచి వైదొల గడం, వారిని పారదోలడం భారత్ విముక్తికి అవసరం అని నేను గ్రహించినట్లయితే, వారు వెళ్లిపోవలిసిందేనని చెప్ప డానికి, ఆ విశ్వాసానికి మద్దతుగా చావడానికైనా నేను సిద్ధ పడతాను వీరమరణం అంటే ఇదే.

రహస్య పథకాలు సృష్టించి బాంబులు విసిరేవారు బయటకు రావడానికి భయపడుతున్నారు. పట్టుబడినప్పుడు తమ లక్ష్య రహిత సాధనకు పరిహారాన్ని అనుభవిస్తున్నారు. మనం ఇలా చేయకపోతే, కొంతమంది బాంబులు విసరకపోతే, బ్రిటిష్ పాలన నుంచి వేరుపడే ఉద్యమానికి సంబంధించి మనం ఏమీ సాధించలేమని కొందరు నాతో చెప్పి ఉన్నారు. (ఇక్కడ అనీబిసెంట్, గాంధీ ప్రసంగాన్ని అడ్డుకుని ‘దయ చేసి ఆపండి’ అన్నారు).

నేను చెబుతున్నది అవసరమే అని భావిస్తున్నా. ప్రసంగాన్ని ఆపివేయాలని చెబితే దానికి నేను కట్టుబడతాను. (సభా చైర్మన్ వైపు తిరిగి) నా ఈ ప్రసంగం ద్వారా నేను దేశానికి, చక్రవర్తికి సేవ చేయడం లేదని మీరు భావిస్తున్నట్లయితే నేను తప్పక ఆపివేస్తాను. (ఇక్కడ శ్రోతలు ‘మాట్లాడండి’ అంటూ అరిచారు). (చైర్మన్: ‘దయచేసి మీ లక్ష్యాన్ని వివరించండి’ అన్నారు). నేను... (మరోసారి అంతరాయం కలిగింది) మిత్రులారా, ఈ అంతరాయం పట్ల ఆగ్రహించకండి. నన్ను మాట్లాడటం ఆపివేయమని అనీబిసెంట్ అంటున్నారంటే ఆమె భారత్‌ను ప్రేమిస్తున్నారు మరి. యువతముందు నేను తప్పుగా మాట్లాడుతున్నానని ఆమె భావిస్తున్నారు.
 
కాని ఇప్పుడు సైతం.. మరో వైపునుంచి వస్తున్న ఈ అనుమాన పూరిత వాతావరణాన్ని భారత్‌నుంచి ప్రక్షాళన చేయాలని కోరుకుంటున్నాను. మన లక్ష్యసాధనకు పరస్పర ప్రేమ, విశ్వాసం ప్రాతిపదికన ఒక సామ్రాజ్యాన్ని కలిగి ఉండాలి. ....స్వయంపాలన చేపట్టాలంటే దాన్ని మనం సాధిం చవలసిందే. దాన్ని మనకు ఎవరూ మంజూరు చేయరు. స్వతంత్రం అనేది ఒక పార్టీ ఇస్తే వచ్చేది కాదు. బోయెర్ యుద్ధం నుంచి మీరు పాఠం నే ర్చుకోండి. కొన్నేళ్ల క్రితం ఆ సామ్రాజ్యానికి శత్రువులుగా ఉన్నవారు ఇప్పుడు స్నేహితు లుగా మారారు. (ఈ సమయంలో ప్రసంగానికి అంతరా యం కలిగింది. వేదిక నుంచి కొందరు వెళ్లిపోసాగారు. దీంతో గాంధీ ప్రసంగం అర్ధంతరంగా నిలిచిపోయింది.

 (భారత్ తిరిగొచ్చాక ఎంకే గాంధీ 1916 ఫిబ్రవరి 6న చేసిన తొలి ప్రసంగానికి వందేళ్లు పూర్తయిన సందర్భంగా)
 
- ప్రత్యూష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement