మోదీ ప్రాభవానికి ఇదో పరీక్ష! | It is test for Modi | Sakshi
Sakshi News home page

మోదీ ప్రాభవానికి ఇదో పరీక్ష!

Published Sun, Feb 15 2015 1:41 AM | Last Updated on Sat, Sep 2 2017 9:19 PM

ఆకార్ పటేల్

ఆకార్ పటేల్

 అవలోకనం
 ప్రజల్లో రాక్ స్టార్‌గా, అన్ని సమస్యలనూ పరిష్కరించే పరిరక్షకుడిగా అభిమానుల గుర్తింపు పొందిన మోదీ, ఇటీవల కాలంలో తన గురించి విస్తృతంగా జరిగిన ప్రచారాన్ని అనుకూలంగా మార్చుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారు.
 
 తన పద్నాలుగేళ్ల రాజకీయ జీవితంలో మొట్ట మొదటిసారిగా నరేంద్ర మోదీ ఫిబ్రవరి 10న జరిగిన ఒక ఎన్నికలో ఓటమి పాలయ్యారు. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో అంగుష్టమాత్రంగా కనిపించిన ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలో బీజేపీ తుడిచిపెట్టుకుపోయింది.

 మోదీ 2001లో పూర్తికాలం రాజకీయ నేత అయ్యారు. ఆ సంవత్సరం ఆయన గుజరాత్ సీఎం పదవిలోకి దూసుకొచ్చారు. ఆ రాష్ట్రంలో అప్పటికే బీజేపీకి అనుకూలంగా ఓటింగ్ జరిగింది. 1995 నుంచే గుజరాత్‌లో బీజేపీ ఆధిక్యతలో ఉండేది. సీఎం కేశూబాయ్ పటేల్‌ను అంతర్గత సంక్షోభం కారణంగా తప్పించవలసినప్పుడు మోడీ ముందు పీఠికి వచ్చారు. మోదీ అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే గుజరాత్‌లో తీవ్రస్థాయిలో మరోసారి ఘర్షణలు చెలరేగాయి. టీవీలో సమగ్ర ప్రచారం కారణంగా ఈ దాడులు చరిత్రలో నిలిచిపోయాయి.

 ఈ హింసాత్మక ఘటన జరిగిన కొద్ది నెలలకే, అంటే 2002 చివర్లో మోదీ ఎన్నికల్లో తన మొదటి విజయాన్ని కైవసం చేసుకున్నారు. గుజరాత్‌లో బీజేపీకి అది మూడో విజయం. 2007, 2012 సంవ త్సరాలలో కూడా మోదీ గుజరాత్ శాసనసభ ఎన్ని కల్లో భారీ మెజారిటీతో అధికారం సాధించి పెట్టా రు. బీజేపీకి గుజరాత్ తన మద్దతును కొనసాగిస్తూ వచ్చిందన్న వాస్తవాన్ని పక్కనబెట్టి, అభివృద్ధిపై తాను దృష్టి పెట్టడం, తన ప్రజాకర్షణ, మొత్తంమీద తన రాజకీయ మేధ వల్లే గుజరాత్‌లో విజయం సాధిస్తున్నామనే ఆలోచన మోదీ మనస్సులో ప్రవే శించింది. ప్రత్యేకించి జాతీయ మీడియాలోని మోదీ ఆరాధకులు దీన్ని మరింత వ్యాప్తి లోకి తీసుకొచ్చా రు. మీడియాలోని చాలామంది ఆకర్షణీయమైన వక్తగా మోదీ సమర్థత ప్రాతిపదికనే కాకుండా, మిగతా రాజకీయనేతల కంటే భిన్నంగా ఆలోచిస్తూ, తన దార్శనికతను ఫలింపచేసుకునే వ్యక్తిగా కూడా తనలో ఓ విశిష్టత ఉందని భావించారు. ఈ ఆకర్ష ణను జాతీయస్థాయిలో, తర్వాత అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించిన కారణంగానే 2014 సార్వ త్రిక ఎన్నికల్లో మోదీ అద్భుత విజయానికి దారి ఏర్పడింది.

 ఢిల్లీలో ప్రస్తుత పరాజయం మోదీకి తొలి ఓట మి మాత్రమే కాదు. ఈ పద్నాలుగేళ్ల కాలంలో తొలి సారిగా తనకు తానుగా తిరస్కరణకు గురయ్యారనే చెప్పాలి. ప్రజల్లో రాక్ స్టార్‌గా గుర్తింపుపొందిన మోదీ, అన్ని సమస్యలనూ పరిష్కరించే పరిరక్షకు డిగా అభిమానులు భావించిన మోదీ, ఇటీవల కాలంలో తన గురించి విస్తృతంగా జరిగిన ప్రచా రాన్ని అనుకూలంగా మార్చుకోవడంలో విఫలమ య్యారు. గోధ్రా అల్లర్ల కవరేజి జరిగినప్పటినుంచి భారత మీడియా ఆయన్ని బజారు వర్తకుడిగా భావించేది. కానీ విదేశీ మీడియా తన గురించి ఏమనుకుంటోందన్న అంశం పట్లే మోడీ ఎక్కువగా ఆకర్షితుడవుతూ వచ్చారు.

 బ్రిటన్‌కు చెందిన డైలీ టెలిగ్రాఫ్ మోదీ ప్రస్తుత పరాజయంపై పతాక శీర్షికలో ఒక వ్యంగ్య వ్యాఖ్య ను ప్రచురించింది. అతి శక్తివంతుడైన భారత ప్రధా నమంత్రి ఒక నిలువుచారల జాకెట్ కారణంగా ఓడి పోయాడా? అమెరికా అధ్యక్షుడు ఒబామాతో భేటీ అయినప్పుడు ఢిల్లీలో మోదీ ధరించిన పది లక్షల రూపాయల ఖరీదైన సూట్ గురించే ఈ ప్రస్తావన. పైనుంచి కిందివరకు తన పేరును ముద్రించిన ఆ మోటు సూటును ధరించినప్పుడు మోదీని అంతవ రకూ ఆరాధిస్తూ వచ్చిన కొంతమంది ప్రజలు వెన క్కుతగ్గారు. అయితే 2001 నుంచి మోదీని అనుసరి స్తూ వచ్చిన వారు మోదీ స్వభావ సిద్ధంగానే అలా వ్యవహరించారని సమర్థించారు. అహ్మదాబాద్‌లో పదేళ్ల క్రితం నేను ఒక పత్రికలో పనిచేస్తున్నప్పుడు గుజరాత్ ప్రభుత్వం ఒక ఫొటోగ్రాఫ్‌ను విడుదల చేసింది. రాష్ట్రంలోని మూడు డజన్లకుపైగా అత్యంత సీనియర్ ఉన్నతాధికారులతో కూడిన తన మొత్తం సెక్రటేరియట్‌తో మోదీ కలసి దిగిన ఫొటో అది. కచ్ రాణా ప్రాంతంలో జరుగుతున్న సమావేశం మధ్యలో ఆ ఫొటో దిగారు. నేపథ్యంలో మిరిమిట్లు గొలిపే సుందర ఛాయాచిత్రాలను ప్రదర్శించడా నికి తప్పితే దీనికి మరే ప్రాధాన్యతా లేదు. కౌబాయ్ టోపీ, జాకెట్, సన్‌గ్లాసెస్ ధరించి సరికొత్త రూపం లో మోదీ ఆ సమావేశాన్ని నిర్వహించారు. మొన్న ఒబామాతో సమావేశంలో ఆ విలాసవంతమైన సూట్‌ను ధరించాలన్న పేలవమైన నిర్ణయం ప్రభా వాన్ని మోదీ ఏమాత్రం గుర్తించలేకపోయారు. ఇలాంటి వాటిపై మోదీ ఎవరి సలహా అయినా తీసు కుని ఉంటారని ఆయన చంచాలు తప్ప మరెవరైనా ఊహించి ఉండరు. దురదృష్టవశాత్తూ మోదీ తన్ను తాను మంచి శ్రోతగా ఇతరులు చెప్పే ప్రతిదాన్ని ఆలకించే వ్యక్తిగా మలచుకుంటున్నారనడానికి నాకెలాంటి తటపటాయింపూ లేదు. మోదీని అంచ నాలకు భిన్నమైన వ్యక్తిగా చూడాలనుకుంటున్న వారికే ఆ సూట్‌ని ఇచ్చి ఉంటే బాగుండేది. మోదీని ఒక ఫ్యాషన్ ్రపతిరూపంగా అభివర్ణిస్తూ బరాక్ ఒబామా చమత్కారయుతంగా చేసిన వ్యాఖ్యను ప్రధాని సరిగా గ్రహించారా అన్నది నా సందేహం. నిలువెల్లా తన పేరును ముద్రించిన ఆ అసభ్యకర మైన సూట్‌ను గుజరాత్‌లో కొన్ని వర్గాల ప్రజలు మాత్రమే ధరిస్తారు. గతనెలలో ఒక గుజరాతీ వాలా  వజ్రాలు పొదిగిన చెప్పులను గర్వంగా చూపిస్తున్న వార్తను కూడా మనం చూశాం. వీటన్నింటికీ పరా కాష్టగా అభిమానులు మోదీ విగ్రహాన్ని ఉంచిన ఆలయాన్ని ఒక గుజరాతీ మంత్రి ప్రారంభించ నున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.

 ఈలోగా ప్రసిద్ధ పత్రిక ఎకనమిస్ట్ ఇలా రాసిం ది: ‘ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో తన పార్టీ వైఫల్యానికి మోదీయే ప్రధాన బాధ్యత వహించాలన్న వాస్త వాన్ని అంగీకరించడం అసౌకర్యంగానే కనిపించ వచ్చు’. ‘మనం దేన్నయినా సాధించగలమని, ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింప జేయగలమని, పనిచేసే ప్రభుత్వాన్ని అందించగలమని, కోట్లాదిమందిని దారిద్య్రం నుంచి బయటపడవేయగలమనీ నమ్మ కాన్ని కలిగించిన నేతగా మోదీ దేశంలోనూ, విదేశా ల్లోనూ భావోద్వేగాలను ప్రేరేపించారు. కాని వాస్త వంగా ఈ వైపుగా చాలా కొద్ది మార్పులే జరిగాయి. ఢిల్లీ ఎన్నికలు సూచించినట్లుగా ప్రజల్లో నిరాశా నిస్పృహలు పెరిగిపోతున్నాయి’ అని ది న్యూయా ర్క్ టైమ్స్ పేర్కొంది. బీజేపీ సహచర మంత్రులు, దాని పార్లమెంటు సభ్యులూ ఉపయోగిస్తున్న ప్రజలను విడదీసే భాషను అడ్డుకోవడంలో మోదీ వైఫల్యం చెందడమే ఈ పరాజయానికి కారణమని విదేశీ వార్తా సంస్థల కథనాలు అంచనా వేశాయి.

 ఈ వాదనను నేను పాక్షికంగా మాత్రమే అంగీ కరిస్తాను. గత కొద్ది నెలలుగా బీజేపీ, వీహెచ్‌పీలు చేస్తున్న చేష్టలతో చాలామంది ప్రజలు విసిగిపో యారన్నది వాస్తవం. అయితే చాలావరకు గమ నిస్తే, ఆమ్‌ఆద్మీ పార్టీకి వచ్చిన ఓట్లలో చాలావరకు సానుకూలమైనవే ఉన్నాయని బోధపడుతుంది. అవి బీజేపీకి వ్యతిరేకమైనవిగా కనిపించడం లేదు.

 నా అవగాహన మేరకు చూస్తే, భావజాలం, లేదా కులం వంటి పలు కారణాలతో బీజేపీవైపు మొగ్గు చూపుతున్న ఓటర్లు ఇప్పటికీ ఆ పార్టీవైపే ఉన్నారు. ఇంత పరాభవంలో కూడా దాని ఓటు షేరు 32 శాతానికి తగ్గకపోవడం దీన్నే సూచిస్తోంది. ఇంత మద్దతుతో భారతదేశంలోని ఏ రాష్ట్రంలో అయినా బీజేపీ అవలీలగా గెలిచే పరిస్థితి ఉంది. అరవింద్ కేజ్రీవాల్ వైపు మళ్లిన 20 శాతం ఓట్లే బీజేపీని ఓడించాయి. దేశవ్యాప్తంగా భారీగా, తక్షణ మార్పును తీసుకువస్తానంటూ మోదీ చేసిన వాగ్దా నాన్ని ఢిల్లీ విషయంలో చేశారు కాబట్టే అరవింద్ కేజ్రీవాల్‌కు అఖండ విజయం సిద్ధించింది.
 అయితే భవిష్యత్తులో మోదీ ఈ స్థాయిలో ఓట ర్లను కోల్పోతారని నేను ఊహించడంలేదు. తన ప్రవర్తన విషయంలో కొన్ని తప్పులు చేసి ఉంటాడ న్నది నిజమే అయినప్పటికీ, తన రాజకీయాలకు ఢిల్లీ తీర్పు తిరస్కరణ వంటిదని మోదీ భావించడం లేదు. మోదీ దేశ రక్షకుడు అనే భావం దేశ ప్రజల్లో నేటికీ సజీవంగానే ఉంది. నిజానికి ‘ఆబ్ కీ బార్ మోదీ సర్కార్’ స్థాయిలోనే ‘పాంచ్ సాల్ కేజ్రీవాల్’ నినాదం కూడా అదే రీతిలో గుబాళిస్తోంది.
 (వ్యాసకర్త ప్రముఖ కాలమిస్టు, రచయిత)
Aakar.patel@icloud.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement