![భారత కీర్తిని చాటుతున్న మోదీ - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/71441864727_625x300_0.jpg.webp?itok=OJk_maZn)
భారత కీర్తిని చాటుతున్న మోదీ
ఒకప్పుడు ఆయన ఛాయ్‌వాలా. నేడు ప్రపంచ లోని పలువురు దేశాధినే తలు ఆయనతో మాట్లాడాలని తహతహలాడుతున్నారు. భారతశక్తిని కొత్త గా పరిచయం చేస్త్తున్న రెం డక్షరాలే-మోదీ. నరేంద్ర మోదీ ఏం చేశారు? ఆయన విదేశాంగ నీతి దేశాన్ని ఆసియా దేశాల్లో అగ్రస్థానంలో నిలిపింది. లుక్ ఈస్ట్ నీతితో దేశ సరిహద్దులను పటిష్టం చేయడం మీద పెట్టిన దృష్టి అద్వితీయం. నేపాల్ భూకంప బాధితుల పట్ల క్షణాల్లో స్పందించిన తీరు అభినందనీయం. 58 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఏనాడూ మన ఇరుగుపొరు గులతోనే కాదు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిజీ, మాల్దీవులు లాంటి దూర దేశాలతోనూ సత్సంబం ధాలకు ప్రయత్నించలేదు. కానీ మోదీ ఆయా దేశాలకు స్నేహహస్తం ఇచ్చారు.
ఒక పక్క చైనా మన సరిహద్ద్దు దేశాల్లో పాగా వేసి సవాలు విసురుతోంది. పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, భూటాన్‌లకు ఆర్థిక సాయాలంటూ, రోడ్లూ రైళ్లంటూ వారికి దగ్గరవుతూ భారత్‌ను దూరం చేస్తున్నది. చొచ్చుకువస్త్తున్న చైనాను నిలువరించగలిగే విదేశీ నీతిని యూపీఏ అమలు చేయలేకపోయింది.
మూడుగంటల ప్రయాణమే అయినా శ్రీలంక వెళ్లడానికి కాంగ్రెస్ ప్రధానుల కు 30 ఏళ్లు పట్టింది. 8 గంటలు ప్రయా ణిస్తే చేరే ఆస్ట్రేలియా వెళ్లడానికి 42 ఏళ్లు, 50 నిమిషాలలో చేరుకునే నేపాల్‌ను సందర్శిం చడానికి 35 ఏళ్లు పట్టాయి. అమెరికాలోని మ్యాడీ సన్ స్క్వేర్‌లో మోదీ చేసిన ప్రసంగం 120 కోట్ల మంది భారతీయుల చెవుల్లో ఇంకా మార్మోగుతూనే ఉంది. యూఏఈ వెళ్లి అక్కడ ‘భారత మాతకు జై’ అంటూ నినదించాడు. మోదీ మసీదు చూసొచ్చిన వెంటనే ఆ దేశ ప్రధాని మందిరానికి స్థలం కేటా యించారు. భారత్‌లో నాలుగు లక్షల యాభై వేల బిలియన్ డాలర్ల పెట్ట్టుబడులు పెట్టేందుకు షేక్‌లు ముందుకు రావడం వెనుక మోదీ కృషి ఉంది.
ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి? ఆయన ఎలా ఎదిగారు? చిరుప్రాయంలోనే రాష్ట్రీ య స్వయం సేవక్ సంఘ్‌లో చేరడం, దేశానికి ఉపయోగపడే విధంగా జీవితా న్ని మలచుకోవడమే దీని వెనుక ఉన్న సూత్రం. దత్తత కాన్సెప్ట్‌తో ఆయా గ్రా మాల స్వావలంబనకు బాటలు పరిచా రు. స్వచ్ఛ భారత్ అంటూ గాంధీజీ కల లను సాకారం చేసేందుకు కృషి చేస్తు న్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఐక్య రాజ్య సమితి ఘనంగా నిర్వహించేలా చేశారు.
దేశంలో బ్యాంక్ ఖాతాలు లేని దాదాపు 50 కోట్ల మందికి జన్‌ధన్ యోజనతో ఖాతాలు తెరిపిం చారు. ప్రమాద బీమా, ప్రధాన మంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజన పథకాలను రూ.2 కే అందించారు. ఏడాదికి రూ.330తో జీవిత బీమాతో కుటుంబా లను ఆర్థిక కష్టాల నుంచి విముక్తం చేయాలని సురక్ష యోజన తీసుకొచ్చారు. అసంఘటిత రంగంలోని కోట్లాది మంది శ్రమైకజీవులకు దన్నుగా రూ.12 తోనే అటల్ పెన్షన్ యోజన పథకాన్ని తెచ్చారు.
బాలికల చదువుకు బేటీ బచావో... బేటీ పడా వో పథకం కింద సుకన్యా సమృద్ధి యోజన పథ కాన్ని మోదీ ప్రవేశపెట్టారు. ఆడశిశువులను గర్భం లోనే చిదిమేసే విషసంస్కృతికి చరమగీతం పాడా లని ఒక యాచకుడిలా అభ్యర్థిస్తున్నానంటూ చెప్పిన మాట ఆయన అంతరంగాన్ని ఆవిష్కరిస్తున్నది. పంటనష్టపోయిన రైతులకు ఇప్పుడిస్తున్న పరిహా రాన్ని 50 శాతం పెంచాలని ఎన్డీఏ నిర్ణయించింది.
మోదీ బాధ్యతలు చేపట్టాక ప్రజాస్వామ్యబద్ధ రాజకీయాలు మొదలై నాయి. కాంగ్రెస్ పార్టీ ఏలికలు నెహ్రూ-గాంధీ కుటుంబ సభ్యులే. సమాజ్‌వాదీ పార్టీ, ఎన్సీపీల పరిస్థితి అంతే. ప్రాంతీయ పార్టీల న్నింటిని వారసులే శాసిస్తున్నారు. మోదీకి నా అనే వారెవరంటే సామాన్యులే. పరిశ్రమలు రావాలనీ, కుటుంబంలో ఒక్కరు సంపాదిస్తూ ఉంటే నలుగురు తినడం కాదనీ, అంతా దేశాభివృద్ధిలో భాగస్వాము లు కావాలనీ చెబుతూ సబ్ కే సాత్ సబ్ కా వికాస్ నినాదాన్ని ఎలుగెత్తారు. అందరి అభివృద్ధే దేశానికి శ్రీరామరక్ష అంటూ సాగుతున్న ప్రధానికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
- వ్యాసకర్త బీజేపీ ఏపీ సమన్వయకర్త
పురిఘళ్ల రఘురాం
raghuram.bjp@gmail.com