
మోదీ.. మీ మేలు మర్చిపోలేము
ముంబయి: నేపాల్ను అన్ని విధాలా ఆదుకుంటామని ప్రకటించిన భారత ప్రధాని నరేంద్రమోదీకి బాలీవుడ్ నటి, నేపాల్కు చెందిన మనీషా కోయిరాలా ధన్యవాదాలు తెలిపింది. టీవీలో నేపాల్ దుర్ఘటనను చూసి కన్నీటి పర్యంతమయ్యానని, నేపాల్ ను ఆదుకునేందుకు వెంటనే కదిలిన భారత్కు ఎంతమేర ధన్యవాదాలు చెప్పినా సరిపోవని అన్నారు. 'నేపాల్ ను చూశాక నా కళ్లలో కన్నీళ్లు సుడులు తిరిగాయి. ఈ సందర్భంగా సహాయం అంధించిన భారత్కు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. మీరు ఇంత తొందరగా స్పందించి చేసిన సాయాన్ని అన్ని వేళలా మా గుండెల్లో గుర్తుంచుకొని ఉంటాం.. ధన్యవాదాలు ప్రధాని నరేంద్ర మోదీ' గారు అంటూ ఆమె ట్విట్టర్, ఫేస్ బుక్ లలో తెలిపారు.