విద్యారంగంలో ప్రక్షాళన | need changes in our education system says chukka ramaiah | Sakshi
Sakshi News home page

విద్యారంగంలో ప్రక్షాళన

Published Tue, Aug 16 2016 12:54 AM | Last Updated on Thu, Jul 11 2019 5:12 PM

విద్యారంగంలో ప్రక్షాళన - Sakshi

విద్యారంగంలో ప్రక్షాళన

సందర్భం
నాలుగు దశాబ్దాల క్రితం నాటి ఎంసెట్‌ విధానాన్ని ఈనాటికీ కొనసాగి స్తున్నారు. అడిగే ప్రశ్నలకు కంఠస్థం చేస్తేనే విద్యార్థులు సమాధానాలు రాయగలుగుతారు. ఇది పిల్లల మెదళ్లపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.

ప్రభుత్వంలో ఏ సమస్య పరిష్కారం కావాలన్నా ఎన్నో పార్శ్వాలతో పరిశీలి స్తారు. ప్రభుత్వ యంత్రాంగం ఆలోచనా విధానం వేరుగా ఉంటుంది. అది చాలా క్లిష్టంగా ఉంటుంది. కానీ దాన్ని పరిష్కరించటంలో ప్రభుత్వ సామర్థ్యం కూడా కనిపిస్తుంది. దానికి ఎంసెట్‌ ప్రశ్నాపత్రం లీకేజ్‌ సమస్యను ఎదుర్కోవటంలో ప్రభుత్వం ప్రదర్శించిన వైఖరే అందుకు తార్కాణం. విద్యా రంగం ఊహించనంత అవినీతిమయంలో కూరుకు పోయింది. ఈ లీకేజీ తాత్కాలిక సమస్య. గత 25 ఏళ్లుగా ప్రశ్నాపత్రాలు లీక్‌ అవటం వలన దాన్ని నామమాత్రపు ఎంక్వయిరీలతో దాటవేయటం నేర స్తులకు అది పరోక్ష ప్రోత్సాహంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం అది అడుగులోనే తన వైఖ రిని, పట్టుదలను ప్రదర్శించింది. రాష్ట్ర ముఖ్య మంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఈ కేసును డీజీపీ అను రాగ్‌శర్మకు త్వరితగతిన అప్పగించారు. వృత్తిరీత్యా అనుభవం, విద్యారంగంపై ఆయనకున్న అనుబం ధంతో పట్టుదలతో విచారించారు. కేసీఆర్‌ ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టి అటు న్యాయస్థా నంలో లీగల్‌ వ్యవహారాలు చూస్తూ.. సమస్య పరి ష్కారానికి జాగ్రత్తగా అడుగులు వేశారు.

ఈ సమస్యను గత ప్రభుత్వాల తీరుగా దాట వేయకుండా, విద్యారంగాన్ని ప్రక్షాళన చేయాలనే తలంపు తెలంగాణ ప్రభుత్వంలో స్పష్టంగా కనిపి స్తుంది. విచారణ ఎంత నిజాయితీగా జరిగిందో, ప్రభుత్వ నిర్ణయం కూడా అంతే పట్టుదలతో జరి గింది. ఈ విషయంలో ప్రభుత్వాన్ని అభినందిం చాలి. విధాన నిర్ణేతలను అభినందించాలి. మీడి యాను అభినందించాలి. గతంలో కార్పొరేట్‌ రంగానికి అనుగుణంగా మీడియా ప్రచారం చేసింది. కానీ మీడియా ఇపుడు సమస్యను పరిష్క రించే వాతావరణాన్ని సృష్టించింది. ముఖ్యంగా రెండుసార్లు పరీక్షరాసిన విద్యార్థుల త్యాగం వారి నిజాయితీకి నిదర్శనం. తల్లిదండ్రుల ఆవేదనతో కొంత అలజడికి గురైనా దీర్ఘకాలిక సామాజిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని 3వసారి ఎంసెట్‌ పరీక్ష రాసేందుకు పిల్లలు సిద్ధమయ్యారు. ఇందుకు విద్యార్థుల, తల్లిదండ్రుల మానసిక పరి పక్వతను అభినందించాలి. ఇలాంటి లీకేజీ సమస్య తెలంగాణలో చివరిది కావాలనే నా కోరిక.

వైద్య విద్య అత్యంత కీలకమైనది. అదొక పెద్ద పరిశ్రమగా తయారైంది. మేనేజ్‌మెంట్‌ మెడిసన్‌ సీటు కోటి రూపాయల ధర పలుకుతుంది. మేనే జ్‌మెంట్‌ సీట్లపైన ఏదో ఒక నియంత్రణ లేకుంటే రాబోయే డాక్టర్లు తమ సీటు కోసం ఇచ్చిన డబ్బును ఏ విధంగానో భర్తీ చేసుకునే పరిస్థితి ఉంటుంది. మేనేజ్‌మెంట్‌ సీట్ల వ్యవహారం జనరల్‌ కేటగిరీపై కూడా పడుతుంది. కాబట్టి యాజమాన్య కోటా సీట్లను సంస్కరించుకోకుంటే ప్రస్తుత పరి స్థితి తిరిగి పునరావృతం అయ్యే అవకాశం ఉంది. ఈ పరీక్ష అయిన తర్వాత యాజమాన్య కోటా సీట్ల విషయమై ప్రత్యేక దృష్టి పెట్టాలి. 4 దశాబ్దాల క్రితం ఎంసెట్‌ ఏ ప్యాట్రన్‌ను ఇచ్చారో ఈనాటి వరకు అదే పద్ధతి కొనసాగుతోంది. 3 గంటల్లో 160 ప్రశ్నలను చేస్తే 159 మార్కులు వస్తున్నాయి. విద్యార్థులు ప్రశ్నలకు కంఠస్థం చేస్తేనే సమాధా నాలు రాయగలుగుతారు. ఇది పిల్లల మెదళ్లపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దీని వల్ల విద్యార్థు లలో సహజత్వం దెబ్బతింటుంది. ఈ విధానం వల్ల రొటీన్‌గా ఆలోచించే డాక్టర్లే తయారవుతారు.

మెడిసిన్‌ విద్య ప్రపంచంలో వేగవంతంగా మార్పులకు గురవుతుంది. కానీ డాక్టర్‌గా తయా రయ్యే వ్యక్తి మార్పులను అందుకునే పదును కలిగి ఉండాలి. అడ్మిషన్‌ పాలసీ మారనంతవరకు మన డాక్టర్లు మారుతున్న వైద్యరంగం వేగాన్ని అందు కోలేరు. ఒరిజినాలిటీ చూడాలి. కంటెంటుతోపాటు ఆలోచించేవారిగా పిల్లలను తయారు చేయాలంటే ఎంట్రెన్స్‌ విధానంలోనే సంపూర్ణ మార్పులు చేయాలి. ఈ 3వ ఎంసెట్‌ పరీక్ష అయ్యాక ఒక కమిటీనీ నియమించి అడ్మిషన్‌ పాలసీని కూడా మార్చాలి. దీనికోసం వివిధ దేశాల్లో ఏ పద్ధతి అవలంబిస్తున్నారో దానిపై అధ్యయనం జరగాలి. ఇది కుదరకపోతే ‘నీట్‌’ వ్యవస్థకైనా అప్పగించాలి.

మెడికల్‌ అడ్మిషన్లలో కూడా మార్పులు తీసు కురావాలి. దీనితో సహా నీట్‌ పరీక్ష అంటే ఉన్న భయాన్ని తొలగించాలి. ఇంటర్మీడియట్‌లో బోధనా పద్ధతులను కూడా సంస్కరించుకోవాలి. ప్రభుత్వం తీసుకున్న చర్యలను అభినందిస్తూ చేయవలసిన ఈ కార్యక్రమంపై సత్వర చర్యలు తీసుకుంటేనే మెరుగైన డాక్టర్లు తయారవుతారు. ఇప్పటికే రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ విద్య భ్రష్టు పట్టింది. ఇంజనీరింగ్‌ విద్య, డిగ్రీ కాలేజీల వ్యవస్థను కూడా ప్రక్షాళన చేయాలి. విద్యారంగ సమస్యల తీగను కదిలించారు. ఈ పనితో మొత్తం విద్యారంగం డొంకంతా కదిలింది. ప్రక్షాళన జర గాలి. అప్పుడే సమర్థ తెలంగాణ సాధ్యం.
http://img.sakshi.net/images/cms/2015-03/41426188468_295x200.jpg
వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త
శాసనమండలి మాజీ సభ్యులు
చుక్కా రామయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement