సాక్షి, పెద్దాపురం: ఏపీ అధికార టీడీపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. తెలుగుదేశం పార్టీని వీడుతున్న వారి సంఖ్య అంతకంతకు ఎగబాకుతోంది. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో టీడీపీ గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ప్రముఖ పారిశ్రామిక వేత్త గోలి రామారావు, ఆప్కో డైరెక్టర్ ముప్పన వీర్రాజు, మహారాణి సత్రం మాజీ చైర్మన్ కనకాల సుబ్రహ్మణ్యం, టీడీపీ కౌన్సిలర్లు ఆరేళ్ల వెంకట లక్ష్మి, విజ్ఙాపు రాజశేఖర్, గోకిన ప్రభాకర్‌తో పాటు 1000 మంది టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాకినాడ ఎంపీ తోట నరసింహం సమక్షంలో పార్టీ కండువాలతో వీరిని ఎమ్మెల్యే అభ్యర్ధి తోట వాణి, ఎంపీ అభ్యర్థి వంగా గీత, సమన్వయకర్త దవులూరి దొరబాబు వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు.
కృష్ణాజిల్లా అవనిగడ్డలో టీడీపీ నుంచి రాజేశ్వరస్వామి ట్రస్టు బోర్డు చైర్మన్ తన అనుచరులతో పాటు టీడీపీలో చేరారు. తోకోడూరు మండలం పోటుమీధలో 100 కుటుంబాలు, సాలేంపాలేం లో 50 కుటుంబాలు టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి వచ్చాయి. అవనిగడ్డ నియోజకవర్గ అభ్యర్థి సింహద్రి రమేష్ బాబు ఆద్వర్యంలో పార్టీ కండువాలతో వీరిని ఆహ్వానించారు. టీడీపీ కంచుకోట బందరులోనూ టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. పేర్నినాని ఆధ్వర్యంలో 50 కుటుంబాలు చేరిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. పార్టీ కండువాలతో పేర్ని నాని సాదరంగా ఆహ్వానం పలికారు.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్షుడు తోట భోగయ్యతో పాటు పలువురు టీడీపీ నాయకులు, వెయ్యి మంది యువకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నర్సాపురం ఎంపీ అభ్యర్థి
రఘురామ కృష్ణంరాజు, భీమవరం ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వీరికి స్వాగతం లభించింది.
Comments
Please login to add a commentAdd a comment