సాక్షి, విజయవాడ : ఇంటెలిజెన్స్ మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వర రావు అధ్వర్యంలో చంద్రబాబు నివాసానికి బెంగళూరు నుంచి హెలికాప్టర్‌లో డబ్బులు వస్తున్నాయని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి సి రామచంద్రయ్య ఆరోపించారు. గురువారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. లోకేష్ విశాఖపట్నంలో పారిశ్రామిక వేత్తలను కలిసింది డబ్బు మూటల కోసమేనా అని ప్రశ్నించారు. దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ సంస్థలను గౌరవించని చంద్రబాబు తిరిగి తనపై అవి పెత్తనం చేస్తున్నాయని ఆరోపణలు చేయడం హాస్యాస్పదం అన్నారు.
తనను కాపాడాలంటూ చంద్రబాబు ప్రజలకు పిలుపునివ్వడం విడ్డూరంగా ఉందని ఆయన పేర్కొన్నారు. సినీ తారలను రాజకీయాల్లోకి తెచ్చి ప్రచారం చేసుకున్న చరిత్ర చంద్రబాబుదేనని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి అద్దె తారాలను తెచ్చుకుంటోందని వైసీపీని ఎలా విమర్శిస్తారని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment