ఆ విలన్‌ని బాది బొక్కలో పెడతాం.. | Chandrababu Naidu Is A Villain Of AP He Will Be punished Says YS Jagan | Sakshi
Sakshi News home page

ఆ విలన్‌ని బాది బొక్కలో పెడతాం: వైఎస్‌ జగన్‌

Published Sat, Apr 14 2018 7:15 PM | Last Updated on Wed, Aug 8 2018 5:54 PM

Chandrababu Naidu Is A Villain Of AP He Will Be punished Says YS Jagan - Sakshi

సాక్షి, విజయవాడ:  అదిగో ఇంద్రలోకం, ఇదిగో మాయాబజార్‌ అంటూ గడిచిన నాలుగేళ్లుగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలకు సినిమా చూపిస్తున్నాడని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మండిపడ్డారు. బాబు చూపిస్తున్న ఆ లైవ్‌ సినిమా పేరు ‘‘ఓభ్రమరావతి.. ఓ రాజధాని.. ఓ అవినీతి కథ’’ అని, సినిమా అంతా ఉత్తమ విలన్‌, ఆయన గ్యాంగే కనిపిస్తారని ఎద్దేవా చేశారు. ఆ అన్యాయాలకు చరమగీతం గీతం పాడే రోజు తప్పక వస్తుందని, హీరో ఎంటరైతే.. విలన్‌ని బాది బొక్కలోవేయడం తథ్యమని తెలిపారు. 136వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శనివారం విజయవాడలోని చిట్టినగర్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

‘ఓభ్రమరావతి.. ఓ రాజధాని.. ఓ అవినీతి కథ’ సినిమా ఇదే: నాలుగేళ్ల కిందట మొదలైన సినిమా ప్రదర్శన ఇప్పటికీ కొనసాగుతున్నదని, అనేక మోసాలు, భారీ ఎత్తున ముడుపులు, బినామీలకు వరాలు ఒకవైపైతే, స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతుల నోట్లో మట్టికొట్టడం మరోవైపు చూడొచ్చని జగన్‌ అన్నారు. ‘‘ బాబుగారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదలైందీ సినిమా. రాజధాని నూజివీడులో వస్తుందని, నాగార్జున యూనివర్సిటీ దగ్గరని, ఆ తర్వాత ఏలూరు రోడ్డులో అని రకరకాల లీకులిచ్చారు. అయితే చంద్రబాబు స్కెచ్‌ గీసింది మాత్రం వేరు.. ముందస్తుగానే తాను, తన బినామీలతో రాజధాని చుట్టుపక్కల భూములను కొనుగోలుచేశారు. ఆ వ్యవహారం పూర్తయిన తర్వాతే రాజధానిని ప్రకటించారు. అలా రైతుల్ని మోసం చేసి, ఇన్‌సైడెడ్‌ ట్రేడింగ్‌ చేసిన చంద్రబాబును బొక్కలో పెట్టి బాదాలా వద్దా? రాజ్యాంగ రహస్యాలను కాపాడతానని ప్రమాణం చేసిన ఆయనే బినామీలతో భూములు కొనిపించాడు. ఆ తర్వాత ల్యాండ్‌ పూలింగ్‌ లో బినామీల్లో చాలా మంది భూముల్ని బయటేసి, కొందరివి మాత్రం తీసుకున్నాడు.. వాటిని కూడా బిజినెస్‌ జోన్‌లోకి తీసుకొచ్చి, సాధారణ రైతుల భూములను మాత్రం ఫార్మింగ్‌ జోన్‌లో పెట్టి అన్యాయం చేశాడు. భూములు ఇవ్వని రైతులను నానా హింసలు పెట్టాడు. ఇది అన్యాయమని ప్రశ్నిస్తే.. వీళ్లు రాజధానికి వ్యతిరేకం అని బురదజల్లుతాడు. అంతేనా, భూములివ్వకుండా పంటలు వేసుకుంటే, ఆ పంటల్ని తగలబెట్టాడు. అరటితోటల్ని నరికేయించాడు. పోలీస్‌ స్టేషన్లలో భూ సెటిల్మెంట్లు చేయించాడు. చివరికి అసైన్డ్‌ భూములు, లంక భూములనూ వదల్లేదు. పేదవాడి భూమి జోలికి పోతే పాపం తగుతులుందని అనుకుంటారు.. కానీ చంద్రబాబు రాక్షసుడు, దెయ్యం కాబట్టి వాటినీ అడ్డగోలుగా దోచేశాడు. 

అతటితో సినిమా అయిపోలేదు: నాలుగేళ్లలో 23 సార్లు విదేశీ పర్యటనలు.. సింగపూర్‌, దుబాయ్‌, అమెరికా, జపాన్‌... ఏ దేశానికి వెళితే ఆ దేశంలా అమరావతిని కడతానంటాడు. పిట్టలదొరమాదిరి అంతులేని మాటలు చెబుతాడు. ఇదంతా ఏమిటంటే.. రాజధాని భూములను తనకు నచ్చినవాళ్లకు, నచ్చిన రేటుకు అమ్ముకుందామని చేస్తున్న కుట్ర మాత్రమే. నాలుగేళ్లలో శాశ్వత నిర్మాణం ఒక్కటీ లేదు. తాత్కాలిక అసెంబ్లీ, సెక్రటేరియట్‌లకోసం ఒక్క అడుగు స్థాలానికి 10 వేల రూపాయలు ఖర్చుపెట్టారు. అసలు రాజధాని కట్టే ఉద్దేశమే ఈ విలన్‌కి ఉంటే.. అంతకంటే తక్కువ ఖర్చుతో శాశ్వత నిర్మాణాలే కట్టేవాడు. ఇంకోసారేమో బాహుబలి సినిమాకి పోయి సెట్లు బాగున్నాయని ఆ డైరెక్టర్ను పిలిపిస్తాడు. రాజధాని కట్టే ఉద్దేశం ఉంటే చంద్రబాబు తన ఇంద్రభవనాన్ని హైదరాబాద్‌లో కాకుండా ఇక్కడే కట్టుకునేవాడు కదా! రైతుల్ని మభ్యపెట్టడానికి ఫ్లాట్లు ఇస్తానంటాడు. అక్కడ కరెంటు, నీళ్లు, రోడ్లు ఏవీ ఉండవు. అదిగో నీ ఫ్లాటు అని ఎడారిని చూపిస్తాడు. ఇదీ నాలుగేళ్లుగా నడుస్తోన్న ‘ ఓ భ్రమరావతి.. ఓ రాజధాని.. ఓ అవినీతి కథ..’ సినిమా. ఈ కథలో హీరో లేరు. ఉన్నదంతా ఉత్తమ విలనే. హీరో వచ్చాడంటే.. విలన్‌ని తన్ని బొక్కలో వేయడం ఖాయం.

బాబు చూపిస్తున్న రెండో సినిమా: ‘ఓభ్రమరావతి.. ఓ రాజధాని.. ఓ అవినీతి కథ’ తోపాటు చంద్రబాబు ప్రజలకు రెండో సినిమా చూపించడం మొదలుపెట్టాడు. టైటిట్‌.. ‘‘ప్రత్యేక హోదా ఓ మాయాజాలం’’. కథ వేరైనా సేమ్‌ విలనిజం, అదే మోసకారితనం. నాలుగేళ్లు ఆ సినిమా చూసి విసుగెత్తిపోయి, మీ అందరి తరఫునా ఆయనను ప్రశ్నిస్తున్నా.. దమ్ము, ధైర్యం ఉంటే బాబు సమాధానాలు చెప్పాలి. లేదా ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. నాటి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా తీర్మానాన్ని ప్లానింగ్‌ కమిషన్‌కు పంపినా, చంద్రబాబు దానిని ఎందుకు పట్టించుకోలేదు? 2016, సెప్టెంబర్‌ 8 అర్ధరాత్రి నాటి అరుణ్‌జైట్లీ స్టేట్‌మెంట్‌కి, ఇటీవల పార్లమెంట్‌ సమావేశాలప్పటి స్టేట్‌మెంట్‌కి తేడా ఏముంది? నాడు హోదా బదులు ప్యాకేజీ ఇస్తామంటే ఒప్పుకున్నది ఈ చంద్రబాబే కాదా, ప్యాకేజీని స్వాగతించి లడ్డూ ప్యాకెట్లను ఢిల్లీకి తీసుకెళ్లలేదా, మరి ఇప్పుడు మాత్రం చంద్రబాబు రియాక్షన్‌ మారింది ఎందుకో! ఒకవైపు రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతుంటే, చంద్రబాబు మాత్రం.. ఏపీ విదేశాలకంటే వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, 20 లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలు వచ్చాయని చెప్పడం ధర్మమేనా, ఇలాంటి తప్పుడు సమాచారంతో జనాన్ని పక్కదోవ పట్టించడం న్యాయమేనా, హోదా కోసం వైఎస్సార్‌సీపీ బంద్‌కు పిలుపిస్తే, బస్సులు తిప్పుతాడు, యువభేరిలు నిర్వహిస్తే విద్యార్థులను వేధిస్తాడు. మోదీ వచ్చిన సందర్భంలో ప్రతిపక్ష నాయకుడు దీక్ష చేస్తోంటే.. భగ్నం చేయిస్తాడు.  అసలు వైఎస్సార్‌సీపీగానీ అవిశ్వాసం పెట్టిఉండకపోతే టీడీపీ పెట్టి ఉండేదేనా? మా ఎంపీలు జాతీయ స్థాయిలోఅందరినీ కలిసి మద్దతు కూడగట్టిన తర్వాత ఇదే పెద్దమనిషి యూటర్న్‌ తీసుకొని అవిశ్వాసమని ముందుకొస్తాడు. తీరా రాజీనామాల దగ్గరొచ్చేసరికి మళ్లీ పారిపోయాడు. అఖిలపక్షం పేరుతో డ్రామాలు మొదలుపెట్టారు. నిరసనలు, ఆందోళనలు చెయ్యకుండా కేంద్రం దిగొస్తుందా.. ఇలా సాగుతోంది బాబు ‘‘ప్రత్యేక హోదా ఓ మాయాజాలం’’. సినిమా..’

ఇక్కడి ఎమ్మెల్యే బీకాంలో ఫిజిక్స్‌ చదివాడట..
విజయవాడలోని చిట్టినగర్‌ పక్కనే రైల్వే స్థలంలో రెండు వేల ఇళ్లులున్నాయి. అక్కడ నివసిస్తున్న పేదలంతా పట్టాలు ఇప్పించమని ఎప్పటినుంచో అడుగుతున్నారు. ఆమేరకు రైల్వే వారికి వేరొక స్థలాన్ని ఇచ్చి, ఇళ్లను పేదల పేరుమీద రిజిస్ట్రేషన్‌ చేయాలన్న ఆలోచన ఈ పాలకు రాదు. ముఖ్యమంత్రి పక్కనే ఉన్నా పట్టించుకోడు. ఇక ఇక్కడి ఎమ్మెల్యే బీకాంలో ఫిజిక్స్‌ చదివానంటాడు. డబ్బులకు అమ్ముడుపోయినా, అభివృద్ధి కోసమే వెళ్లానని చెప్పుకుంటాడాయన. ఆయనకూ ఈ పేదలు కనిపించరు. నాలుగేళ్ల చంద్రబాబు పాలన నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకున్నట్లుంది. రాజధానిలో ఒక్క ఇటుకా పడదు... స్కాంలు మాత్రం జరుగుతాయి. అభివృద్ధి, పేదలు ఆయనకు గుర్తుకురావు అవినీతి మాత్రం బాగా తెలుసు. ఎన్నికలప్పుడు ‘ఆయనొస్తే బాగుంటుంది..’ అని టీవీల్లో యాడ్స్‌ ఇచ్చారు. అవును, ఆయన వచ్చారు. ఇప్పుడేం జరిగింది.. విజయవాడలో కనీవినీ ఎరుగని రీతిలో  కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌ నుంచి దుర్గమ్మ గుడిలో తాంత్రిక పూజల ఘటనలు జరిగాయి. ఆర్థిక అవసరాలను అడ్డంపెట్టుకుని మహిళల జీవితాలతో ఆటలాడుకురు టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు. ఆ దుశ్వాసనులను జైల్లోపెట్టాల్సిందిపోయి, ఎంక్వైరీ పేరుతో కాపాడుతారు బాబుగారు.

ఇక్కడి ఎమ్మెల్యే బీకాంలో ఫిజిక్స్‌ చదివాడట..
విజయవాడలోని చిట్టినగర్‌ పక్కనే రైల్వే స్థలంలో రెండు వేల ఇళ్లులున్నాయి. అక్కడ నివసిస్తున్న పేదలంతా పట్టాలు ఇప్పించమని ఎప్పటినుంచో అడుగుతున్నారు. ఆమేరకు రైల్వే వారికి వేరొక స్థలాన్ని ఇచ్చి, ఇళ్లను పేదల పేరుమీద రిజిస్ట్రేషన్‌ చేయాలన్న ఆలోచన ఈ పాలకు రాదు. ముఖ్యమంత్రి పక్కనే ఉన్నా పట్టించుకోడు. ఇక ఇక్కడి ఎమ్మెల్యే బీకాంలో ఫిజిక్స్‌ చదివానంటాడు. డబ్బులకు అమ్ముడుపోయినా, అభివృద్ధి కోసమే వెళ్లానని చెప్పుకుంటాడాయన. ఆయనకూ ఈ పేదలు కనిపించరు. నాలుగేళ్ల చంద్రబాబు పాలన నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకున్నట్లుంది. రాజధానిలో ఒక్క ఇటుకా పడదు... స్కాంలు మాత్రం జరుగుతాయి. అభివృద్ధి, పేదలు ఆయనకు గుర్తుకురావు అవినీతి మాత్రం బాగా తెలుసు. ఎన్నికలప్పుడు ‘ఆయనొస్తే బాగుంటుంది..’ అని టీవీల్లో యాడ్స్‌ ఇచ్చారు. అవును, ఆయన వచ్చారు. ఇప్పుడేం జరిగింది.. విజయవాడలో కనీవినీ ఎరుగని రీతిలో  కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌ నుంచి దుర్గమ్మ గుడిలో తాంత్రిక పూజల ఘటనలు జరిగాయి. ఆర్థిక అవసరాలను అడ్డంపెట్టుకుని మహిళల జీవితాలతో ఆటలాడుకురు టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు. ఆ దుశ్వాసనులను జైల్లోపెట్టాల్సిందిపోయి, ఎంక్వైరీ పేరుతో కాపాడుతారు బాబుగారు. ఇక్కడి ఎంపీ అక్రమంగా బస్సులు తిప్పుతారు. అడ్డుకున్న ఐఏఎస్‌పై దౌర్జన్యం చేస్తారు. కేసులు పెట్టాల్సిన చంద్రబాబేమో పంచాయితీ చేస్తాడు. పేదల భూముల్ని రెగ్యులరైజ్‌ చేయడానికి మనసురాదు కానీ స్వాంత్ర్యసమరయోధుల భూమిని కబ్జా చేయడానికి మాత్రం టీడీపీ నేతలు ముందుకొస్తారు. కృష్ణా నదిలో లైసెన్స్‌లు లేకుండా బోట్లను తిప్పి ఏకంగా 23 మందిని చంపేశారు. చివరికి బోట్లను కూడా వదలకుండా లంచాలు దండుకుంటున్న పరిస్థితి. ఆంధ్రరాష్ట్రాన్ని 2020 కల్లా సింగపూర్‌లా, 2050 కల్లా జపాన్‌లా, 2080 నాటికి అమెరికా మారుస్తానంటున్న చంద్రబాబు పక్కనున్న దుర్గగుడి ఫ్లైఓవర్‌ను మాత్రం పూర్తిచెయ్యలేడు. ఒక ఫ్లైవోవర్‌ కట్టలేని ఆయన అమెరికా గురించి మాట్లాడతారు. అన్ని అనుమతులు ఉన్నా, ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డును నిర్మించలేని దుస్థితి

420 చంద్రబాబు దీక్ష చేస్తాడట: చంద్రబాబు తన పుట్టినరోజున నిరాహార దీక్ష చేస్తానని చెప్పాడు. ఎంపీల చేత రాజీనామాలు చేయించకపోగా.. ఇవాళ ఆయనే కొంగజపం చేస్తాడట. హోదాకు వెన్నుపోటు పొడిచిన మనిషే.. దీక్షకు కూర్చుంటానడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. నాలుగేళ్లలో చంద్రబాబు చేసిన మోసాలు అన్నీ ఇన్నీ కావు. రైతు రుణాల మాఫీ, డ్వాక్రా మహిళలను మోసం చేశాడు. కానీ సిగ్గులేకుండా బుకాయిస్తూ మాఫీ చేసేశాడను అని చెబుతాడు. ఉద్యోగాలు ఇచ్చేశానని, ఇళ్లు కట్టించేశానని చెప్పుకుంటాడు. మోసాలు చేసిన ఈయన చేసి తప్పు కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేస్తాడు. ఇలాంటి మోసకారిని చంద్రబాబును పొరపాటున క్షమిస్తే.. రేపొద్దున మైక్‌ పట్టుకునొ మీదగ్గరికొచ్చి ఇంటికో కేజీ బంగారం, బెంజ్‌కారు ఇస్తానని అంటాడు. అయినా జనం నమ్మరుకాబట్టి మనిషికి మూడు వేలు ఇస్తానంటాడు. అబద్దాలు, మోసాలు చేసే ఇలాంటి నాయకులను బంగాళాఖాతంలో కలిపే పరిస్థితి రావాలి. వ్యవస్థలో మార్పు ఒక్క జగన్‌ వల్లేరాదు. జగన్‌కు మీ అందరి తోడు కావాలి. 

పిల్లల చదువులకు ఎంతైనా భరిస్తాం: అలా రేప్పొద్దున దేవుడు ఆశీర్వదించి, మీ అందరి దీవేనలతో మన ప్రభుత్వం వస్తే.. ఏం చెయ్యబోతున్నామో నవరత్నాల ద్వారా మీకు చెప్పా. ఒక్కసారి మీ గుండెలపై చేతులు వేసుకొని ప్రశ్నించుకోండి. మీ పిల్లలను ఇంజినీర్లు, డాక్టర్లుగా చదివించే పరిస్థితి ఉందా? ఇంజినీరింగ్‌ ఫీజులు లక్షల్లో ఉన్నాయి. ప్రభుత్వం మాత్రం ముష్టి వేసినట్లు రూ.35 వేలు ఇస్తుంది. అదే నాన్నగారు వైయస్‌ఆర్‌ పాలన గర్తుచేసుకోండి. పేదవారి కోసం నాన్న ఒక్క అడుగు ముందుకు వేస్తే నాన్నగారి కొడుకుగా జగన్‌ రెండు అడుగులు ముందుకు వేస్తాడు. మీ పిల్లలను మీ ఇష్టం వచ్చినది చదివించండి..నేను భరిస్తా..ఎన్ని లక్షలైనా ఫర్వాలేదు. పిల్లలు హాస్టల్‌లో ఉండేందుకు అయ్యే ఖర్చుల కోసం రూ.20 వేలు ప్రతి ఏటా చెల్లిస్తాం. అంతేకాదు బిడ్డలను బడికి పంపించే తల్లులకు ఏడాదికి రూ.15 వేలు ఇస్తాం. ఈ రాష్ట్రంలో చదువు రాని వారు 32 శాతం మందికి చదువు రావడం లేదు. అలాంటి వారికి తోడుగా ఉండేందుకు మనందరి ప్రభుత్వం వచ్చాక చదువుల విప్లవం తీసుకువస్తా. నవరత్నాలకు సంబంధించి ఏవైనా సలహాలు ఇవ్వాలనుకుంటే ఎవరైనా ఇవ్వొచ్చు’’ అని జగన్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement