వైఎస్సార్‌సీపీలో చేరిన కాంగ్రెస్‌ కార్యకర్తలు | Congress Workers Joins IN YSRCP In Nizamabad | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో చేరిన కాంగ్రెస్‌ కార్యకర్తలు

May 9 2018 3:15 PM | Updated on Mar 18 2019 7:55 PM

Congress Workers Joins IN YSRCP In Nizamabad - Sakshi

సాక్షి, నిజమాబాద్‌ : జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, 100 మంది యువకులు బుధవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర నేతలు నాగదేశి రవికుమార్‌, పుల్లారెడ్డి, సంజీవ రావ్‌, బొడ్డు సాయినాథ రెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డి, వెంకట రమణ సమక్షంలో వారు పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నేతలు మాట్లాడుతూ.. తెలం‍గాణలో వైఎస్సార్‌సీపీ బస్సు యాత్ర చేపట్టనుందని వెల్లడించారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన సంక్షేమ పథకాలని​ ప్రజల్లోకి తీసుకెళ్లేవిధంగా.. జూన్‌ మొదటి వారంలో చేవెళ్ల నుంచి  జన చైతన్య బస్సు యాత్రను చేపట్టనున్నట్టు నేతలు తెలిపారు. ఈ బస్సు యాత్ర 54 నియోజకవర్గాలో కొనసాగుతుందని వారు ప్రకటించారు.  టీఆర్‌ఎస్‌ పార్టీ వైఫల్యాలు ప్రజలకు వివరిస్తామన్నారు. మాటల గారడీ చేస్తున్న సీఎం కేసీఆర్‌.. దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తానన్న హామీ నిలబెట్టుకోలేదన్నారు. దళితులకు మూడెకరాల భూమి విషయంలో కూడా సీఎం వారికి అన్యాయం చేశాడని విమర్శించారు. రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని కేసీఆర్‌ నీరుగార్చారని వారు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement