జగన్‌ను కలిసిన కొరిశపాడు గ్రామస్తులు
పీసీపల్లి: యర్రంచినపోలిరెడ్డి ఎత్తిపోతల పథకం బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని కొరిశపాడు గ్రామస్తులు సోమవారం ప్రజా సంకల్పయాత్రలో జగన్ ను కలిసి విన్నవించారు. రూ. 177 కోట్లతో ప్రారంభించిన ఈ ఎత్తిపోతల పథకం కింద 100 మంది నిర్వాసితులైన తూరుపుపాలెం, పెద్దూరు గ్రామస్తులకు ముంపు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. పనులు 50 శాతం మాత్రమే పూర్తయ్యాయని మిగిలిన పనులు పూర్తి చేసి బాధితులకు నష్ట పరిహారం చెల్లించాలని కోరారు.
దివ్యాంగులకు సాగు భూములివ్వండి
చీరాలటౌన్: దివ్యాంగులకు రాష్ట్రంలో ఉన్న దేవాలయ భూములు సాగు కోసం అందించాలని.. ఆ భూముల్లో బోర్లు వేసేలా చర్యలు తీసుకోవాలని వెంకటాపురానికి చెందిన జార్షి లక్ష్మీనారాయణ ప్రజాసంకల్పయాత్రలో వైఎస్ జగన్‌ను కలిసి విన్నవించారు. దివ్యాంగుల పట్ల టీడీపీ ప్రభుత్వం వివక్షత చూపుతూ సబ్సిడీ రుణాలను అందించడం లేదని, తమకు దేవాదాయ భూములను సాగుకు అందించి ఆదుకోవాలని అభ్యర్థించారు.
Comments
Please login to add a commentAdd a comment