
సరిహద్దుల్లో పరిస్థితులు ఇలానే ఉంటే నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని అవుతారు.
సాక్షి, అనంతపురం : టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు విషయంలో తనకు కొన్ని అభ్యంతరాలున్నాయన్నారు. టీడీపీలో ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని తెలిపారు.
టీడీపీలో ప్రస్తుతం ఉన్న 40 శాతం మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చకపోతే సీఎం చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టమేనని చెప్పారు. ఇక సరిహద్దుల్లో పరిస్థితులు ఇలానే ఉంటే నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు.