సాక్షి, హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్డెట్‌పై టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్విటర్ వేదికగా ఆయన తన ఆవేదనను తెలియజేశారు. కేంద్ర బడ్జెట్ తెలంగాణకు తీవ్ర అసంతృప్తిని మిగిల్చిందని వ్యాఖ్యానించారు. ఎకనామిక్ సర్వే తెలంగాణ రాష్ట్ర చర్యలను ప్రశంసిస్తూ ప్రత్యేక సాయం అందించాలన్న వినతులను ఆర్థిక మంత్రి పట్టించుకోలేదని పేర్కొన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ స్కీమ్‌లను నీతి ఆయోగ్ ప్రశంసించిందని తెలిపారు. రూ.24వేల కోట్లను కేటాయించాలని నీతి ఆయోగ్ రికమెండ్ చేస్తే.. బడ్జెట్‌లో కనీసం రూ.24 కూడా కేంద్రం ఇవ్వలేదని మండిపడ్డారు. కాళేశ్వరం లేదా పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని తెలంగాణ డిమాండ్ చేస్తూనే ఉందని, కానీ ఈ అంశాలను కనీసం బడ్జెట్‌లో ప్రస్తావించలేదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment