పట్నా: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. బిహార్‌లో ఆదివారం ఎన్నికల శంఖారావాన్ని సీఎం నితీష్‌తో కలిసి మోదీ పూరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ప్రతిపక్షాలపై విమర్శల వర్షం కురిపించారు. సైనికులు జరిపిన మెరుపు దాడులకు విపక్షాలు రుజువు అడుగుతున్నాయని, భారత సైన్యాయ్యాన్ని కించపరిచే విధంగా కొన్ని పార్టీలు వ్యవహరిస్తున్నాయని మోదీ ఆరోపించారు. భారత్ ఇంతకు ముందులా లేదని, సరికొత్త దేశాన్ని తమ ప్రభుత్వం నిర్మిస్తోందని వ్యాఖ్యానించారు. సైనికులపై దాడులను తమ ప్రభుత్వం సంహించబోయని ప్రధాని మరోసారి స్పష్టం చేశారు.
దేశానికి కాపాలాదారుడు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, అవినీతిని ఏమాత్రం దరిచేయానీయమని మోదీ పేర్కొన్నారు. పట్నాలోని గాంధీ మైదానంలో జరిగిన ప్రచార సభలో నితీష్ కుమార్, కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్‌తో కలిసి మోదీ సభలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని 40 లోక్‌సభ స్థానాల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించి తీరుతుందని వారు ధీమా వ్యక్తం చేశారు. కాగా తొమ్మిదేళ్ల తరువాత మోదీ, నితీష్ కలిసి వేదికను పంచుకున్నారు. 2013లో ఎన్డీయే కూటమి నుంచి జేడీయూ బయటకు వచ్చిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment