సాక్షి, అమలాపురం : వీధికో గూండా ఉండే ఉత్తరప‍్రదేశ్‌లాంటి రాష్ట్రంలో దళిత మహిళ అయిన మాయావతిని అక్కడ ప్రజలు ముఖ్యమంత్రిని చేశారని, అందుకే ఆమె కాళ్లు మొక్కినట్లు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. సోమవారం ఆయన తూర్పు గోదావరి జిల్లా అమలాపురం బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా టీడీపీ నేత తోట త్రిమూర్తులుపై విరుచుకుపడ్డారు. ‘తోట త్రిమూర్తులను నేను ఎప్పుడూ పార్టీలోకి రమ్మని అడగలేదు.
2014లో మేము మద్దతు ఇస్తేనే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తోట త్రిమూర్తులు లాంటి వ్యక్తులను చెంచాలు అంటారు. త్రిమూర్తులు జాతి గౌరవం కాపాడు. నేను నా అన్న చిరంజీవి మాటే వినను. నీ మాట ఎలా వింటాను. తెలుగుదేశం నాయకులు బానిస బతులుకు బ్రతుకుతున్నారు. టీడీపీ, జనసేన ఒకటే అంటూ అవగాహన లేని మాటలు మాట్లాడకండి’ అంటూ ధ్వజమెత్తారు. కాగా ఏపీలో బీఎస్పీతో కలిసి జనసేన ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఎస్పీ అధినేత్రి మాయావతి వచ్చిన సందర్భంగా పవన్ కల్యాణ్ కాళ్లు మొక్కారు.
Comments
Please login to add a commentAdd a comment