
సాక్షి, అనంతపురం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 45వ రోజు కదిరి నియోజకవర్గంలోని నంబుల పులకుంట మండల కేంద్రం నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి దిగువ తువ్వపల్లి క్రాస్, కొత్తపల్లి క్రాస్, మల్లెంవారిపల్లి మీదుగా పాపన్నగారిపల్లికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు భోజన విరామం తీసుకుంటారు. అనంతరం పాదయాత్ర పెడబల్లి మీదుగా ప్రారంభమై బలిజపల్లిలో ముగియనుంది. సాయంత్రం బలిజపల్లి చేరుకున్న వైఎస్ జగన్ అక్కడ పార్టీ జెండాను ఆవిష్కరించనున్నారు.