
వైఎస్సార్సీపీ సమన్వయకర్త రౌతు సూర్యప్రకాశ రావు
తూర్పుగోదావరి : ఓట్ల తొలగింపుపై చర్యలు తీసుకోవాలంటూ రాజమహేంద్రవరం త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో వైఎస్సార్‌సీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ రాజమహేంద్రవరం సమన్వయకర్త రౌతు సూర్యప్రకాశ రావు మాట్లాడుతూ.. ఫారం-7 పేరుతో వైఎస్సార్‌సీపీకి చెందిన వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. పార్టీ మారేందుకు అంగీకరించని వారిని రాజమహేంద్రవరంలో టీడీపీ నాయకులు కేసులతో భయపెడుతున్నారని అన్నారు. వైఎస్సార్సీపీ ఓటర్లు అసలు పోలింగ్ బూత్‌లకే రాకుండా ఉండేందుకు కుట్రలు పన్నుతున్నారని రౌతు ఆరోపించారు.